1. ధరణి సరళతరం..!
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సరళతరం చేయనుంది. వివిధ క్యాటగిరిలకు సంబంధించిన 14 రకాల ఐచ్ఛికాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. పెండింగ్‌లో ఉన్న 14వేలకుపైగా మ్యూటేషన్ల ధరఖాస్తులను పరిష్కరంపైనా ప్రత్యేక చర్యలు తీసుకుటోంది. రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలకు రాలేని వృద్ధులు, బిల్డర్లు, ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేక ఐచ్ఛికాలను రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధం చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఆందోళన వద్దు..
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతున్నందున... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నియంత్రణలోనే ఉందని ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. నేనా.. భాజపాలోకా..?
ఒక పార్టీలో గెలిచి... మరో పార్టీలో మంత్రి అయిన చరిత్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ది అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. అజయ్ కుమార్ చేసిన విమర్శలను నారాయణ ఖండించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. యథాతథమేనా..?
మూడు రోజుల పాటు జరగనున్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) ద్వైమాసిక సమావేశం బుధవారం ప్రారంభమైంది. రెపో రేటు సహా ఇతర ఆర్థిక అంశాలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనుంది ఎంపీసీ. అయితే అక్టోబర్‌లోనూ రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతానికిపైగా నమోదైన కారణంగా మరోసారి వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఒక్క డోసుతో బ్రేక్
కరోనా నియంత్రణకు మరో టీకా అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. ఎల్లో ఫీవర్ వ్యాధి నివారణకు ఉపయోగించే టీకాను ఆధారంగా చేసుకొని కొవిడ్ వ్యాక్సిన్‌ను రూపొందించారు. ఎలుకలు, కోతులపై ఈ టీకాను ప్రయోగించగా.. ఉత్తమ ఫలితాలు కనిపించాయని శాస్త్రవేత్తలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. షిర్డీ సాయి దర్శనానికి..
షిరిడీ సాయిబాబాను దర్శించుకోవాలంటే తాము తీసుకొచ్చిన కొత్త నిబంధనను పాటించాల్సిందేనని ఆలయ ట్రస్టు అధికారులు తెలిపారు. సాయిబాబా మందిరంలోకి భక్తులు ప్రవేశించాలంటే భారతీయ వస్త్రధారణలోనే రావాలని స్పష్టంచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. పారిస్ ఒప్పందం
పారిస్ ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి నేతృత్వంలో అంతర్ మంత్రిత్వ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. బంగారం ధర పెరిగింది
పసిడి, వెండి ధరలు బుధవారం భారీగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.670కి పైగా ఎగిసింది. వెండి ధర కూడా భారీగా పెరిగి.. కిలో మళ్లీ రూ.62 వేల మార్క్ దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. అద్భుత విజయం
మూడో వన్డేలో అద్భుతమైన విజయం సొంతం చేసుకున్న కోహ్లీసేన.. క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది. ఇదే ఊపును టీ20 సిరీస్‌లోనూ కొనసాగించాలని చూస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. వదినను పరిచయం చేస్తా..
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్‌ధావన్.. తన అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తానని వాళ్లకు చెప్పారు. వరుణ్ 'కూలీ నం.1' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.