IAS Officers Transfers in AP: కొత్త జిల్లాల మార్పుచేర్పులతో పాటు రాష్ట్రంలోని అధికారులను పెద్ద ఎత్తున బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కీలకమైన పోస్టింగ్‌లలో అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. శనివారం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. రవాణా శాఖ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్‌ను, సీఆర్‌డీఏ కమిషనర్‌గా వివేక్ యాదవ్‌ను, వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌గా చేవూరి హరికిరణ్‌ను, వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్‌గా జె.నివాస్‌ను, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా కె.ఆర్.బిహెచ్.ఎన్.చక్రవర్తిని నియమించింది.
దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జి.వాణీమోహన్‌ను యువజన వ్యవహారాలు, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా హరిజవహర్‌లాల్, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా వీరపాండ్యన్‌కు అదనపు బాధ్యతలు అప్పగింది. నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా జాహ్నవిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్‌గా చేతన్‌ను బదిలీ చేశారు. ఇవన్నీ శనివారం రాత్రి వెలువడిన ముసాయిదా జీవోల్లోని వివరాలు. శనివారం అర్ధరాత్రి వరకు ఏపీ ఈ-గెజిట్ వెబ్‌సైట్‌లో జీవోల్ని అప్‌లోడ్ చేయలేదు. తుది జీవోల్లో కొన్ని మార్పులు ఉండే అవకాశం లేకపోలేదు.
ఇదీ చదవండి: MGM: ఎంజీఎం ఘటనపై చర్యలు.. బ్లాక్ లిస్ట్‌లో ఏజెన్సీ