ETV Bharat / city

నా కోసం లారీ పుస్తకాల్నిపంపించారాయన! - mlc surabhi vani devi about her father pv

కొత్తబట్టలేసుకుని... పౌడరద్దుకుని ముస్తాబవుతున్న ఆ అమ్మాయిని ‘ఎక్కడికమ్మాయ్‌?’ అని అడిగింది తల్లి. ‘పొలానికి..’ అందా పాప.. ‘పొలం పనులు చేసేవాళ్లు ఇలా తయారై వెళ్తారా? వాళ్లలో ఒక్కరిగా కలిసిపోవాలంటే  ఆడంబరాలు వదిలేయ్‌’.. అన్న తల్లిమాటలు ఆమెమనసులో నాటుకుపోయాయి.. తర్వాతి కాలంలో తండ్రి ప్రధాని అయినా ఆమె భేషజాలు, ఆడంబరాల జోలికి పోలేదు. ఆయన కోరిక మేరకు అద్భుతమైన చిత్రకారిణిగా, విద్యావేత్తగా రాణించారు.  ఆ తండ్రే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు... ఆ బిడ్డ సురభి వాణీదేవి. అత్యంత ఉత్కంఠగా సాగిన హైదరాబాద్‌, పాలమూరు, రంగారెడ్డి పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా ఆమె వసుంధరతో ముచ్చటించారు...

trs-mlc-surabhi-vani-devi-about-her-father-former-primi-minister-pv-narasimha-rao
నా కోసం లారీ పుస్తకాల్నిపంపించారాయన!
author img

By

Published : Mar 21, 2021, 6:43 AM IST

కరీంనగర్‌ జిల్లాలోని మారుమూల గ్రామం వంగరలో పుట్టారు వాణీదేవి. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న ఆమె ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఏ, జేఎన్‌టీయూ నుంచి ఫైన్‌ఆర్ట్స్‌లో డిప్లొమో పూర్తి చేశారు. వర్ణాలతో అద్భుతాలు చేయడం ఆమె ప్రత్యేకత. విద్యావేత్తగా, సామాజిక సేవకురాలిగా ఎంత పేరు తెచ్చుకున్నారో అంతకన్నా ఎక్కువగా కళాకారిణిగా రాణించారు. సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ఇప్పటికీ ఆమె వేసిన అద్భుతమైన చిత్రాలు మనకు కనువిందు చేస్తాయి. ‘ఓరోజు బాపు(నాన్న) పుస్తకాలు సర్దుతుంటే ‘హౌ టు డ్రా ఏ పెయింటింగ్‌’ అనే పుస్తకం కనిపించింది. దానిపై నాన్న సంతకం కూడా ఉంది. ఆ పుస్తకం వల్లే నాకు చిత్రలేఖనంపై ఆసక్తి కలిగింది. పచ్చటి పొలాలు, చుట్టూ కొండలతో మా ఊరు చాలా అందంగా ఉండేది. పొలాల దగ్గర, వరి కల్లాల దగ్గర కూర్చుని.. అక్కడ పనిచేసే స్త్రీల చిత్రాలను గీసేదాన్ని. నాకు పెయింటింగ్‌ అంటే ఇష్టమని నేనెప్పుడూ నాన్నకు చెప్పలేదు. ఆయనే నా ఆసక్తిని గమనించి ప్రముఖ చిత్రకారులతో నాకు సలహాలు, సూచనలు ఇప్పించేవారు’ అనే వాణీదేవి ఇప్పటివరకు దేశ, విదేశాల్లో వందలకొద్దీ ప్రదర్శనలు ఇచ్చారు.

నా కోసం లారీ పుస్తకాల్నిపంపించారాయన!
పీవీ నర్సింహారావుతో సురభి వాణీదేవి

నాన్నే నేర్పారు..

