Traffic Challan to Allu arjun and Kalyan Ram: ఇటీవల జూబ్లీహిల్స్‌లో జరిగిన కారు ప్రమాదం అనంతరం పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు వారాలుగా ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు. అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉన్న కార్లతో పాటు ప్రజాప్రతినిధుల స్టిక్కర్లున్న వ్యక్తిగత వాహనాలు గుర్తించి తొలిగిస్తున్నారు. సరైన నంబర్ ప్లేట్లులేని వాహనాలను వావాహాలను గుర్తించి.. చర్యలు తీసుకుంటున్నారు. జరిమానాలు విధిస్తున్నారు.
జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఎస్సై శ్రీధర్ శనివారం రోడ్ నంబరు 36లోని నీరూస్ కూడలిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. హీరోలు.. అల్లుఅర్జున్, కల్యాణ్‌రామ్ తమ కార్లలో అటుగా వెళ్తుండగా పోలీసులు ఆపారు. వారి కార్ల అద్దాలకు ఉన్న నలుపు తెరలను తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా నల్లతెరలు ఉన్నందుకు గానూ.. రూ.700 చొప్పున చలాన్లు విధించారు. నల్లతెరలను తొలగించే సమయంలో వారు కారులోనే ఉన్నట్టు సమాచారం.
నలుపు తెరతోపాటు ఇతర నిబంధనలు పాటించని 80కిపైగా వాహనాలపై కేసులు నమోదు చేశారు. రెండు వారాలుగా జరుగుతున్న ప్రత్యేక డ్రైవ్‌లో ఇప్పటి వరకు నగరవ్యాప్తంగా 15వేలకు పైగా కేసులు నమోదైనట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: