ETV Bharat / city

అయోధ్యలో శ్రీవారికి భూమి కోసం కేంద్రానికి తితిదే విజ్ఞప్తి..

author img

By

Published : Feb 27, 2021, 4:36 PM IST

Updated : Feb 27, 2021, 5:05 PM IST

రూ.2,937 కోట్లతో తితిదే వార్షిక బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపినట్లు... తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. రథసప్తమి వాహన సేవలను వైభవంగా నిర్వహించామని పేర్కొన్నారు. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని కేంద్రానికి సిఫార్సు చేయాలని తీర్మానించామన్నారు.

రూ.2,937 కోట్లతో తితిదే వార్షిక బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం

తితిదే పాలకమండలి రూ.2,937కోట్లతో 2021-22 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన... తిరుమల అన్నమయ్య భవనంలో పాలకమండలి సమావేశం జరిగింది. ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామని తితిదే ఛైర్మన్ అన్నారు. శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేయాలని నిర్ణయించామన్నారు.

దేశంలోని అన్ని కల్యాణ మండపాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. తితిదే వేద పాఠశాలను ఎస్వీ వేద విజ్ఞానపీఠంగా పేరు మార్చాలని తీర్మానించారు. బర్డ్ ఆస్పత్రి పాతభవనంలో పిల్లల ఆస్పత్రి ఏర్పాటుకు రూ.9కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. నెయ్యి నిల్వ సామర్థ్యం పెంచేందుకు చర్యలు చేపడతామన్నారు. తిరుమలలో విద్యుత్ వాడకంపై క్రమబద్ధీకరణ చర్యలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

తితిదే అతిథి గృహల్లో మీటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని కేంద్రానికి సిఫార్సు చేయాలని తీర్మానించామన్నారు. అయోధ్యలో శ్రీవారి ఆలయానికి భూమి ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: భద్రాద్రి రామయ్యకు సహస్ర కలశాభిషేకం

Last Updated : Feb 27, 2021, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.