ETV Bharat / city

రవిప్రకాశ్​ను రిమాండ్​కు తరలించిన పోలీసులు - రవిప్రకాశ్​ను రిమాండ్​కు తరలించిన పోలీసులు

నిబంధనలకు విరుద్ధంగా రూ.18 కోట్లకు పైగా నగదును ఏబీసీఎల్​ ఖాతానుంచి తీసుకున్న కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్​ను పోలీసులు అరెస్టు చేశారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం... న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి రిమాండ్​కు తరలించారు.

రవిప్రకాశ్​ను రిమాండ్​కు తరలించిన పోలీసులు
author img

By

Published : Oct 5, 2019, 9:35 PM IST

Updated : Oct 5, 2019, 10:27 PM IST

ఏబీసీఎల్ ఖాతా నుంచి అక్రమంగా డబ్బులను తీసుకున్న కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్​ను బంజారాహిల్స్​ పోలీసులు అరెస్ట్ చేశారు. గత రెండు సంవత్సరాల్లో అసోసియేటెడ్ బ్రాడ్ కాస్ట్ కంపెనీ ప్రైవేట్ లిమిడెట్(ఏబీసీఎల్​) నుంచి నిబంధనలకు విరుద్ధంగా రూ.18కోట్లకు పైగా నగదును తీసుకున్నట్లు అలంద మీడియా.... రవిప్రకాశ్​, కేవీఎన్​ మూర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. డైరెక్టర్ల తీర్మానం అనంతరం డబ్బులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ... అవేమీ పట్టించుకోకుండా బోనస్ పేరుతో డబ్బులను తీసుకొని వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన బంజారాహిల్స్ పోలీసులు... పలు ఆధారాలు సేకరించారు. రవిప్రకాశ్ ను ఉదయం నుంచి సాయంత్రం వరకు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు విచారించారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఆయన నుంచి పలు వివరాలు రాబట్టారు. అనంతరం రవిప్రకాశ్​పై 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పశ్చిమ మండల డీసీపీ సుమతి తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి రిమాండ్​కు తరలించారు.

ఈ నెల 18 వరకు రిమాండ్​:

రవిప్రకాశ్‌కు ఈ నెల 18 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. ఆయనను బంజారాహిల్స్​ పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. రవిప్రకాశ్ తరఫు న్యాయవాది బెయిల్​ పిటిషన్​ దాఖలు చేయగా... ఈ నెల 9న వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. ​

రవిప్రకాశ్​ను రిమాండ్​కు తరలించిన పోలీసులు

ఇవీ చూడండి: పోలీసుల అదుపులో టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్

TG_HYD_86_05_RAVIPRAKASH_ARREST_AB_3181326 రిపోర్టర్-శ్రీకాంత్ ( ) ఏబీసీఎల్ ఖాతా నుంచి అక్రమంగా డబ్బులను డ్రా చేసుకున్న కేసులో టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్, కేవీఎన్ మూర్తిపై బంజారాహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గత రెండు సంవత్సరాల్లో అసోసియేటెడ్ బ్రాడ్ కాస్ట్ కంపెనీ ప్రైవేట్ లిమిడెట్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా 18కోట్లకు పైగా నగదును తీసుకున్నట్లు అలంద మీడియా ఫిర్యాదు చేసింది. డైరెక్టర్ల తీర్మానం అనంతరం డబ్బులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ... అవేమీ పట్టించుకోకుండా బోనస్ పేరుతో డబ్బులను తీసుకొని వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లు అలంద మీడియా పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన బంజారాహిల్స్ పోలీసులు... పలు ఆధారాలు సేకరించారు. రవిప్రకాశ్ ను ఉదయం నుంచి సాయంత్రం వరకు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు విచారించారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఆయన నుంచి పలు వివరాలు రాబట్టారు. అనంతరం రవిప్రకాశ్ పై 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు........BYTE సుమతి, పశ్చిమ మండల డీసీపీ
Last Updated : Oct 5, 2019, 10:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.