తెలుగు పండగల ప్రాముఖ్యతను భావితరాలకు అందజేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు నీలం మహేందర్ అన్నారు. టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో సింగపూర్లో ఉగాది పూజ, పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని దృశ్యమాద్యమం ద్వారా నిర్వహించారు.
ఈ వేడుకలో చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో టీసీఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పట్టాదారు పాసుపుస్తకాల ముద్రణకు టెండర్లు ఆహ్వనం