ETV Bharat / city

టాప్‌ టెన్ న్యూస్ @ 9 PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

Top ten news till 9 PM
టాప్‌ టెన్ న్యూస్ @ 9 PM
author img

By

Published : May 19, 2021, 8:59 PM IST

కొత్తగా 3,837 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 3,837 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం సాయంత్రం ఐదున్నర నుంచి బుధవారం సాయంత్రం ఐదున్నర వరకు 71,070 పరీక్ష ఫలితాలు వచ్చాయి. కొత్తగా నమోదైన 3,837 కరోనా కేసులతో కలిపి... రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 5,40,603కు చేరింది. మహమ్మారికి మరో 25మంది బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

నేనున్నానంటూ సీఎం అభయహస్తం.!

గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు అందుతున్న చికిత్సను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. వారిలో భరోసాను నింపి ధైర్యాన్నిచ్చారు. రోగులతో మాట్లాడి చికిత్స, భోజనం గురించి ఆరా తీసిన సీఎం.. సమస్యల పరిష్కారానికి అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

'పది దాటితే సీజ్'

ఈనెల 30 తర్వాత మరోసారి లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశం లేకుండా... ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్టు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌ అమలుపై పోలీస్‌ కమిషనర్లు, జోనల్ ఐజీలు, డీఐజీలు, జిల్లా ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఒక్కరోజే 4,529మంది మృతి.!

కరోనా మహమ్మారి దేశంలో మరణమృదంగం మోగిస్తోంది. వైరస్ ధాటికి మరో 4,529మంది బలయ్యారు. ఇప్పటివరకు రోజువారీ కరోనా మరణాల్లో ఇవే అధికం కావడం గమనార్హం. కొత్తగా 2.67 లక్షల కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3నెలల తర్వాతే టీకా!

కరోనా వ్యాక్సినేషన్​పై జాతీయ టీకా నిపుణుల కమిటీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది కేంద్రం. కొత్త ప్రతిపాదనలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తెలియజేసింది. కరోనా నుంచి కోలుకున్న 3 నెలల తర్వాతే టీకా తీసుకోవాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

1000కోట్ల ఆర్థిక సాయం.!

తౌక్టేతో అతలాకుతలమైన గుజరాత్​లో ఏరియల్​ సర్వే నిర్వహించి, అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. రాష్ట్రానికి 1000కోట్ల తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల పరిహారంతో పాటు గాయపడిన వారికి రూ. 50వేలు అందించనున్నట్టు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

గాజాపై ఆగని దాడులు..!

హమాస్‌ తీవ్రవాదుల అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ బుధవారం కూడా భారీ వైమానిక దాడులు చేసింది. గాజా నగరంలో విద్యా సంస్థలు, పుస్తక విక్రయ కేంద్రాలు ఉన్న ఆరు అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేసింది. అందులో ఉంటున్నవారిని ముందుగానే హెచ్చరించి ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం వాటిల్లలేదు. మరో ప్రాంతంలో జరిగిన క్షిపణి దాడుల్లో ఆరుగురు మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

వాట్సాప్​కు కేంద్రం వార్నింగ్!

ఇటీవల అమలులోకి తెచ్చిన నూతన ప్రైవసీ పాలసీలను ఉపసంహరించుకోవాలని వాట్సాప్​ను కేంద్రం ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంపై ఎలక్ట్రానిక్​, ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వాట్సాప్​కు లేఖ రాసినట్లు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఆసియా కప్​ రద్దు

శ్రీలంక వేదికగా జూన్​లో జరగాల్సిన ఆసియా కప్​ను రద్దు చేస్తున్నట్లు లంక క్రికెట్ బోర్డు సీఈఓ యాష్లే డిసిల్వా వెల్లడించారు. శ్రీలంకలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టోర్నీ నిర్వహణ కష్టమని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అల్లు అర్జున్​ రికార్డు బ్రేక్​.!

కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. సోషల్ మీడియాలోనూ దుమ్ము దులిపేస్తున్నారు. దక్షిణాది హీరోలకు ఇన్​స్టాగ్రామ్​లో సాధ్యం కాని ఓ ఘనతను దక్కించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.