తప్పును కప్పిపుచ్చుకునేందుకే ఎన్నికల కమిషన్ చూస్తోందని పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్నారు. పోలింగ్ రోజున సాయంత్రం 5 గంటల సమయంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయో తమకు పంపాలని కోరినట్లు చెప్పారు. సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాల వద్ద ఏం జరిగిందో ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. ఎన్నికల అధికారులు ఏదో దాచారని మర్రి అనుమానాలు వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: హైకోర్టును ఆశ్రయించిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్