1. సీఎం శుభాకాంక్షలు
ప్రగతి భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. తెంలగాణే ముందు..
దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ మార్గదర్శకంగా నిలుస్తోందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కరోనాను కేసీఆర్ సర్కార్ దీటుగా ఎదుర్కొందని తెలిపారు. 72వ గణతంత్ర వేడుకల్లో భాగంగా.. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించిన తమిళిసై.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. సంతోషికి సన్మానం
కొవిడ్ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో గణతంత్ర వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కలెక్టరేట్లో కలెక్టర్ అనితా రామచంద్రన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గల్వాన్‌లోయలో వీర మరణం పొందిన కర్నల్ సంతోష్ కుమార్ భార్యను కలెక్టర్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కలిసి శాలువాతో సత్కరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఎర్రకోటపై రైతు జెండా
పోలీసులు నిర్దేశించిన మార్గాలు కాకుండా ఇతర మార్గాల్లో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్న రైతులు.. ఎర్రకోటలోకి ప్రవేశించారు. అక్కడ జాతీయ జెండా ఎగరవేసే స్తంభానికి వేర్వేరు రైతు సంఘాల జెండాలు కట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. హస్తినలో ఉద్రిక్తత
రైతుల ట్రాక్టర్ల ర్యాలీలో విషాదం చోటుచేసుకుంది. మధ్య దిల్లీ ఐటీఓ ప్రాంతం వద్ద ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. పోలీసులకు రైతు రక్షణ
దిల్లీలో రైతుల నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఆదాయపన్ను శాఖ కార్యాలయం సమీపంలో కొందరు నిరసనకారులు పోలీసు అధికారిపై దాడికి యత్నించారు. అయితే అక్కడే ఉన్న కొందరు రైతులు పోలీసును కాపాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. భారీగా రుణాలు
2021-22 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.4 లక్షల కోట్లు పెంచి.. రూ.19 లక్షల కోట్లకు చేర్చే యోచలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. సెనేట్ ముందుకు ట్రంప్ అభిశంసన
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రాట్లు సంధించిన అభిశంసన అస్త్రం సోమవారం సెనేట్‌కు చేరింది. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి వైదొలిగాక అభిశంసనను ఎదుర్కొంటున్న మొదటి వ్యక్తి ట్రంప్ కానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. తటస్థంగా రిచర్డ్
ఫిబ్రవరి 3న ప్రారంభంకానున్న వెస్డిండీస్-బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టుకు తటస్థ అంపైర్‌ను నియమించింది ఐసీసీ. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎలీట్ ప్యానెల్లో బంగ్లాదేశ్ తరఫున అంపైర్ లేనందున ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా లాక్డౌన్ తర్వాత రిచర్డ్ తొలి తటస్థ అంపైర్‌గా నియమితుడయ్యాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. క్షమించండి..
సూరజ్ వెంజరముడు, నిమిష సజయన్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్'. జనవరి 15న ఓటీటీ సంస్థ నీ స్ట్రీమ్ ప్లాట్ఫామ్లో విడుదలైంది. అయితే చాలా మంది ఈ చిత్రాన్ని పైరసీ కాపీ ద్వారా వీక్షించారట. కానీ సినిమా చాలా బాగుందని.. నిర్మాతకు టికెట్ డబ్బులు పంపిస్తామని తెలిపారట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.