ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలు

topten news@11AM
టాప్​టెన్​ న్యూస్​@11AM
author img

By

Published : Jun 22, 2020, 10:56 AM IST

1. ఒకే వేదికపై రక్షణ మంత్రులు

భారత్​- చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇరు దేశాల రక్షణ మంత్రులు ఒకే టేబుల్​పై కూర్చోనున్నారు. మాస్కోలో జరిగే రష్యా విక్టరీ పరేడ్​ ఇందుకు వేదిక కానుంది. ఈ సందర్భంగా భారత్​- చైనా రక్షణ మంత్రులు మాట్లాడుకునే అవకాశాలున్నాయి. వారి సంభాషణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...

2. పోటాపోటీ

బాసర ట్రిపుల్ ఐటీ సీట్లకు ఈ ఏడాది తీవ్ర పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. పదో తరగతిలో ఎక్కువ మంది విద్యార్థులకు 10 జీపీఏ రానుండటమే దీనికి కారణం. ఒకవైపు అసలు విద్యా సంవత్సరాన్ని ఎలా పునరుద్ధరించాలనే అయోమయం.. మరోవైపు యూనివర్సిటీలోని విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారా? రద్దు చేస్తారా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

3. ఒకే రోజు 445 మరణాలు

దేశంలో కరోనా ఉద్ధృతి ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా మొత్తం 14,821 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 445 మంది కరోనా కాటుకు బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...

4. వామ్మో అంత మందికా?

యూపీలోని ఓ ప్రభుత్వ శిశు వసతిగృహంలో కరోనా కలకలం సృష్టించింది. కాన్పూర్​లో గల హాస్టల్​లో కొవిడ్​ పరీక్షలు నిర్వహించగా.. ఏకంగా 57 మందికి పాజిటివ్​గా తేలింది. అయితే అందులో ఐదుగురు బాలికలు గర్భంతో ఉండటం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...

5. సుప్రీంకు విదేశీయులు

సుమారు 35 దేశాలకు చెందిన 3,500మందికిపైగా విదేశీయులు భారత్​లోకి రాకుండా నిషేధం విధించటంపై సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. విదేశీయులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంతో ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు పిటిషనర్లు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...

6. భరోసా ఏదీ?

పరిశ్రమలు పడకేసి ఆర్థికాభివృద్ధి పూర్తిగా కుంటుపడిన నేపథ్యంలో వ్యవసాయం తరవాత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రెండో అతిపెద్ద రంగం సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) మాత్రమే. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భిన్న వర్గాల సమాహారంగా విలసిల్లుతున్న ఎంఎస్‌ఎంఈలను ప్రాంతీయ అసమానతలను తగ్గించే సాధనాలుగా పరిగణిస్తారు. ఈ రంగాన్ని ఆదుకొనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ కొంత ఊరట కలిగించినా.. పూర్తి భరోసా ఇవ్వలేకపోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

7. స్లెడ్జింగ్ చేయను

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీపై ఇక మీదట స్లెడ్జింగ్​ చేయనని చెప్పాడు ఆస్ట్రేలియా ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​. భారత్​తో డిసెంబరులో జరగనున్న టెస్టు సిరీస్ కోసం​ తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​ జరగకపోతే ఐపీఎల్​ ఆడేందుకు తనతో పాటు ఆసీస్​ క్రికెటర్లంతా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...

8. ఛాంపియన్​కు కరోనా

గత వారం ఆడ్రియా టెన్నిస్ టోర్నీలో పాల్గొన్న ప్రముఖ ప్లేయర్ గ్రిగర్ దిమిత్రోవ్​కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఇతడు.. తనను ఈ మధ్య కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...

9. అది నా కలంటున్న పాయల్

అతిలోకసుందరి శ్రీదేవి బయోపిక్​లో నటించాలనేది తన డ్రీమ్​రోల్​ అని చెప్పిన హీరోయిన్​ పాయల్​ రాజ్​పుత్​... ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. 'ఆర్​ఎక్స్ 100'తో కుర్రకారు మదిని దోచిన​ ముద్దుగుమ్మ పాయల్ ఈ బామ... తొలి సినిమాతోనే హిట్​ కొట్టి, ఎంతోమంది అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...

10. వర్మపై అమృత ఫైర్

రామ్‌ గోపాల్‌ వర్మని చూస్తే జాలేస్తోందని మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్‌ భార్య అమృత అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ప్రణయ్‌ హత్య’ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ‘ మర్డర్‌’ పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫాదర్స్‌ డే సందర్భంగా దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రణయ్‌-అమృతల ప్రేమ వ్యవహారం, ఆపై మారుతీరావు చేయించిన పరువు హత్య నేపథ్యంగా సినిమా తీయనున్నట్టు పోస్టర్‌ చూస్తే అర్థమౌతోంది. దీనిపై తాజాగా అమృత స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.