ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @11AM - top ten news

ఇప్పటివరకు ప్రధానవార్తలు

top ten news
టాప్​టెన్​ న్యూస్​
author img

By

Published : Feb 7, 2022, 11:00 AM IST

  • దేశంలో లక్ష దిగువకు కరోనా కొత్త కేసులు..

Covid Cases in India: భారత్​లో కరోనా కొత్త కేసులు లక్ష దిగువకు చేరుకున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 83,876 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే 895 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 7.25 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • కాసేపట్లో యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్

CM KCR visit to Yadadri: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ ఉద్ఘాటన తేదీ సమీపిస్తుండటంతో పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విశ్వఖ్యాతి చెందేలా పునర్నిర్మితమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం మహాకుంభ సంప్రోక్షణపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు.

  • తప్పతాగి వాహనాలు నడిపితే అంతే..!

Drunk and Drive Hyderabad : తప్పతాగి వాహనాలు నడిపి వారి ప్రాణాలు తీసుకోవడేమే కాదు.. ఎదురుగా వచ్చిన వారి ఉసురు తీస్తున్న మందుబాబులపై హైదరాబాద్​ పోలీసులు కొరఢా ఝళిపించేందుకు సిద్ధమవుతున్నారు. మద్యంప్రియుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త ప్లాన్​లను రూపొందిస్తున్నారు.

  • మెరుగైన సేవల కల్పనే లక్ష్యంగా...

TS RTC Call Center : ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ ఆర్టీసీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఉన్న కాల్ సెంటర్‌లో అనేక మార్పులు, చేర్పులు చేసింది. హైటెక్ తరహాలో కాల్ సెంటర్​ను అభివృద్ది చేస్తున్నారు. ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు కాల్​సెంటర్​ను ఆర్టీసీ వేదికగా మార్చుకుంటోంది.

  • లతా మంగేష్కర్​కు రాజ్యసభ నివాళి

లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించారు రాజ్యసభ సభ్యులు. ఎగువసభలో ఆమె సంస్మరణ సందేశాన్ని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు చదివి వినిపించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు సభ్యులు. అనంతరం సభను ఒక గంట పాటు వాయిదా వేశారు ఛైర్మన్​.

  • రూ.5 కోట్లు విలువైన హెరాయిన్ పట్టివేత

Maharashtra ATS: రూ.5 కోట్లు విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకుంది మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళం. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేసింది.

  • కానిస్టేబుల్​ సాహసంతో విద్యార్థిని సేఫ్​

అమెరికాలోని మేరీల్యాండ్​ పోలీసు అధికారి తన ప్రాణాలను పణంగా పెట్టి ఓ విద్యార్థిని కాపాడారు. నార్త్ ఈస్ట్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అన్నెట్ గుడ్‌ఇయర్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ క్రాస్‌వాక్ వద్ద ఉండి ట్రాఫిక్‌ను కంట్రోల్​ చేస్తున్నారు. ఈ ఇదే సమయంలో ఓ విద్యార్థిని రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో ఓ కారు వేగంగా దూసుకు రావడం కనిపెట్టిన మహిళా కానిస్టేబుల్​.. వెంటనే ఆ విద్యార్థిని పక్కకు నెట్టివేసింది.

  • ఒడుదొడుకుల్లో మార్కెట్లు

Stock market live updates: స్టాక్​ మార్కెట్లు సోమవారం సెషన్​ను ఫ్లాట్​ ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్​ 200 పాయింట్లకుపైగా నష్టపోయి 58,339 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 80 పాయింట్ల పతనంతో 17,436 వద్ద ట్రేడవుతోంది.

  • 'డీఆర్​ఎస్'​కు రోహిత్ పేరు

IND vs WI: కెప్టెన్​గా తొలి వన్డేలో విజయం సాధించిన రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు మాజీ క్రికెటర్ గావస్కర్. డీఆర్ఎస్​కు హిట్​మ్యాన్​ పేరుతో కొత్త పేరు కూడా పెట్టాడు.

  • పెళ్లి చేసుకున్న సింగర్ రేవంత్

తెలుగు సినీ గాయకుడు, ఇండియన్‌ ఐడిల్‌-9 విజేత రేవంత్‌ ఓ ఇంటి వాడయ్యారు. గుంటూరుకు చెందిన అన్వితతో ఫిబ్రవరి 6న ఆయన వివాహం వేడుకగా జరిగింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా కుటుంబసభ్యులు, సన్నిహితులు సమక్షంలోనే వీరి వివాహం గుంటూరులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.