ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్@7PM - Telangana main news

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్ న్యూస్@7PM
టాప్​టెన్ న్యూస్@7PM
author img

By

Published : Dec 9, 2020, 6:55 PM IST

1. ఆధునిక హంగులతో 'కేసీఆర్​ నగర్​'

సంపన్నవర్గాలకు తీసిపోని విధంగా ఇళ్లు.. సకల సౌకర్యాలతో గృహసముదాయం. గేటెడ్‌ కమ్యూనిటీని తలపించే నిర్మాణాలు. పైప్‌లైన్‌ ద్వారా ఇంటింటికి గ్యాస్‌. నిరంతరం తాగునీరు, విద్యుత్‌ సరఫరా.. ఇవి పేదలకు కేసీఆర్‌ సర్కారు అందిస్తున్న రెండు పడకగదుల ఇళ్ల ప్రత్యేకత. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. వచ్చే నెల క్లినికల్‌ పరీక్షలు

ఇప్పటికే అభివృద్ధి చేసిన కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) టీకా ‘కొవాగ్జిన్‌’పై ఒక పక్క మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహిస్తూనే, మరోపక్క ముక్కు ద్వారా ఇచ్చే కొవిడ్‌-19 టీకాపై పరీక్షలు ప్రారంభించటానికి భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సిద్ధమవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. హైద‌రాబాద్ టు అమెరికా

హైదరాబాద్​ నుంచి అమెరికాకు నేరుగా విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 15 న హైదరాబాద్​ నుంచి చికాగోకు ఎయిర్ ఇండియా సర్వీసులు ప్రారంభించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

విలేకరిని బెదిరించిన వివాదంలో ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. బాధితుడు సంతోశ్​నాయక్​కు క్రమంగా మద్దతు పెరుగుతోంది. జర్నలిస్టులతోపాటు రాజకీయ పార్టీలు అండగా నిలుస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. రైతు నిరసనలు ఉద్ధృతం

నూతన వ్యవసాయ చట్టాల్లో సవరణల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సవరణలను తిరస్కరిస్తున్నట్లు దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు స్పష్టం చేశాయి. కేంద్ర ప్రతిపాదనలపై చర్చించిన రైతు సంఘాల నేతలు వాటిని ఏకగ్రీవంగా తిరస్కరిస్తున్నట్లు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. రాష్ట్రపతితో విపక్షాల భేటీ

సాగు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాల్సిందేనని తేల్చిచెప్పాయి విపక్షాలు. ఇదే విషయాన్ని రాష్ట్రపతి కోవింద్​తో జరిగిన భేటీలోనూ స్పష్టంగా చెప్పినట్టు వివరించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. అసహనానికి పర్యాయపదం

బంగాల్​ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు గుప్పించారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మమత.. అసహనానికి పర్యాయపదం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. తగ్గిన పసిడి ధర

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దిల్లీలో పది గ్రాముల పసిడి ధర రూ.118 పడిపోయి.. రూ. 49,221కి పరిమితమైంది. వెండి ధర సైతం స్వల్పంగా తగ్గింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. 'స్కామ్​ 1992'​కు అగ్రస్థానం

'స్కామ్​ 1992' వెబ్​సిరీస్​కు ప్రేక్షకుల నుంచి విశేషాదరణ లభిస్తోంది. ఈ ఏడాది విడుదలైన వెబ్​ సిరీస్​లలో ఐఎమ్​డీబీ రేటింగ్స్​లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం ఆధారంగా దీనిని రూపొందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. మాజీల స్పందన

ప్రముఖ క్రికెటర్​ పార్థివ్​ పటేల్​.. అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో పలువురు మాజీలు ఈ విషయమై స్పందించారు. పార్థివ్​ భవిష్యత్​కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.