ETV Bharat / city

TSRTC Hikes Ticket Fare : ప్రయాణికులకు షాక్​.. మరోసారి టికెట్‌ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ - టీఎస్ ఆర్టీసీ వార్తలు

TSRTC hikes ticket fare cess on diesel
TSRTC hikes ticket fare cess on diesel
author img

By

Published : Apr 8, 2022, 7:29 PM IST

Updated : Apr 8, 2022, 7:53 PM IST

19:28 April 08

మరోసారి ప్రయాణికుల టికెట్‌ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ

TSRTC Hikes Ticket Fare : మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచింది. ఇప్పటికే రౌండ్ అప్ పేరిట, టోల్ ప్లాజాల ఛార్జీలు పెరిగాయని టోల్ గేట్ల వద్ద ఛార్జీలు పెంచారు. ప్యాసింజర్స్ సెస్ కూడా వసూలు చేస్తున్నారు. తాజాగా డీజిల్ సెస్ వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులలో ఒక్కో ప్రయాణీకుని నుంచి డీజిల్ సెస్ కింద రూ.2 లు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ సర్వీసుల్లో ఒక్కో ప్రయాణీకుని నుంచి రూ.5లు వసూలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది.

పెంచిన ఛార్జీలు శనివారం నుంచి అమలులోకి వస్తుందని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో కనీస ఛార్జీ రూ.10 కొనసాగుతుందని వెల్లడించింది. రోజు రోజుకు పెరుగుతున్న డీజిల్ ధరల నేపథ్యంలోనే డీజిల్ సెస్ అమలుచేయాల్సి వస్తుందని.. ప్రజలు సహకరించాలని టీఎస్​ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీలో ప్రతి రోజు 6 లక్షల లీలర్ల డీజిల్​ను వినియోగిస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది. ఇటీవల కాలంలో చమురు ధరలు అమాంతంగా అసాధారణ రీతిలో పెరిగిపోవడంతో డీజిల్ సెస్ అమలు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. 2021 డిసెంబరులో రూ.85 ఉన్న డీజిల్​ ధర... ప్రస్తుతం రూ.118 కి ఎగబాకడం.. ఒక్కసారిగా రూ.35 పెరిగిపోవడంతో డీజిల్ సెస్ పెంచాల్సి వచ్చిందని యాజమాన్యం వివరించింది.

ఇదీ చదవండి : Bus Pass Charges hike: భారీగా పెరిగిన బస్​పాస్​ ఛార్జీలు

ప్రయాణికులకు షాక్​.. భారీగా పెరిగిన బస్​పాస్​ ఛార్జీలు

Last Updated : Apr 8, 2022, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.