ETV Bharat / city

నేడు తెరాస మేయర్​, ఛైర్మన్​ అభ్యర్థుల పేర్లు ఖరారు

మేయర్, ఛైర్మన్​ అభ్యర్థులను తెలంగాణ రాష్ట్ర సమితి నేడు ఖరారు చేయనుంది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోద ముద్ర వేశాక.. మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్​ అభ్యర్థుల పేర్లను సీల్డ్​ కవర్​లో పంపించనున్నారు. సోమవారం ఎన్నిక నిర్వహణకు గంట ముందు స్థానిక ఎమ్మెల్యేలు అభ్యర్థి పేరు ప్రకటించి.. విప్​ జారీ చేస్తారు.

trs may finalized mayor and chairman candidates today
నేడు తెరాస మేయర్​, ఛైర్మన్​ అభ్యర్థుల పేర్లు ఖరారు.
author img

By

Published : Jan 26, 2020, 6:16 AM IST

Updated : Jan 26, 2020, 7:29 AM IST

నేడు తెరాస మేయర్​, ఛైర్మన్​ అభ్యర్థుల పేర్లు ఖరారు.

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విజయబావుటా ఎగరేసిన తెరాస.. మేయర్, ఛైర్మన్​ అభ్యర్థులను నేడు ఖరారు చేయనుంది. నాలుగు కార్పొరేషన్​లలో తెరాసకు స్పష్టమైన ఆధిక్యం కనబరచగా.. మిగిలిన 5 చోట్ల ఎక్స్​ అఫిషియో సభ్యుల ఓట్లతో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఎంఐఎంతో కలిసి నిజామాబాద్ నగర పాలక సంస్థను కైవసం చేసుకోవడానికి సిద్ధమైంది. తెరాసకు మేయర్, డిప్యూటీ మేయర్ పదవిని ఎంఐఎం పంచుకునే అవకాశం ఉంది. ఒకటి, రెండు కార్పొరేషన్లు మినహా మిగతా చోట్ల.. మేయర్ అభ్యర్థులపై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.

పాత-కొత్త నేతల మధ్య సమతూకం

రాష్ట్రవ్యాప్తంగా 103 పురపాలక సంఘాల్లో గులాబీ జెండా ఎగరడం దాదాపు ఖాయమైంది. మరో పది పురపాలికల్లో.. స్వతంత్రులు, ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటుతో ఛైర్మన్​ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు యత్నిస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్​ అభ్యర్థులను అధికార తెరాస నేడు ఖరారు చేయనుంది. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉద్యమ కాలం నుంచి ఉన్న నేతలను.. రాష్టం ఆవిర్భావం తర్వాత పార్టీలో చేరిన వారి మధ్య సమతూకం పాటించాలని భావిస్తోంది.

కేసీఆర్​ ఆమోదం తర్వాతే..

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. ఇవాళ స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చించి జాబితా రూపొందించనున్నారు. కేసీఆర్ ఆమోద ముద్ర వేసిన తర్వాత.. అభ్యర్థుల పేర్లను సీల్డ్​కవర్​లో ఎమ్మెల్యేలకు పంపిస్తారు. సోమవారం ఎన్నిక జరిగే రోజున ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో స్థానిక ఎమ్మెల్యేలు సమావేశమై.. అధిష్ఠానం ఖరారు చేసిన పేర్లను వెల్లడిస్తారు. అనంతరం విప్​ జారీ చేసే అధికారాన్ని ఎమ్మెల్యేలకు తెరాస అధినాయకత్వం అప్పగించింది.

ఇవీచూడండి: మున్సిపల్ ఎన్నికల్లోనూ గుబాళించిన గులాబీ

TG_HYD_04_26_TODAY_MAYOR_CHAIRMAN_CANDIDATES_FINAL_PKG_3064645 REPORTER: Nageshwara Chary note: pls use file vis ( ) పురపాలక, నగర పాలక అధిపతులను తెలంగాణ రాష్ట్ర సమితి నేడు ఖరారు చేయనుంది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోద ముద్ర వేశాక... మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ అభ్యర్థుల పేర్లను సీల్డ్ కవర్ లో పంపించనున్నారు. రేపు ఎన్నికకు గంట ముందు స్థానిక ఎమ్మెల్యేలు... అభ్యర్థి పేరు ప్రకటించి.. విప్ జారీ చేస్తారు. look... వాయిస్ ఓవర్: కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో విజయబావుటా ఎగరేసిన తెరాస... మేయర్, ఛైర్ పర్సన్లను నేడు ఖరారు చేయనుంది. ఎనిమిది కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానం తెరాస కు దక్కాయి. ఎంఐఎంతో కలిసి నిజామాబాద్ నగర పాలక సంస్థను కైవసం చేసుకోవడానికి సిద్ధమైంది. మేయర్ తెరాసకు... డిప్యూటీ మేయర్ ఎంఐఎం పంచుకునే అవకాశం ఉంది. ఒకటి, రెండు కార్పొరేషన్లు మినహా మిగతా చోట్ల... మేయర్ అభ్యర్థులపై ఇప్పటికే ఓ స్పష్టతతో వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 103 పురపాలక సంఘాల్లో గులాబీ జెండా ఎగరడం దాదాపు ఖాయమైంది. సుమారు మరో పది వరకు కూడా స్వతంత్రుల మద్దతు, ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటుతో ఛైర్ పర్సన్ స్థానం కైవసం చేసుకునేందుకు ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ అభ్యర్థులను తెరాస అధిష్టానం నేడు ఖరారు చేయనుంది. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఓ వైపు ఉద్యమ కాలం నుంచి ఉన్న నాయకులు... మరోవైపు రాష్ట్రావిర్భావం తర్వాత పార్టీలో చేరిన నాయకుల మధ్య సమతూకం పాటించాలని భావిస్తున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. ఇవాళ స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చించి జాబితా రూపొందించనున్నారు. సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. కేసీఆర్ ఆమోద ముద్ర వేసిన తర్వాత... పేర్లను సీల్డ్ కవర్ లో ఎమ్మెల్యేలకు పంపిస్తారు. ఎల్లుండి ఎన్నిక జరిగే ముందు...ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో స్థానిక ఎమ్మెల్యేలు సమావేశమై.. అధిష్టానం నిర్ణయించిన పేర్లను వెల్లడిస్తారు. పార్టీ ఖరారు చేసిన మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్ పర్సన్, వైఎస్ చైర్ పర్సన్ అభ్యర్థులను ఎన్నుకునేందుకు వీలుగా విప్ జారీ చేసే అధికారాన్ని ఎమ్మెల్యేలకు తెరాస నాయకత్వం అప్పగించింది. end
Last Updated : Jan 26, 2020, 7:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.