ETV Bharat / city

TOP NEWS: టాప్​న్యూస్​@ 9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS, telangana news
తెలంగాణ టాప్​న్యూస్
author img

By

Published : Jan 1, 2022, 9:07 AM IST

పిల్లలకు న్యూ ఇయర్ ​రోజున అదిరిపోయే ఆఫర్​ ఇచ్చింది టీఎస్​ఆర్టీసీ. 12 ఏళ్లలోపు పిల్లలు జనవరి 1న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పిల్లలతో పాటు తల్లిదండ్రుల్లో ఒకరు తప్పనిసరిగా ఉండాలి. ఏ ఆర్టీసీ బస్సులోనైనా 12ఏళ్లలోపువారు ఇవాళ ఫ్రీగా తిరిగేయవచ్చు.

  • ఆర్మూరు చీరలకు అందలం..

పట్టు చీరలంటే.. పడతులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మరి ఒకనాటి రాజసం ఉట్టిపడే పట్టు చీరలు మార్కెట్లోకి వస్తుంటే...అంతకంటే కావాల్సిందేముంది. ఓరుగల్లు చేనేత వనితలు ఈ ఘనతను సాధిస్తున్నారు.

  • 'ఓ మంచి మాట అనుకుందాం'

కొత్త సంవత్సరమంటే అందరికీ గుర్తొచ్చేవి.. తీర్మానాలు! నూతన ఏడాదిని కొంగొత్తగా ప్రారంభించాలని.. ఏడాది పొడవునా జీవితాన్ని ఆరోగ్యమయం.. ఆనందమయం.. చేసుకోవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు.

  • ఎకరానికి రూ.10 లక్షలు సంపాదన

సాగు.. సాగట్లేదు. దేశానికే అన్నంపెట్టే రైతన్న నోట్లోకి నాలుగు వేళ్లు పోవట్లేదు. కానీ.. కాస్తంత దృష్టిపెడితే మట్టిలోనే బంగారం వెలికితీయొచ్చు! ఉన్న కొద్దిపాటి భూమిలోనే సిరులు పండించుకోవచ్చు.

  • ఆలయంలో తొక్కిసలాట

కొత్త సంవత్సరం వేళ విషాదం చోటు చేసుకుంది. జమ్ముశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12మంది భక్తులు మృతి చెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయంలో పూజల కోసం భక్తులు భారీగా తరలిరావటం వల్ల తొక్కిసలాట జరిగింది.

  • మీరూ విజేతలు కావాలంటే?

కొంత కాలంగా క్రీడారంగంలో భారీ మార్పులు వస్తున్నాయి. అబ్బాయిలు, అమ్మాయిలు బాగా రాణిసున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఆటల వైపు నడిపించేలా చర్యలు తీసుకుంటున్నారు.

  • తెరపైకి మళ్లీ అనుష్క!

చాలా కాలంగా నటనకు దూరంగా ఉన్న బాలీవుడ్​ భామ అనుష్క శర్మ.. అభిమానులను మళ్లీ అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రెండు భారీ బడ్జెట్‌ సినిమాలతో పాటు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం నటించనున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. వీటికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుందని పేర్కొన్నాయి.

  • ఈ ఐడియాతో మీరూ స్టార్లైపోండి

సినిమా రంగంలో రాణించాలని చాలా మంది కలలు కంటారు. యాక్షన్​.. కట్​ అంటూ దర్శకత్వం వహించాలనుకుంటారు. ఆ కలలను నిజం చేసుకోవడానికి తగిన సూచనలను ఇస్తున్నారు మన స్టార్లు. మరి వారేమంటున్నారో తెలుసుకుందాం..

