కోదండరాం నిరసన దీక్ష
కరోనా వల్ల తలెత్తిన సమస్యల పరిష్కారానికి కోదండరాం నిరసన దీక్ష చేపట్టారు. కోదండరాంకు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు పూలమాల వేసి దీక్షను ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కరోనా పరీక్షలు నిలిపివేత..!
పలు ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలను నిలిపివేశారు. నేటి నుంచి ఈనెల 5 వరకు కరోనా పరీక్షలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రవిప్రకాశ్‌పై మరో కేసు
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం కేసు నమోదు చేసింది. టీవీ9 మాతృ సంస్థ అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ అనుమతుల్లేకుండా నిధులు ఉపసంహరించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు గతంలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
చిట్కాలతో చెక్ పెట్టేయండి!
వానాకాలం, శీతాకాలంలోని చల్లని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎవరు ఇష్టపడరు చెప్పండి. అయితే ఈ సమయాల్లో ఆరోగ్య సమస్యలూ ఎక్కువగా వస్తుంటాయి. వాటిల్లో ప్రధానమైంది గొంతునొప్పి. మరి ఈ బాధ నుంచి బయటపడేదెలా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
50 మంది మృతి
మయన్మార్‌లో జాడే మైన్‌లో కొండచరియలు విరిగిపడి.. దాదాపు 50 మంది మరణించారు. కార్మికులు పనిచేస్తున్న సమయంలో వర్షానికి కొండచరియలు విరిగిపడగా.. మట్టిదిబ్బలో చాలా మంది చిక్కుకుపోయారని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
'ఇబ్బందేమీ లేదు.. కానీ'
ఇన్నాళ్లూ.. తనకు మాస్క్ అవసరం లేదన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు పరిస్థితి డిమాండ్ చేస్తే మాస్క్ పెట్టుకోవడానికి అభ్యంతరమేమీ లేదు అంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అయితే ఏంటి?
అమెరికా కాలిఫోర్నియాలో టెస్లా కంపెనీ ఇటీవల కార్యకలాపాలు పునఃప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇంకా విధుల్లోకి చేరని ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ ప్రకటించిందని ఆ కంపెనీకి చెందిన కార్మిక సంఘాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
క్రెడిట్ కార్డు వాడండిలా..
కరోనాతో ఆదాయం తగ్గినా.. క్రెడిట్ కార్డు ఉందిగా అని చాలా మంది ధీమాగా ఉన్నారు. ఇది మంచికే అయినా ప్రస్తుత పరిస్థితుల్లో క్రెడిట్ కార్డును విచ్చలవిడిగా వాడితే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పకపోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
'తను అయితే బాగుంటుంది'
టీమ్ఇండియా క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ తన బయోపిక్ తీస్తే రాజ్‌కుమార్ రావును హీరోగా తీసుకోవాలని సూచించాడు. అలాగే మేరఠ్‌లో ఓ క్రికెట్ అకాడమీ స్థాపించాలని ఉందని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
47 రోజుల్లో ఏం జరిగింది?
సత్యదేవ్ ప్రధాన పాత్రలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం '47 డేస్'. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష ద్వారా తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.