ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @7AM - ts news in Telugu

ఇప్పటివరకు ప్రధానవార్తలు

top ten news
టాప్​టెన్​ న్యూస్​
author img

By

Published : Feb 8, 2022, 7:01 AM IST

  • కాసుల వర్షం కురిపిస్తోన్న రిజిస్ట్రేషన్ శాఖ

TELANGANA STAMPS, REGISTRATION DEPT: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం అనూహ్యంగా పెరుగుతోంది. ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఏటికేడు పెరుగుతూ వస్తున్న రాబడులు ఈ ఆర్థిక ఏడాదిలో ఇప్పటికే పదివేల కోట్లు దాటగా.... మార్చి చివరినాటికి మరో రెండున్నరవేల కోట్లు ఆదాయం వస్తుందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అంచనా వేస్తోంది.

  • రాష్ట్రానికి అండగా మేము.. దేశానికే దండగ మీరు!

KTR Tweet: తెరాస, భాజపా ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పరస్పరం విమర్శలు కురిపించారు. రాష్ట్రంపై వివక్షను ప్రశ్నిస్తే సంబంధం లేని అంశాలను తెరపైకి తెస్తున్నారని కిషన్ రెడ్డిపై విరుచుకుపడిన కేటీఆర్... తాము రాష్ట్రానికి అండగా.. భాజపా దేశానికి దండగ అని వ్యాఖ్యానించారు.

  • మహేశ్​ బ్యాంకు హ్యాకింగ్ కేసులో పలువురు ఖాతాదారులు అరెస్ట్​..

Mahesh Bank Hacking case: మహేశ్ బ్యాంకు సర్వర్ హ్యాకింగ్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పలువురు ఖాతాదారులను అరెస్ట్ చేశారు. పలువురి ఖాతాలకు సంబంధించిన వివరాలను సేకరించి నైజీరియన్లకు అందించటంలో కీలక పాత్ర పోషించిన నిందితున్ని పోలీసులు విచారిస్తున్నారు.

  • యాదాద్రిలో కేసీఆర్​ పర్యటన.. పునర్నిర్మాణ పనులపై దిశానిర్దేశం..

CM KCR Yadadri Visit : ముఖ్యమంత్రి కేసీఆర్​ యాదాద్రిలో పర్యటించారు. హెలికాప్టర్‌లో యాదాద్రి చేరుకున్న సీఎం విహంగవీక్షణం చేశారు. పంచ నారసింహుల దివ్యాలయ ఉద్ఘాటన ఏర్పాట్లను పరిశీలించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు, ఇతర నిర్మాణాల పురోగతిపై మంత్రులు, ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్షించారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ, మార్చి 21 నుంచి ప్రారంభం కానున్నా మహా సుదర్శన యాగం ఏర్పాట్లపై సమీక్షించారు.

  • మణికొండ జాగీర్‌లో 1,654 ఎకరాలు ప్రభుత్వానివే: సుప్రీం

Manikonda Jagir Case: హైదరాబాద్‌ మహానగరం మణికొండ జాగీర్‌ 1654.32 ఎకరాల భూమి తెలంగాణ సర్కార్​కే చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాష్ట్ర సర్కారు చూపిన చొరవను ధర్మాసనం ప్రశంసించింది. తీర్పుపై సీఎం కేసీఆర్‌ సంతోషం వ్యక్తంచేశారు. అందుకు కృషిచేసిన న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులకు అభినందనలు తెలిపారు.

  • భార్య, కూతురికి సేవ చేయలేక విసిగి.. గొంతు కోసి..

Husband killed His wife: మహారాష్ట్ర ముంబయిలో దారుణం జరిగింది. భార్య, కూతుర్ని కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడో భర్త. అందేరిలోని షేర్​-ఈ పంజాబ్ కాలనీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

  • డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక.. 'దశాబ్దాల పాటు కొవిడ్‌ 19 ప్రభావం'

WHO on Corona: కరోనా ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) హెచ్చరించింది. మహమ్మారి ఎంత సుదీర్ఘంగా ప్రబలితే.. దాని ప్రభావం కూడా అంతే స్థాయిలో ఉంటుందని పేర్కొంది.

  • ఎల్‌ఐసీ పాలసీదారులకు గుడ్‌న్యూస్‌..

LIC IPO For Policyholders: త్వరలో రాబోయే ఎల్‌ఐసీ ఐపీఓలో పాలసీదారులకు డిస్కౌంట్‌ లభించనుంది. 5 శాతం మేర డిస్కౌంట్‌ అందించే అవకాశం ఉందని ఎకనామిక్‌ టైమ్స్‌ పేర్కొంది. సెబీకి త్వరలో సమర్పించనున్న ముసాయిదా పత్రాల్లో ఈ వివరాలు ఉండనున్నాయి.

  • గంగూలీ సలహాను పక్కనపెట్టిన హార్దిక్..

Hardik Pandya Skips Ranji Trophy: టీమ్‌ఇండియా ఆల్ రౌండర్‌ హర్దిక్ పాండ్య.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఇచ్చిన సలహాను పక్కనపెట్టినట్లు సమాచారం. వెన్నెముక గాయం కారణంగా హర్దిక్‌ పాండ్య భారత జట్టుకు దూరమైన క్రమంలో.. ఫిట్‌నెస్‌ను నిరూపించుకునేందుకు రంజీల్లో ఆడటం ఉత్తమమని గంగూలీ ఇటీవల సలహా ఇచ్చాడు. అయితేే తాజాగా, హార్దిక్‌ రంజీ క్రికెట్లో పాల్గొనడం లేదని ప్రకటించాడు.

  • పాన్​ఇండియాగా ప్రాంతీయ సినిమా.. ఆ ఇద్దరి వల్లే: ఎన్టీఆర్

NTR: ప్రాంతీయ సినిమా హద్దులను చెరిపేసి, భారతీయ సినిమాగా మార్చిన ఘనత ఇద్దరికే దక్కుతుందని అన్నారు యంగ్​టైగర్​ ఎన్టీఆర్. వారిని చరిత్ర ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.