  • యాదాద్రికి ఎన్​ఆర్​ఐ భారీ విరాళం

యాదాద్రి లక్ష్మీనరసింహ దేవాలయ విమాన గోపురం బంగారు తాపడానికి భారీగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నగదు రూపంలో.. మరికొందరు బంగారాన్ని విరాళంగా ఇస్తున్నారు. తాజాగా ప్రవాస భారతీయుడు(ఎన్​ఆర్​ఐ) పైళ్ల మల్లారెడ్డి బంగారు తాపడానికి కిలో పసిడిని విరాళంగా సమర్పించారు.

  • దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలని ట్వీట్​ చేశారు.

  • టీఎస్​ఆర్టీసీ న్యూఇయర్​ గిఫ్ట్

పిల్లలకు న్యూ ఇయర్ ​రోజున అదిరిపోయే ఆఫర్​ ఇచ్చింది టీఎస్​ఆర్టీసీ. 12 ఏళ్లలోపు పిల్లలు జనవరి 1న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పిల్లలతో పాటు తల్లిదండ్రుల్లో ఒకరు తప్పనిసరిగా ఉండాలి. ఏ ఆర్టీసీ బస్సులోనైనా 12ఏళ్లలోపువారు ఇవాళ ఫ్రీగా తిరిగేయవచ్చు.

  • ఆర్మూరు చీరలకు అందలం..

పట్టు చీరలంటే.. పడతులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మరి ఒకనాటి రాజసం ఉట్టిపడే పట్టు చీరలు మార్కెట్లోకి వస్తుంటే...అంతకంటే కావాల్సిందేముంది. ఓరుగల్లు చేనేత వనితలు ఈ ఘనతను సాధిస్తున్నారు.

  • 'ఓ మంచి మాట అనుకుందాం'

కొత్త సంవత్సరమంటే అందరికీ గుర్తొచ్చేవి.. తీర్మానాలు! నూతన ఏడాదిని కొంగొత్తగా ప్రారంభించాలని.. ఏడాది పొడవునా జీవితాన్ని ఆరోగ్యమయం.. ఆనందమయం.. చేసుకోవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు.

  • ఎకరానికి రూ.10 లక్షలు సంపాదన

సాగు.. సాగట్లేదు. దేశానికే అన్నంపెట్టే రైతన్న నోట్లోకి నాలుగు వేళ్లు పోవట్లేదు. కానీ.. కాస్తంత దృష్టిపెడితే మట్టిలోనే బంగారం వెలికితీయొచ్చు! ఉన్న కొద్దిపాటి భూమిలోనే సిరులు పండించుకోవచ్చు.

  • ఆలయంలో తొక్కిసలాట

కొత్త సంవత్సరం వేళ విషాదం చోటు చేసుకుంది. జమ్ముశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12మంది భక్తులు మృతి చెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయంలో పూజల కోసం భక్తులు భారీగా తరలిరావటం వల్ల తొక్కిసలాట జరిగింది.

  • మీరూ విజేతలు కావాలంటే?

కొంత కాలంగా క్రీడారంగంలో భారీ మార్పులు వస్తున్నాయి. అబ్బాయిలు, అమ్మాయిలు బాగా రాణిసున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఆటల వైపు నడిపించేలా చర్యలు తీసుకుంటున్నారు.

  • తెరపైకి మళ్లీ అనుష్క!

చాలా కాలంగా నటనకు దూరంగా ఉన్న బాలీవుడ్​ భామ అనుష్క శర్మ.. అభిమానులను మళ్లీ అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రెండు భారీ బడ్జెట్‌ సినిమాలతో పాటు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం నటించనున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. వీటికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుందని పేర్కొన్నాయి.

  • ఈ ఐడియాతో మీరూ స్టార్లైపోండి

సినిమా రంగంలో రాణించాలని చాలా మంది కలలు కంటారు. యాక్షన్​.. కట్​ అంటూ దర్శకత్వం వహించాలనుకుంటారు. ఆ కలలను నిజం చేసుకోవడానికి తగిన సూచనలను ఇస్తున్నారు మన స్టార్లు. మరి వారేమంటున్నారో తెలుసుకుందాం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.