డా. బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని అసెంబ్లీ ఆవరణలోని ఆయన విగ్రహానికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దళితుల కోసం అంబేడ్కర్ చేసిన కృషిని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమానికి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, మంత్రి ప్రశాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఇదీ చదవండి: 'అంబేడ్కర్ కలలు కన్న దేశాన్ని నిర్మిస్తాం'