మేడ్చల్ జిల్లా దూలపల్లిలో టాటాఏస్ ఆటో వెనుక చక్రాల కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. వినీత- శ్రవణ్ దంపతులు దూలపల్లిలో నివాసముంటున్నారు. వారి రెండేళ్ల కూతురు ఆరాధ్య. గురువారం మధ్యాహ్నం పాప మామ టాటాఏస్ వాహనాన్ని వెనక్కి తీస్తుండగా వెనక చక్రాలు పాప పైకి ఎక్కాయి. ప్రమాదవాశాత్తు జరిగిన ఈ ఘటనలో ఆరాధ్య అక్కడి అక్కడే మృతి చెందింది.
ఘటన స్థలానికి చేరికున్న పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఏడడుగులు వేశాడు.. ఏడేళ్లు నరకం చూశాడు