TS High Court : రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, కేటాయింపు స్థితిపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భాజపా నేత నల్లు ఇంద్రసేనారెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మ, అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. సుమారు 10వేల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించినప్పటికీ.. కేవలం 12వేలు మాత్రమే కేటాయించారని ఇంద్రసేనారెడ్డి తరఫు న్యాయవాది వివరించారు.
ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ.. రాజకీయ కారణాలతో లబ్ధిదారులకు కేటాయించడం లేదన్నారు. లబ్ధిదారులకు ఎందుకు కేటాయించడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కొన్ని ఇళ్ల కేటాయింపు పూర్తయిందని.. మిగతా వాటిని వీలైనంత త్వరగా కేటాయించనున్నట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరించారు. ఇప్పటి వరకు ఎన్ని నిర్మించారు.. లబ్ధిదారులకు ఎన్ని కేటాయించారో పూర్తి వివరాలతో రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఇవీ చదవండి: రెండురోజుల క్రితం గృహ ప్రవేశం- దంపతులు సజీవ దహనం
Revanth Reddy On PK: 'ఆరోజు పీకేనే తెరాసను ఓడించాలని చెబుతారు'