ETV Bharat / city

Revanth Reddy comments: కేసీఆర్​కు మద్యం షాపులపై ఉన్న ప్రేమ.. రైతుల మీద లేదు - టీపీసీసీ రేవంత్​రెడ్డి తీవ్ర ఆగ్రహం

ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం అవలంభిస్తోన్న నిర్లక్ష్య వైఖరిపై టీపీసీసీ రేవంత్​రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ధాన్యం కుప్పపైనే ప్రాణాలొదిలిన రైతు బీరయ్య చావుకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలు తెరవటాన్ని పక్కనపెట్టి.. కొత్త మద్యం దుకాణాలు తెరిచేందుకు సర్కారు సిద్ధమవుతోందని దుయ్యబట్టారు.

tpcc chief Revanth Reddy comments on cm kcr about farmers suicide in telangana

author img

By

Published : Nov 6, 2021, 7:13 PM IST

Updated : Nov 6, 2021, 7:30 PM IST

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతు బీరయ్య మృతి చెందాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. పదిరోజులుగా పడిగాపులు పడుతున్నా.. ధాన్యం కొనుగోలు చేయలేదన్న బాధతోనే రైతు మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో కలెక్టర్ల నివేదికకు విలువ లేదని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం.. అది వదిలేసి.. మద్యం దుకాణాలకు నోటిఫికేషన్లు ఇస్తోందని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.. కానీ.. ఉన్నవి సరిపోవన్నట్టు... కొత్త మద్యం షాపులు తెరుస్తున్నారని మండిపడ్డారు.

ప్రజా ఉద్యమం చేస్తాం..

"ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాల్సింది పోయి.. కొత్త వైన్​షాపులకు కేసీఆర్​ నోటిఫికేషన్లు ఇస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు తెరవలేదు కానీ.. మద్యం దుకాణాలు తెరిచేందుకు సిద్దమైతున్నారు. కేసీఆర్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు.. 40 వేల మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లందరి ఆత్మహత్యకు సీఎం కేసీఆరే కారకుడు. ఇప్పటికైనా.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచి.. రైతు పండించిన చివరి గింజ వరకు మద్దతు ధర ఇచ్చి కొనాల్సిందే. రైతుల తరఫున కొట్లాడేందుకు కాంగ్రెస్​ సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న దుర్మర్గపు విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు కాంగ్రెస్​ సిద్ధమవుతోంది. పెట్రోల్​, డీజీల్​పై రాష్ట్ర ప్రభుత్వం పది రూపాయలు తగ్గించాలని కాంగ్రెస్​ తరఫున డిమాండ్​ చేస్తున్నాం. ఇందన ధరలు తగ్గించేందుకు ప్రజా ఉద్యమాన్ని చేపడతాం." - రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇదీ చూడండి:

Last Updated : Nov 6, 2021, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.