చదువు పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో కొన్నేళ్లపాటు అధ్యాపకురాలిగా పనిచేశారు వాణి. ఆ సమయంలో సిటీ బస్సుల్లోనే ప్రయాణించేవారు. ‘జాతీయ నాయకుడిగా ఉన్నా ఆ ప్రభావాలకు మమ్మల్ని దూరంగానే పెంచారు నాన్న. దాంతో మేం ప్రత్యేకం అని ఎప్పుడూ అనుకోలేదు. మేం నలుగురు అక్కాచెల్లెళ్లం. నాకు ఇద్దరన్నదమ్ములు. ‘బాపూ.. ఇదేంటి?.. అదేంటి? అని మేం అడిగిన ప్రతిదానికీ ఓపిగ్గా జవాబులిచ్చేవారాయన. చిన్నతనంలో ఈత కొట్టేదాన్ని. సైకిల్‌ తొక్కేదాన్ని. మా అమ్మ సత్యమ్మ నాపై చేసే ఫిర్యాదులన్నింటినీ నవ్వుతూ స్వీకరించి వదిలేసేవారాయన. మితభాషిగా ఉంటూనే ప్రతి పని ధైర్యంగా చేసే ఆయన గుణం నాకూ వచ్చింది. ఎలా బతకాలి, ఏ సందర్భంలో ఎలా నడవాలి వంటివన్నీ బాపూనే నాకు నేర్పించారు’ అంటారు వాణీదేవి.

ఆ విషయం నన్ను బాధించింది

వేయిపడగలతో మొదలై... చిన్నతనం నుంచీ చదువుని ప్రేమించిన వాణీదేవి... 35 ఏళ్లుగా వేలాది మంది పేద విద్యార్థులకు అండగా నిలిచారు... ‘బాపూలానే నాకూ పుస్తకాలంటే ఇష్టం. నా ఎనిమిదో తరగతి సమయంలో ‘వేయి పడగలు’ పుస్తకం అనువాదం చేస్తున్నారు. అప్పుడు తెలీకుండానే ఆ పుస్తకంతో మొదలైన నా పఠనాసక్తి ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రధాని కాకమునుపు దిల్లీ నుంచి వచ్చేయమని నాన్నతో అన్నాను. ఆయన రాకుండా ఓ ట్రక్కు పుస్తకాల లోడ్‌ని నాకు పంపించారు. పుస్తకాలపై ఆయనకున్న ప్రేమ అలాంటిది’ అంటారు వాణీదేవి. ప్రతి విషయంలో తండ్రి అడుగుజాడల్లో నడిచిన వాణీదేవి ఇప్పుడు చట్టసభలో అడుగుపెట్టి ఆయన ఆశయాలకు వారసురాలిగా నిలవబోతున్నారు. ‘నేనెప్పుడూ రాజకీయాలకి దూరంగా ఉండలేదు. నాన్నతో పాటూ ఎన్నో దేశాలు తిరిగాను. నాన్నగారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా కేసీఆర్‌గారే రాజకీయాల్లోకి రావాల్సిందిగా కోరారు. అప్పటికి ఎక్కువ సమయం లేకపోవడంతో మా అమ్మాయి అజిత నన్ను వారించింది. కానీ నేనే ధైర్యం చేశాను. ఈ ఎన్నికల్లో గెలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. కానీ నన్ను అమితంగా బాధించిన విషయం కూడా ఒకటి ఉంది. అవే చెల్లని ఓట్లు. 21వేల చెల్లని ఓట్లు పట్టభద్రులు వేయడం బాధనిపించింది’ అంటారు వాణీదేవి.

ఎన్నో విద్యాసంస్థలను స్థాపించారు

వాణీదేవి భర్త సురభి దయాకరరావుతో కలిసి ఎన్నో విద్యాసంస్థలని స్థాపించారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో వెంకటేశ్వరా కాలేజీ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌తోపాటూ పలు ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కాలేజీలను స్థాపించారు. కరీంనగర్‌ జిల్లా ముల్కనూరులో స్వామిరామానందతీర్థ సహకార జూనియర్‌ కళాశాలకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా ఉన్నారు. 2016 వాణీదేవి భర్త మరణించారు. వీరికి ముగ్గురు పిల్లలు. అజిత, రజిత, స్మిత. వీరిలో రజిత, స్మితలు అమెరికాలో ఉండగా అజిత ఇక్కడే ప్రొఫెసర్‌గా స్థిరపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.