ETV Bharat / city

టాప్​ టెన్ న్యూస్ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Feb 1, 2021, 3:06 PM IST

topten news @3PM
టాప్​టెన్ న్యూస్ @3PM

1. సర్కారు బడికి పట్టం

విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ తెలిపారు. సిరిసిల్లలో ఆధునీకరించిన జిల్లా పరిషత్‌ పాఠశాలను ప్రారంభించారు. సీఎస్​ఆర్​ రూపేణా నిధులు ఇచ్చి పాఠశాల అభివృద్ధికి సాయ పడిన సంస్థకు అభినందనలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. సీనియర్ సిటిజన్లకు విముక్తి

సీనియర్ సిటిజన్లకు ఐటీ రిటర్నుల నుంచి విముక్తి కల్పించింది కేంద్రం. 75 ఏళ్లు పైబడిన వారిని రిటర్నుల దాఖలు నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు, డిజిటల్ మాధ్యమం ద్వారా కార్యకలాపాలు సాగించే రూ. 10 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న కంపెనీలకు పన్ను ఆడిట్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. సామాన్యుడికి శక్తి

విద్యుత్​, ఇంధన రంగంలో సామాన్యులకు మరింత సౌలభ్యం కల్పించే నిర్ణయాలను ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. విద్యుత్తు పంపిణీ వ్యవస్థలో పోర్టబులిటీ విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. పట్టణ గ్యాస్​ పంపిణీ వ్యవస్థను మరో 100 జిల్లాలకు పెంచుతున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. బడ్జెట్​లో బడులకు కళ

ఉన్నత విద్యా కమిషన్​ను ఏర్పాటు చేసేందుకు ఈ ఏడాది చట్టాన్ని తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. అదే సమయంలో నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా 15వేల పాఠశాలలను శక్తివంతంగా తీర్చిదిద్దనున్నట్టు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. అవి చిన్న కంపెనీలే

చిన్న కంపెనీలకు ఊరటనిచ్చేలా బడ్జెట్​లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ కీలక ప్రకటనల చేశారు. రూ.2 కోట్లకు క్యాపిటల్​ ఉన్న సంస్థలను సైతం చిన్న కంపెనీలుగా పరిగణించనున్నట్లు తెలిపారు. బ్యాంకులకు ఈ సారి బడ్జెట్​లో రూ.20 వేల కోట్ల మూలధన సాయాన్ని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. వూహాన్​లో డబ్ల్యూహెచ్​వో పరిశోధన

కరోనా ఆనవాళ్లపై పరిశోధనకు గానూ చైనాలో పర్యటిస్తున్న డబ్ల్యూహెచ్​ఓ నిపుణుల బృందం.. వుహాన్​లోని ఓ ప్రాంతీయ వ్యాధి నియంత్రణ కేంద్రాన్ని తాజాగా సందర్శించింది. వారితో పాటు చైనా అధికారులు, ప్రతినిధులు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. వ్యవసాయానికి పెద్దపీట

వ్యవసాయ రంగంలో కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​ పేర్కొన్నారు. ఫలితంగా 43.36లక్షల మంది రైతులు లబ్ధిపొందారన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని స్పష్టం చేసారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. టీ10లో సిక్సుల మోత

అబుదాబి టీ10 లీగ్​లో నార్తర్న్ వారియర్స్ బ్యాట్స్​మన్ నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బంగ్లా టైగర్స్​తో జరిగిన మ్యాచ్​లో 26 బంతుల్లోనే 89 పరుగులు సాధించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఇంగ్లాండ్​తో టెస్టు జట్టు

భారత్-ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 5న టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఈ జట్టుతో బరిలో దిగితే బాగుంటుందంటూ తన జట్టును ప్రకటించాడు మాజీ ఆటగాడు వసీం జాఫర్. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. వరుణ్ కొత్తచిత్రం

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త చిత్రానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. 'గరుడవేగ'తో ఆకట్టుకున్న ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.