ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Jan 24, 2021, 2:57 PM IST

topten news@3PM
టాప్​టెన్​ న్యూస్​ @3PM

1. ఎస్టీ లా కళాశాల

రాష్ట్రానికి ఎస్టీ సంక్షేమ రెసిడెన్షియల్ లా కళాశాల మంజూరైంది. లా కళాశాలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించింది. 60 సీట్లతో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు కళాశాల మంజూరైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. కరీంనగర్​లో ఉద్రిక్తత

కరీంనగర్​లో తెరాస నేతలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో భాజపా నేతలు అడ్డుకునేందుకు యత్నించారు. తెరాస, భాజపా నేతల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'రఫేల్​' ముఖాముఖి..

భారత్, ఫ్రాన్స్ వాయుదళాలు సంయుక్తంగా నిర్వహించిన 'ఎక్స్ డిజర్ట్ నైట్' విన్యాసాల్లో రఫేల్​ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. ఇందులో రఫేల్​ యుద్ధ విమానాలను నడిపిన ఫ్రెంచ్​, భారత పైలెట్లను 'ఈటీవీ భారత్​' పలకరించింది. ​రఫేల్​ విమానాల్ని నడిపే సమయంలో అనుసరించే ఉత్తమ పద్ధతులను ఒకరినొకరితో పంచుకునేందుకు విన్యాసాలు ఉపయోగపడ్డాయని వారు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. గోమాతకు సీమంతం

కర్ణాటకలో ఓ వ్యక్తి తన ఇంటిలోని గోమాతకు ఘనంగా సీమంతం చేశాడు. ఊరి వారందరిని పిలిచి కనుల పండువగా వేడుక నిర్వహించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. మన్​ 'క్యా' బాత్

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆదివారం ఉదయం ఈరోడ్​ జిల్లాలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ 'మన్​ కీ బాత్'​ కార్యక్రమంపై పరోక్ష విమర్శలు చేశారు రాహుల్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. న్యూజిలాండ్​లో మళ్లీ షురూ..

న్యూజిలాండ్​లో దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ కరోనా సామాజిక వ్యాప్తి కేసు బయటపడింది. ఐరోపా నుంచి వచ్చిన మహిళలో ఈ రకమైన వైరస్​ను గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. అంచనాలు, ఫలితాలే కీలకం

కేంద్ర బడ్జెట్​, కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఈ వారం మార్కెట్లను దిశా నిర్దేశం చేయనున్నాయి. జనవరి నెల డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ వారం కాస్త ఒడుదొడుకులకు అవకాశముందంటున్నారు విశ్లేషకులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. అద్దె బైకులు..

హార్లీ డేవిడ్‌సన్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, యమహా ఎఫ్‌జెడ్‌... యువత కలలు కనే ‘మ్యాచో’ బైకులివి! బండి నడపడం వచ్చాక కనీసం ఒక్కసారైనా వీటితో చక్కర్లు కొట్టాలని కోరుకోని కుర్రాళ్లుండరు. సమస్యంతా వాటి ధరలతోనే! లక్షన్నర నుంచి పదిలక్షల దాకా ధర పలుకుతాయీ బైకులు. అంతంత పెట్టి ఆ బైకుల్ని సొంతం చేసుకోలేనివాళ్ల కోసమే కొన్ని స్టార్టప్‌లు వాటిని అద్దెకిస్తున్నాయి. ఆకర్షణీయమైన ఆఫర్లతో ఊరిస్తున్నాయి! పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. జోరుగా 'జో'

శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ సారథి జో రూట్​ తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నాడు. కెరీర్​లో 19వ శతకాన్ని నమోదు చేశాడు. ఆదివారం మూడో రోజు ఆటలో భాగంగా ఈ ఫీట్​ను అందుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. కొత్త సినిమాలు

కొత్త సినిమా అప్​డేట్స్​ వచ్చేశాయి. 'జాతిరత్నాలు', 'అక్షర', 'గాలి సంపత్​' చిత్రబృందాలు తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.