సభ్యత్వ నమోదులో సనత్‌నగర్ నియోజకవర్గాన్ని మొదటిస్థానంలో నిలపాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో సనత్‌నగర్ నియోజకవర్గ స్థాయి తెరాస పార్టీ సమావేశం నిర్వహించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్ష జరిపారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సభ్యత్వం పొందేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని చెప్పారు. ప్రస్తుత, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు సమన్వయంతో వ్యవహరించి మరో మూడు రోజుల్లో నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. పుస్తకాలను తమ కార్యాలయంలో అందజేయాలని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ తెరాస పార్టీ ఇంఛార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్లు కొలన్ లక్ష్మీ, హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ, ఆకుల రూప, డివిజన్ అధ్యక్షులు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆర్డీఎస్ నుంచి చుక్క నీటి బొట్టును వదులుకోం: సంపత్