ETV Bharat / city

బాలల జనాభాలో బిహార్‌ ఫస్ట్‌.. తెలంగాణ లాస్ట్‌! - తెలంగాణలో నాలుగేళ్లలోపు చిన్నారులు తక్కువ

తెలంగాణలో బుజ్జాయిలు తక్కువ మంది ఉన్నారట. నాలుగేళ్లలోపు బాలల జనాభాలో బిహార్‌ మొదటి స్థానంలో ఉంటే... తెలంగాణ చివరి స్థానంలో ఉంది. కుటుంబ నియంత్రణ కార్యక్రమాలతో పాటు, పిల్లలను తక్కువ కనడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో 4 ఏళ్లలోపు బాలల జనాభా తక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ విషయాలను జాతీయ నమూనా సర్వే నివేదికలో వెల్లడించింది.

telangana
telangana
author img

By

Published : Jul 5, 2020, 8:30 AM IST

తెలుగు రాష్ట్రాల్లో నాలుగేళ్లలోపు బాలలు చాలా తక్కువగా ఉన్నారు. గ్రామీణ జనాభాలో బాలల శాతం విషయంలో బిహార్‌ అగ్రస్థానంలో, తెలంగాణ చిట్టచివరన ఉన్నాయని 2016-18 కాలానికి నిర్వహించిన జాతీయ నమూనా సర్వేలో వెల్లడైంది. ఈ వివరాలను కేంద్రం విడుదల చేసింది. మఖ్యాంశాలు..

  • నాలుగేళ్లలోపు వయసున్న బాలల జనాభా అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 5.6, తెలంగాణ 5.9తో వెనుకబడి ఉన్నాయి. కుటుంబ నియంత్రణ కార్యక్రమాలతో పాటు, పిల్లలను తక్కువ కనడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో 4 ఏళ్లలోపు బాలల జనాభా తక్కువగా ఉన్నట్లు తేలింది.
  • గ్రామీణ ప్రాంతాల్లో అతి తక్కువ బాలల జనాభా తెలంగాణలో 5.3, పట్టణ ప్రాంతాల బాలలు ఏపీలో అత్యల్పంగా 5.4 ఉన్నారు.
  • దేశంలోనే అత్యధికంగా బిహార్‌ జనాభాలో 11.5 శాతం 4ఏళ్లలోపు బాలలే ఉన్నారు. గ్రామీణ బిహార్‌లో 11.9 శాతం 4ఏళ్లలోపు వారే కాగా తెలంగాణలో అత్యల్పంగా 5.3 శాతమే.
  • 14 ఏళ్ల వరకూ బాలల జనాభా తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా ఉండటం గమనార్హం.
  • అసలు పెళ్లికానివారి శాతంలో బిహార్‌ అగ్రస్థానంలో, ఏపీ చిట్టచివరన ఉన్నాయి.
  • పెళ్లయ్యాక విడాకులు తీసుకుని విడిపోయినవారు, జీవిత భాగస్వామి మరణించడం వంటి కారణాలతో ఒంటరిగా ఉన్న జనాభా శాతం బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా పేరొందిన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణలు వరుసగా తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
  • పెళ్లయిన తర్వాత విడాకుల వల్ల గానీ, మరణాల వల్ల గానీ ఒంటరిగా ఉన్న జనాభాలో పురుషుల కన్నా మహిళలు ఐదారు రెట్లు.. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఒంటరివారు తెలంగాణ జనాభాలో పురుషులు 2 శాతముంటే మహిళలు 8.2 శాతమున్నారు. ఏపీలో పురుషులు 2.7, మహిళలు 8.9 శాతమున్నారు. వందశాతం అక్షరాస్యతతో దేశంలోనే ముందున్న కేరళలో ఒంటరి పురుషులు 1.4 అయితే మహిళలు ఏకంగా 10.6 శాతమున్నారు.
  • దేశ జనాభాలో 70 ఏళ్లు దాటినవారు కేవలం 3.1 శాతమున్నారు. ఏపీ జనాభాలోనూ ఇంతే ఉండటం విశేషం. తెలంగాణలో వీరిది 2.8 శాతమే. ఏపీలో 70 ఏళ్లలోపు మరణించేవారు 69.3, తెలంగాణలో 67.1 శాతం ఉన్నారు.
  • ప్రతి వెయ్యి మంది బాలురకు బాలికల సంఖ్య తెలంగాణలో 901, ఏపీలో 920 ఉంది. జాతీయ సగటు 899.
  • తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో బాలికలు 875 మందే ఉన్నారు. జాతీయ పట్టణ సగటు 897తో పోలిస్తే తెలంగాణలో తక్కువుంటే ఏపీలో 898 మంది ఉన్నారు.
  • మరణించే సమయంలో వైద్యం పొందినవారి శాతం దేశ జనాభాలో 47.8 శాతముంటే ఏపీలో 47.2, తెలంగాణలో 44.9 శాతముంది. ఈవిషయంలో 79.6తో కేరళ అగ్రస్థానంలో, 32.1 శాతంతో బిహార్‌ అట్టడుగున ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల మరణాల్లో వైద్యం పొందిన వారి జాతీయ సగటు 43.2 కన్నా తెలంగాణలో తక్కువగా 39.8 శాతమే ఉంది. ఏపీలో ఇది 43.9 శాతంగా ఉంది.

ఇదీ చదవండి: రణమున గెలిచారు: కరోనాను జయించిన వారి అనుభవాలివి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.