విద్యావాలంటీర్లకు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.హర్షవర్ధన్ రెడ్డి ప్రభు కోరారు. గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు విద్యా వాలంటీర్లకు నాలుగు నెలల జీతాన్ని చెల్లించలేదన్నారు. రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఇవ్వాల్సిన పెండింగ్ వేతనాలనూ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: రిజిస్ట్రేషన్ల ప్రక్రియ విభజనకు నిర్ణయం: ప్రశాంత్ రెడ్డి