ETV Bharat / city

ఆరో రోజుకు చేరిన టీఎస్​ఆర్టీసీ కార్మికుల సమ్మె - tsrtc strike news updates

తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో ఆరో రోజుకు చేరింది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రైవేటు సిబ్బందితో ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నారు.

టీఎస్​ఆర్టీసీ కార్మికుల సమ్మె
author img

By

Published : Oct 10, 2019, 9:40 AM IST

ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ఈనెల 5 నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె చేపట్టాయి. నేటితో సమ్మె ఆరో రోజుకు చేరింది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా.. ప్రైవేటు సిబ్బందితో బస్సులు నడిపిస్తున్నారు. పండుగ పూట సొంత ఊళ్లకు వెళ్లిన వారు నగరానికి తిరుగు ప్రయాణమయ్యారు. బస్టాండ్లలో రద్దీని దృష్టిలో ఉంచుకొి.. అదనంగా అద్దె బస్సులు ఏర్పాటు చేశారు. ఈరోజు ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు కలెక్టర్​లతో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మెలో తాజా పరిణామాలపై చర్చించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.