1. రైతు బాగు కోసమే..
రైతుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చి, వారి ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతోనే కేంద్రం నూతన వ్యవసాయ చట్టం తీసుకువచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రైతులు బాగుపడాలనేదే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. శవాలపై పేలాలు..
కుటుంబసభ్యులు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే... మానవత్వం మర్చిపోయి లంచాలకు తెగబడుతున్నారు సంగారెడ్డి మార్చురీ సిబ్బంది. ఈ విషయాన్ని ఈనాడు-ఈటీవీ భారత్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకుపోగా... బాధితులకు లంచం డబ్బులు తిరిగి ఇప్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఇస్రోలో ఇందూరు కుర్రాడు
చదువంటే ఆసక్తి.. నిరంతర కృషి.. లక్ష్యాన్ని చేరుకోవాలనే తపనే తన కలల సాధనకు చోదకశక్తిలా పనిచేశాయి. చిన్న వయసులోనే రాకెట్‌లా లక్ష్యం వైపు దూసుకెళ్లాడు. మధ్య తరగతి గిరిజన కుటుంబంలో పుట్టి ఇస్రోలో శాస్త్రవేత్తగా ఎదిగి యువతకు ప్రేరణగా నిలుస్తున్నాడు. నిజామాబాద్ జిల్లాకి చెందిన యువ శాస్త్రవేత్త బానోత్ సుమన్ నాయక్. ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తనిచ్చే సూచనలు అమూల్యం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మిషన్-200
2021 బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా పావులు కదుపుతోంది. కేంద్ర హోంమంత్రి, భాజపా నేత అమిత్ షా ఈ మేరకు బంగాల్లో తరచుగా పర్యటించనున్నట్లు సమాచారం. 294 అసెంబ్లీ స్థానాల్లో 200 చోట్ల గెలుపే లక్ష్యంగా అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఫిబ్రవరి తర్వాతే..
వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో జరగాల్సిన బోర్డు పరీక్షలను వాయిదా వేసింది విద్యాశాఖ. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. దిల్లీలో నిల్వ
కొవిడ్-19 వ్యాక్సిన్‌ను నిల్వ చేసేందుకు వీలుగా దేశ రాజధాని దిల్లీలో కోల్డ్ స్టోరేజ్‌ను ఏర్పాటు చేయనుంది కేంద్రం. దాదాపు కోటి డోసులను నిల్వ చేయగల సామర్థ్యంతో ఈ కోల్డ్ స్టోరేజ్‌ను నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. కొత్త స్ట్రెయిన్‌కు..
బ్రిటన్‌లో బయటపడ్డ కొత్తరకం కరోనా వైరస్‌పై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇప్పటికే యూకే నుంచి వచ్చే విమానాలపై భారత్ సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. అయితే ఈ కొత్త రకం కరోనా వైరస్‌కు ఆరు వారాల్లో టీకా తీసుకురాగలమని ఫార్మా దిగ్గజం బయోఎన్ టెక్ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ప్రభావమెంత..?
భారత ఎగుమతులు ఇటీవల రికార్డు స్థాయిలో పడిపోతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు కారణాలేమిటి? రైతుల ఆందోళన ప్రభావం వీటిపై ఎంత? ఎగుమతులు మళ్లీ కొవిడ్ పూర్వ స్థితికి ఎప్పుడు చేరతాయనే విషయాలను.. భారత ఎగుమతిదారు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు శరద్ కుమార్ సరఫ్ 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. బెల్టే లక్ష్యం..
రెజ్లింగ్ నుంచి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రవేశించిన ఫైటర్ రీతూ ఫొగాట్.. వరుస బౌట్స్‌లో గెలిచి సత్తా చాటుతోంది. ఈటీవీ భారత్‌తో ముచ్చటించిన ఆమె.. దేశానికి ఛాంపియన్షిప్ బెల్ట్ తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పింది. అసలు ఎందుకు ఎమ్ఎమ్ఏలోకి అడుగుపెట్టాను?ఎలాంటి శిక్షణ తీసుకుంటున్నాను? లాంటి సంగతులు చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. జనవరిలో 'బుల్లోడు'..
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'బంగారు బుల్లోడు', 'సోలో బ్రతుకే సో బెటర్', 'ద వైట్ టైగర్', 'డాక్టర్ జీ'తో పాటు పలు చిత్రాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.