ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 1PM - తెలంగాణ సమాచారం

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news in ts
టాప్ న్యూస్ @ 1PM
author img

By

Published : Mar 21, 2022, 1:04 PM IST

  • తెరాస సమావేశం ప్రారంభం

తెరాస శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చిస్తున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లపై చర్చ జరుగుతోంది.

  • అద్భుతఘట్టానికి అంకురార్పణ

Yadadri Temple News : అద్భుత కట్టడం.. దివ్యక్షేత్రం.. సుప్రసిద్ధ యాదాద్రి ఆలయ ఉద్ఘాటనకు అడుగు ముందుకు పడింది. మహోసంప్రోక్షణలో భాగంగా వారం రోజుల పాటు జరగనున్న యజ్ఞయాగాదులకు రుత్వికులు శ్రీకారం చుట్టారు. ఆగమశాస్త్రానుసారం పంచుకుండాత్మక మాహాయాగానికి అంకురార్పణ చేశారు. బాలాలయంలో అష్టోత్తర శతఘటాభిషేక మహారాజాభిషేకం నిర్వహిస్తున్నారు.

  • సాగర్‌ కాలువలో దూకిన ప్రేమజంట..

నల్గొండ జిల్లా హాలియా వద్ద ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. సాగర్‌ కాలువలోకి దూకి బలవన్మరణానికి యత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కాల్వలో దూకిన యువతీ యువకులను కాపాడేందుకు తాడును తీసుకువచ్చారు. తాడు సాయంతో యువతిని కాపాడారు.

  • వారు బోధన్‌కు రావొద్దు

నిజామాబాద్ జిల్లా బోధన్​లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శివాజీ విగ్రహం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తగా పట్టణంలో 144 సెక్షన్ విధించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ సీపీ నాగరాజు హెచ్చరించారు.

  • ఆ వస్తువులను పరిశీలించిన మోదీ

PM Modi news: భారత్​కు చెందిన 29పురాతన వస్తువులను ఆస్ట్రేలియా తిరిగి ఇచ్చింది. ప్రధాని మోదీ స్వయంగా వాటిని పరిశీలించారు.

  • ఎంపీ ఇంట్లో దొంగతనం- వీఐపీలంతా ఆ కాలనీలోనే..

Thieves in bjp mp residence: సామాన్యుల ఇళ్లలో దొంగలు పడి దోచుకోవడం సాధారణమే. అయితే పటిష్టమైన భద్రత మధ్య ఉన్న ఓ రాజ్యసభ ఎంపీ ఇంట్లో తమ చేతి వాటాన్ని ప్రదర్శించారు దొంగలు. అందినకాడికి ఎత్తుకెళ్లారు.

  • ఎనిమిదేళ్ల బాలికపై హత్యాచారం

Minor girl raped, murdered: ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు కొందరు దుండగులు. ఈ ఘటన బిహార్​లోని బంకాలో జరిగింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

  • పెరిగిన బంగారం ధర..

Gold Rate today: బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ. 37 పెరిగింది.

  • వారి కోసం గ్రౌండ్​లోనే ఏర్పాట్లు

Mumbai Indians on IPL Biosecure: తమ ఆటగాళ్ల భద్రత కోసం ప్రత్యేకంగా అవుట్‌డోర్‌ 'బయో సెక్యూర్‌'ను ఏర్పాటు చేసింది ముంబయి ఇండియన్స్‌. బీసీసీఐ 'బయో సెక్యూర్‌ బబుల్‌'లో భాగంగానే 'ఎంఐ ఎరేనా' ఏర్పాటు చేసినట్లు ముంబయి ఫ్రాంచైజీ వెల్లడించింది.

  • 'ఆర్​ఆర్​ఆర్​'కు రూ.3వేల కోట్లు పక్కా!

RRR Movie: ఆర్​ఆర్​ఆర్​ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు సినీ విశ్లేషకులు. కచ్చితంగా రూ.మూడు వేల కోట్లకు పైగా వసూలు చేస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా చరిత్ర తిరగరాయబోతుందని చెబుతున్నారు. మరి భారీ వసూళ్లను అందుకోవడానికి కలిసొచ్చే అంశాలేంటి? సినిమా ప్రత్యేకతలేంటి? లాంటి విషయాలను ఓ సారి తెలుసుకుందాం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.