ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @5PM - topten news @5pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @5pm
టాప్​టెన్​ న్యూస్​ @5pm
author img

By

Published : Feb 9, 2021, 5:01 PM IST

1. 'పది' షెడ్యూల్​

పదో తరగతి పరీక్షల టైం టైబుల్​ను విద్యాశాఖ విడుదల చేసింది. మే 17 నుంచి 26 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆరు పరీక్షలే ఉంటాయని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. అదే నా కోరిక..

తెలంగాణలో రాజన్న రాజ్యం మళ్లీ రావాలని ఏపీ సీఎం జగన్​ సోదరి వైఎస్ షర్మిల ఆకాంక్షించారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కదా అన్నారు. విద్యార్థులు ఉచితంగా చదువుకుంటున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్నదే తన కోరిక అని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. విభేదాల్లేవ్​..

తెలంగాణలో వైకాపా వంటి పార్టీ ఉండాలని షర్మిల భావించారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. షర్మిల నిర్ణయం పట్ల జగన్‌ కాస్త బాధపడి ఉండొచ్చొని... షర్మిలకు జగన్‌ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు. షర్మిలను పార్టీ పెట్టవద్దని నచ్చజెప్పే ప్రయత్నాలు జరిగాయని సజ్జల చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ఫేస్​బుక్​ లైవ్​తో..

ఉత్తరాఖండ్​ జలప్రళయాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి మన్వర్​ సింగ్​తో ఈటీవీ భారత్​ మాట్లాడింది. ఆ విధ్వంసం చూసి ఒళ్లు జలదరించిందని అతను తెలిపాడు. జలవిలయం దృశ్యాలను మొదటగా అతనే ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. అనంతరం అవి వైరల్​గా మారాయి. అధికారులు అప్రమత్తమై యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఆరోజు అసలు ఏం జరిగిందో స్వయంగా అతని మాటల్లోనే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. రద్దు బిల్లు..

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని లోక్​సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. పంజాబ్​కు చెందిన ఎంపీల బృందం దీన్ని తీసుకురానున్నట్లు ఆ పార్టీ ఎంపీ మనీశ్​ తివారీ తెలిపారు. రాజ్యసభలోనూ ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టాలని యత్నిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. వారికి బీమా లేదు

కరోనా టీకా తీసుకునేవారికి దుష్ప్రభావాల నుంచి రక్షణగా బీమా సౌకర్యం కల్పించడం లేదని కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. ప్రతికూలతలు తలెత్తితే ఉచితంగానే వైద్యం అందిస్తున్నామని తెలిపింది. ఇప్పటివరకు కొవాగ్జిన్ టీకా అభ్యర్థుల్లో 0.096 శాతం, కొవిషీల్డ్ అభ్యర్థుల్లో 0.192 శాతం మంది ప్రతికూల ప్రభావానికి గురైనట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. కరోనా అక్కడ పుట్టలేదు..!

కరోనా ఆవిర్భావంపై వుహాన్​లో చేసిన దర్యాప్తు వల్ల కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని డబ్ల్యూహెచ్​ఓ నిపుణుల బృందం సభ్యుడు బెన్ ఎంబారెక్ తెలిపారు. అయితే, వుహాన్​లో కానీ మరేచోటైనా కానీ.. 2019 డిసెంబర్​కు ముందే భారీ స్థాయిలో కరోనా వ్యాపించిందనేందుకు ఆధారాలు లభించలేదని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. చివరికి నష్టాలు..

ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో స్టాక్​మార్కెట్​ సూచీలు ఇవాళ ఫ్లాట్​గా ముగిశాయి. సెన్సెక్స్​ 20 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 15 వేల 109 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో భారీ లాభాల్లో ఉండగా.. సెషన్​ చివర్లో నష్టాల్లోకి మళ్లాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. అందుకే ఓడాం..

తొలి టెస్ట్​లో ఓటమిపై స్పందించాడు టీమ్​ఇండియా సారథి కోహ్లీ. తమ జట్టు అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయిందన్నాడు. తమ బౌలర్లకు పిచ్​ సహకరించలేదని చెప్పిన విరాట్.​. రెండో టెస్ట్​పై దృష్టి సారించినట్లు తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. అభిమానులకు నిరాశే..

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా 'వకీల్​సాబ్​' చిత్రంలోని రెండో పాటను విడుదల చేయనున్నారని ఇటీవలే ఊహాగానాలు వినిపించాయి. దీనిపై ఈ చిత్ర సంగీత దర్శకుడు స్పందించారు. రెండో పాటను ఇప్పుడే విడుదల చేయడం లేదని స్పష్టం చేశారు. దీంతో పవన్​ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.