తెలంగాణ విత్తన రంగం అభివృద్ధికి చేయూతనిస్తామని నాబార్డ్ ఛైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా సీడ్ పార్క్ ఏర్పాటు ముందుకొస్తే తక్కువ వడ్డీకే రుణాలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా అనువైన ప్రాంతంలో వెయ్యి నుంచి 2 వేల ఎకరాల్లో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేస్తే అనేక పరిశ్రమలు వస్తాయని తెలిపారు.
హైదరాబాద్ నాంపల్లి రెడ్ హిల్స్ ప్యాఫ్సీ భవన్‌లో తెలంగాణ సీడ్స్ ఆధ్వర్యంలో నాబార్డ్ ఛైర్మన్‌గా నియమితులై నగరానికి వచ్చిన డాక్టర్ చింతల గోవిందరాజులును ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలో విత్తన రంగం, పరిశ్రమ బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, నాబార్డ్ ఆర్థిక సాయం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. విత్తనోత్పత్తికి సంబంధించి ప్రాసెసింగ్, పోస్ట్ ప్రొడక్షన్, నిల్వ, రవాణా, ఎగుమతులు వంటి యాంత్రీకరణ పెరగాల్సిన అవసరం ఉందని గోవిందరాజులు వివరించారు.
ఇవీ చూడండి: ప్రవేశ పరీక్షల వాయిదా కోసం పోరాటం కొనసాగిస్తాం: ఉత్తమ్