ధాన్యం సేకరణ(paddy procurement telangana)పై కేంద్రం, రాష్ట్రానికి చిత్తశుద్ధి లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(pcc chief revanth reddy) మండిపడ్డారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో చేపట్టిన కాంగ్రెస్ వరిదీక్ష(congress vari deeksha) ముగింపు కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం(revanth reddy comments on kcr) వ్యక్తం చేశారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే వేల టన్నుల ధాన్యం నీటిపాలైందని ఆరోపించారు. పంట వచ్చి 45 రోజులైనా కొనుగోలు ఏర్పాట్లు చేయలేదన్నారు.
రేపు గవర్నర్‌ని కలుస్తాం..
వరి రైతులకు ఉరివేస్తా అన్న వెంకట్రామిరెడ్డిని కేసీఆర్ అందలం ఎక్కించారని రేవంత్ విమర్శించారు. రైతులను శాశ్వతంగా అదాని, అంబానీలకు బానిసలుగా మార్చేకుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. పండించిన పంటను కొనని ప్రభుత్వాన్ని బొందపెడతామని హెచ్చరించారు. దిల్లీకి వెళ్లి.. కనీసం ప్రధాన మంత్రి అపాయింట్‌మెంట్ కూడా కోరకుండా విందులు చేసుకుని తిరిగి వచ్చారన్నారు. అటు భాజపా నేతలు కూడా.. దిల్లీ వెళ్లొచ్చి కొత్త రాగం ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలపై రేపు గవర్నర్ తమిళిసైని కలవనున్నట్టు రేవంత్ తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో(parliament winter session 2021)నూ.. రైతుల సమస్యలపై గొంతెత్తుతామని పేర్కొన్నారు. డిసెంబర్ 9 నుంచి 13లోపు దిల్లీ జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేపడుతామని రేవంత్ ప్రకటించారు.
విందులు చేసుకుని వచ్చారు..
"కేసీఆర్ మూర్ఖత్వం వల్లే ధాన్యం మొలకలు వచ్చి నిరుపయోగంగా మారింది. వరి వద్దంటే వేశారనే కక్షతోనే కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేయట్లేదు. 60 లక్షల మెట్రిక్ ధాన్యం తీసుకుంటామని కేంద్రం గతంలో చెప్పింది. రైతుల కడగండ్లకు ప్రధాన కారణం కేసీఆరే. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ ధర్నాలు చేశారు. ఎత్తేసిన ధర్నా చౌక్‌లోనే నిస్సిగ్గుగా కేసీఆర్ ధర్నా చేశారు. రైతుల మీద కక్షతోనే కొనుగోలులో జాప్యం చేశారు. దిల్లీకి వెళ్లిన కేసీఆర్... ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా కోరలేదు. కేసీఆర్, మంత్రులు రెండ్రోజులు దిల్లీలో విందు చేసుకుని వచ్చారు. అవగాహన లేని మంత్రులను దిల్లీకి పంపారు. కల్లాల్లో రైతుల చావులు ప్రభుత్వ హత్యలే. తెరాస, భాజపా కలిసి కొత్త నాటకానికి తెరలేపారు. దిల్లీ వెళ్లి వచ్చిన బండి సంజయ్.. వరి మాటలు పక్కన పెట్టి విద్యా వైద్యం మీద సంతకం అని కొత్త రాగం ఎత్తుకున్నారు. పండించిన పంటను కొనని ప్రభుత్వాన్ని బొంద పెడదాం. రేపు గవర్నర్‌ను కలుస్తాం. రైతుల సమస్యను పార్లమెంట్లో లేవనెత్తుతాం. డిసెంబర్ 9 నుంచి 13లోపు దిల్లీ జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేపడుతాం. " - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇదీ చూడండి: