ETV Bharat / city

Top ten news: టాప్​ టెన్​ న్యూస్​ @11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలు

TOP TEN NEWS TODAY, telangana news
తెలంగాణ వార్తలు
author img

By

Published : Feb 11, 2022, 10:57 AM IST

తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకులు ఖండించారు. జగన్ అరాచక పాలన సాగిస్తున్నారని వారు ధ్వజమెత్తారు. గతంలో జగన్ జైలుకు వెళ్లినందునే.. అందరినీ పంపాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మరోవైపు అశోక్ బాబు తరఫు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కార్యాలయం వద్దకు రాగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.

  • ఏపీలో సినిమా టికెట్‌ ధరల పెంపు.. కొత్త ధరలు ఇవే..!!

సినిమా టికెట్‌ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సినీరంగ ప్రముఖులతో జరిగిన చర్చల్లో సీఎం జగన్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

  • లేడీస్​ ఎంపోరియంలో అగ్ని ప్రమాదం..

గోదావరిఖని వ్యాపార కేంద్రం లక్ష్మీనగర్​లోని పల్లవి లేడీస్ ఎంపోరియంలో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున దుకాణంలో మంటలు ఎగిసిపడ్డాయి. విద్యుత్​ షాట్​ సర్క్యూట్​ కావడం వల్ల మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు.

  • 'కాంగ్రెస్​ పాలనలో అంధకారం.. ఇప్పుడు అమృతకాలం'

అవినీతి, ద్రవ్యోల్బణం కాంగ్రెస్​ హయాంలో రాజ్యమేలాయన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2020-21 సంవత్సరంలో దేశంలో 1 బిలియన్ డాలర్​ విలువ చేరుకున్న 42 స్టార్టప్​లను గుర్తించామని వెల్లడించారు. దేశంలో అమృతకాలానికి ఇదే నిదర్శనమన్నారు.

  • రైలు టికెట్‌ వెండింగ్​లో కొత్త సౌకర్యం..

అన్‌రిజర్వుడు, ప్లాట్‌ఫాం టికెట్ల కొనుగోలుకు ప్రస్తుతం పలు రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉన్న ఆటోమెటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషిన్లలో కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు తమ సెల్‌ఫోన్‌లోని పేటీఎం లేక ఫ్రీఛార్జి యాప్‌ల ద్వారా ఏటీవీఎంలోని క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేసి డబ్బు చెల్లించి టికెట్‌ పొందవచ్చు.

  • లోయలోకి దూసుకెళ్లిన బస్సు..

పెరూలో ఓ బస్సు లోయలో పడిన ఘటనలో 20 మంది దుర్మరణం చెందారు. మరో 33 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

  • 'పొలార్డ్​ మిస్సింగ్​.. చాహల్ జేబులో ఉన్నాడేమో!'

పేలవ ప్రదర్శనతో విఫలమవుతున్న వెస్టిండీస్ కెప్టెన్​ కీరన్ పొలార్డ్​పై సరదాగా ట్రోల్ చేశాడు అతడి సహచరుడు డ్వేన్ బ్రావో. పొలార్డ్​ మిస్సింగ్​ అని, చివరిసారిగా అతడు చాహల్​ జేబులో కనబడ్డాడని ఇన్​స్టాలో పోస్ట్​ పెట్టాడు.

  • 'మళ్ళీ మొదలైంది' ఎలా ఉందంటే?

సుమంత్ నటించిన 'మళ్ళీ మొదలైంది'.. ఓటీటీలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూ చదివి తెలుసుకోండి.

  • దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా 58,077 మందికి వైరస్​ సోకింది. మరో 657 మంది మరణించారు. 1,50,407 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

  • జిల్లాల్లో భూముల విక్రయానికి నోటిఫికేషన్ జారీ

నిధుల సమీకరణ కోసం హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో భూముల అమ్మకాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా జిల్లాల్లోనూ భూములను విక్రయించనుంది. ఈ మేరకు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది.

  • అశోక్‌బాబు అరెస్ట్‌ను ఖండించిన తెదేపా నేతలు

తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకులు ఖండించారు. జగన్ అరాచక పాలన సాగిస్తున్నారని వారు ధ్వజమెత్తారు. గతంలో జగన్ జైలుకు వెళ్లినందునే.. అందరినీ పంపాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మరోవైపు అశోక్ బాబు తరఫు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కార్యాలయం వద్దకు రాగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.

  • ఏపీలో సినిమా టికెట్‌ ధరల పెంపు.. కొత్త ధరలు ఇవే..!!

సినిమా టికెట్‌ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సినీరంగ ప్రముఖులతో జరిగిన చర్చల్లో సీఎం జగన్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

  • లేడీస్​ ఎంపోరియంలో అగ్ని ప్రమాదం..

గోదావరిఖని వ్యాపార కేంద్రం లక్ష్మీనగర్​లోని పల్లవి లేడీస్ ఎంపోరియంలో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున దుకాణంలో మంటలు ఎగిసిపడ్డాయి. విద్యుత్​ షాట్​ సర్క్యూట్​ కావడం వల్ల మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు.

  • 'కాంగ్రెస్​ పాలనలో అంధకారం.. ఇప్పుడు అమృతకాలం'

అవినీతి, ద్రవ్యోల్బణం కాంగ్రెస్​ హయాంలో రాజ్యమేలాయన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2020-21 సంవత్సరంలో దేశంలో 1 బిలియన్ డాలర్​ విలువ చేరుకున్న 42 స్టార్టప్​లను గుర్తించామని వెల్లడించారు. దేశంలో అమృతకాలానికి ఇదే నిదర్శనమన్నారు.

  • రైలు టికెట్‌ వెండింగ్​లో కొత్త సౌకర్యం..

అన్‌రిజర్వుడు, ప్లాట్‌ఫాం టికెట్ల కొనుగోలుకు ప్రస్తుతం పలు రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉన్న ఆటోమెటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషిన్లలో కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు తమ సెల్‌ఫోన్‌లోని పేటీఎం లేక ఫ్రీఛార్జి యాప్‌ల ద్వారా ఏటీవీఎంలోని క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేసి డబ్బు చెల్లించి టికెట్‌ పొందవచ్చు.

  • లోయలోకి దూసుకెళ్లిన బస్సు..

పెరూలో ఓ బస్సు లోయలో పడిన ఘటనలో 20 మంది దుర్మరణం చెందారు. మరో 33 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

  • 'పొలార్డ్​ మిస్సింగ్​.. చాహల్ జేబులో ఉన్నాడేమో!'

పేలవ ప్రదర్శనతో విఫలమవుతున్న వెస్టిండీస్ కెప్టెన్​ కీరన్ పొలార్డ్​పై సరదాగా ట్రోల్ చేశాడు అతడి సహచరుడు డ్వేన్ బ్రావో. పొలార్డ్​ మిస్సింగ్​ అని, చివరిసారిగా అతడు చాహల్​ జేబులో కనబడ్డాడని ఇన్​స్టాలో పోస్ట్​ పెట్టాడు.

  • 'మళ్ళీ మొదలైంది' ఎలా ఉందంటే?

సుమంత్ నటించిన 'మళ్ళీ మొదలైంది'.. ఓటీటీలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూ చదివి తెలుసుకోండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.