తండాలో గవర్నర్ టీకా...
రంగారెడ్డి జిల్లా కేసీ తండాలో గవర్నర్ తమిళిసై కరోనా టీకా తీసుకున్నారు. గిరిజనులతో కలిసి ఆమె రెండో డోసు వేయించుకున్నారు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
' రక్షించేది తెరాసయే'
గులాబీ కండువా కప్పి ఎల్.రమణకు మంత్రి కేటీఆర్ స్వాగతం తెలిపారు. పార్టీ సభ్యత్వం ఇచ్చి లాంఛనంగా ఆహ్వానించారు. తెలంగాణ ప్రయోజనాలను రక్షించేంది తెరాస మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నిరసనలో అపశ్రుతి..
మెదక్‌లో కాంగ్రెస్ నిర్వహించిన నిరసన ప్రదర్శనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎడ్లబండిపై నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ జారిపడ్డారు. ప్రసంగిస్తున్న సమయంలో ఎడ్లబండిపై నుంచి కింద పడిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఏపీలో ఒకే తరహాలో...
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ఒకే విధంగా కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ పరిస్థితులపై ఆ రాష్ట్ర సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పిడుగుల బీభత్సం
ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలోని పలు ప్రాంతాల్లో ఆదివారం పిడుడుపాటుకు 68 మంది బలయ్యారు. యూపీలో అత్యధికంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారాన్ని అందిస్తామని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సహా కేంద్రం ప్రకటించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వాటితో కరోనాకు చెక్
యావత్ ప్రపంచానికి పెను సవాలు విసురుతున్న కరోనా మహమ్మారిని(Corona virus) నాసల్ టీకాతో మరింత సమర్థవంతంగా అడ్డుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
దళాల ఉపసంహరణ
అఫ్గానిస్థాన్ నుంచి తమ దళాలను వెనక్కి తీసుకొచ్చినట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణ ప్రక్రియ ఆగస్టు 31తో ముగియనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఫ్లిప్‌కార్ట్‌కు భారీ నిధులు. !
వాల్‌మార్ట్, సాఫ్ట్ బ్యాంక్, జీఐసీ సహా పలు ఇతర సంస్థల నుంచి దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ భారీగా నిధులు సమీకరించింది. ఆయా సంస్థల నుంచి సమీకరించిన నిధులతో కంపెనీ విలువ దాదాపు రూ.2.8 లక్షల కోట్లకు చేరినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
క్రికెటర్‌కు కొవిడ్.
ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్(County Cricket) ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్ కరోనా బారిన పడ్డాడు. వెటరన్ బ్యాట్స్‌మన్ పీటర్ హాండ్స్‌కాంబ్ (Peter Handscomb)కు కొవిడ్ నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కత్తి మహేశ్ అంత్యక్రియలు
సినీ విమర్శకుడు కత్తి మహేశ్(kathi mahesh) అంత్యక్రియలు.. చిత్తూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం యలమందలో నేడు జరగనున్నాయి. జూన్ 26న రోడ్డు ప్రమాదానికి గురైన మహేశ్.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జులై 10న మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.