ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @3pm - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @3PM
టాప్​టెన్​ న్యూస్​ @3pm
author img

By

Published : May 4, 2021, 2:59 PM IST

  • ఐపీఎల్-2021​ వాయిదా..

ఐపీఎల్‌పై కరోనా మహమ్మారి పడగ విసిరింది. పలు జట్ల ఆటగాళ్లు వైరస్‌ బారిన పడుతుండటం వల్ల బీసీసీఐ కీలకనిర్ణయం తీసుకుంది. ఈ సీజన్‌ను ఐపీఎల్‌ మ్యాచ్‌లను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్ల ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రాత్రికి రాత్రే సర్వే ఎలా?

రాత్రికి రాత్రే సర్వే ఎలా పూర్తయిందా... అధికారులు కారులో కూర్చుని నివేదిక రూపొందించినట్లుంది... ఆరోపణలు వస్తే ఎవరి ఇంట్లోకైనా వెళ్లి విచారణ చేయొచ్చా..? అని ఈటల కుటుంబం అత్యవసర పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మొదటి డోస్ వేసుకుంటే సరిపోదు..

కరోనా నిర్ధారణ అయిన వారు, వైరస్‌ బారిన పడి కోలుకున్నవారు, టీకా తీసుకోవాలనుకునేవారు, ఇప్పటికే తీసుకున్నవారు.. ఇలా ప్రతి ఒక్కరిలో ఏదో మూలన భయం.. ఆ భయం మాటున ఎన్నో సందేహాలు.. ఆ సందేహాలకు నిమ్స్‌ నెఫ్రాలజీ విభాగం వైద్యులు డా.శ్రీభూషణ్‌రాజు సమాధానాలు ఇచ్చారు ఇలా.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తెరాస ఓడిపోతే ఈటల సంతోషించే వారు..

మాజీ మంత్రి ఈటల వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్​ ఘాటుగానే స్పందించారు. ఎక్కడైనా తెరాస ఓడిపోతే ఈటల సంతోషించేవారని ఆరోపించారు. ఆయన్ని కేసీఆర్.. ఓ సోదరుడిలా భావించి ఆదరించారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అదే ఈటల ధ్యేయమా?..

మాజీ మంత్రి ఈటల వ్యాఖ్యలపై మంత్రి కొప్పుల ఈశ్వర్​ మండిపడ్డారు. ఆయన ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిందో అర్థం కావడం లేదని తెలంగాణ భవన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • గోవా మద్యం స్వాధీనం..

గోవా నుంచి అక్రమ మద్యాన్ని తరలిస్తున్న ఏడుగురిని ప్రకాశం జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. గతంలో గోవాలో పనిచేసిన ఓ వ్యక్తి.. అక్కడి నుంచి జిల్లాకు మద్యాన్ని తీసుకొచ్చి విక్రయిస్తున్నాడన్న సమాచారం మేరకు.. నిందితులను ఎస్​ఈబీ అధికారులు పట్టుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భారత్​కు అండగా ఐరాస..

భారత్​లో కరోనా పరిస్థితులను ఎదుర్కొనేందుకు.. ఐరాస బృందం ప్రభుత్వానికి సహాయం చేస్తున్నట్టు సంస్థ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​ ప్రతినిధి డుజెర్రిక్​ వెల్లడించారు. తప్పుడు సమాచారం వ్యాప్తిని అడ్డుకునేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బిహార్​లో మే 15 వరకు లాక్​డౌన్..

దేశంలో కొవిడ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్ననేపథ్యంలో బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 15 వరకు లాక్​డౌన్ విధిస్తున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆక్సిజన్ కొరతతో నలుగురు మృతి..

కర్ణాటక కలబురగి జిల్లా, అఫ్జల్​పుర్​ తాలుకా ఆస్పత్రిలో ఆక్సిజన్​ కొరత కారణంగా నలుగురు కొవిడ్​ రోగులు చనిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సోనూకు ప్రియాంక మద్దతు..

కొవిడ్​ కారణంగా తల్లిదండ్రులను పొగొట్టుకున్న చిన్నారులకు ఉచిత విద్యను అందిచాలని నటుడు సోనూసూద్​ ఇటీవలే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ విషయంలో సోనూకు తాను మద్దతు ఇస్తున్నట్లు కథానాయిక ప్రియాంకా చోప్రా వెల్లడించారు. సోనూను చూసి ఇలాంటి విషయాల్లో స్ఫూర్తి పొందుతున్నానని ఆమె చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.