ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today : టాప్​న్యూస్ @ 11AM
Telangana News Today : టాప్​న్యూస్ @ 11AM
author img

By

Published : Sep 22, 2022, 11:00 AM IST

Updated : Sep 22, 2022, 11:10 AM IST

  • దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

Corona Cases in India : భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా నమోదయ్యాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 5,443 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 5,291 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

  • 'ఆపరేషన్ గోవా' సక్సెస్.. డ్రగ్స్​ కీలక సూత్రధారి అరెస్ట్

drug smuggler arrested: యువతను మత్తులో ముంచుతూ, దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలకు డ్రగ్స్​ సరఫరా చేస్తూ, ఎవరికీ పట్టుబడకుండా తిరుగుతూ ఉన్న మాదకద్రవ్యాల సరఫరాదారుడు డిసౌజా అరెస్ట్​ అయ్యాడు. దీంతో మాదకద్రవ్యాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గోవాలో హైదరాబాద్ నార్కోటిక్ పోలీసుల నిర్వహించిన ఆపరేషన్ విజయవంతమైంది. డ్రగ్స్​ సరఫరా చేస్తున్న కీలక సూత్రధారులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

  • ఆర్​ఎంసీ కమిటీ సమావేశం మరోసారి వాయిదా..?

RMC COMMITTEE MEETING: గత కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తోన్న ఆర్​ఎంసీ కమిటీ సమావేశం మళ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. ఈ నెల 28న కృష్ణా జలవివాదాల ట్రైబ్యునల్​ విచారణ జరుగనుండడంతో ఈ సమావేశంపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి.

  • మాకో వంతెన కావాలి మహా ప్రభో.. మరీ ఇంత ఘోరమా?

Katakshpur bridge problems in warngal: ఈ జాతీయ రహదారిపై ఉన్న వంతెన నుంచి వెళ్లాలంటే నిత్యం నరకంగా మారుతోంది. వర్షాలు పడినప్పుడు అయితే మరీ ఘోరం. పేరుకు జాతీయ రహదారి కాని గ్రామాల్లో ఉండే సీసీ రోడ్లు దగ్గర వేసే బ్రిడ్జ్​ల కన్నా దారుణం. వాహనదారుల ప్రాణాలను తీస్తోందీ ఈ వంతెన. గుత్తేదారుల నిర్లక్ష్యంతో ఇంకా పనులు కాలేదు.. ఇంతకీ ఆ వంతెన ఎక్కడ ఉందో అనుకుంటున్నారా..?

  • పీఎఫ్‌ఐ కేసులో హైదరాబాద్​, కరీంనగర్​లో మరోసారి ఎన్ఐఏ సోదాలు

NIA Searches in PFI case In Hyderabad: పీఎఫ్‌ఐ కేసులో ఎన్​ఐఏ మరోసారి రాష్ట్రంలో సోదాలు చేస్తోంది. చాంద్రాయణగుట్టలోని పీఎఫ్ఐ కార్యాలయంతో పాటు ఎల్బీనగర్, ఆటోనగర్‌లోని ఓ ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. చాంద్రాయణగుట్టలోని పీఎఫ్​ఐ కార్యాలయాన్ని సీజ్ చేశారు.

  • Fingerprint Surgery Case: 'కొత్త గుర్తింపుతో మళ్లీ కువైట్‌కు.. త్వరలో భారత్‌కు రప్పిస్తాం'

Fingerprint Surgery gand arrest: విదేశాలకు వెళ్లేందుకు వీలుగా వేలిముద్రల్ని మార్చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గతంలో నలుగురు నిందితుల్ని అరెస్టు చేయగా.. ఇప్పటివరకు 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కువైట్‌కు వెళ్లిన వారిని భారత్‌కు రప్పిస్తామని వెల్లడించారు.

  • బాలికపై గ్యాంగ్​ రేప్.. నగ్నంగా నడుచుకుంటూ ఇంటికి.. 20 రోజులకు...

15 ఏళ్ల బాలిక పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారు ఐదుగురు కామాంధులు. ఆమెను వివస్త్రను చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​ మొరాదాబాద్​లో సెప్టెంబర్ 1న జరిగిందీ దురాణం. ఆమె నగ్నంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న వీడియోను ఓ మహిళ సోషల్​ మీడియాలో పోస్ట్ చేయగా.. అనేక రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

  • తెలుగు రాష్ట్రాల కుబేరులు వీళ్లే.. దివీస్ అధినేత మురళిదే అగ్రస్థానం

Richest Persons In Telugu States :తెలుగు రాష్ట్రాల్లో రూ.1,000 కోట్లకు మించిన ఆస్తి గల కుబేరులు 78 మంది ఉన్నట్లు ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ తేల్చింది. వీరి మొత్తం సంపద విలువ రూ.3.90 లక్షల కోట్లకు పైగా ఉన్నట్లు స్పష్టం చేసింది. దాదాపు రూ.56,200 కోట్ల ఆస్తులతో దివీస్ లేబొరేటరీస్ అధినేత మురళి కె.దివి అగ్రస్థానంలో ఉన్నారు.

  • టీమ్ ఇండియాలో ​కీలక మార్పులు.. ఆ ముగ్గురు ఇన్​.. వీళ్లు ఔట్​!

India Vs Australia : సెప్టెంబర్ 20న ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్​లో భారత్​ ఓటమి పాలైంది. భారత్‌ 208 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఆసీస్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో రెెండో మ్యాచ్​లో గెలిచి పోటీలో ఉండాలని ప్రణాళికలు రచిస్తోంది టీమ్ ఇండియా.

  • 'లైగర్'​ ఓటీటీ మే ఆ గయా... వెండితెరపై 'ది ఘోస్ట్​'

ఇటీవలే విడుదలైన 'లైగర్'​ ఇప్పుడు ఓటీటీలో రానుంది. మరోవైపు నాగార్జున్ హీరోగా తెరకెక్కిన 'ది ఘోస్ట్'​ సిద్ధమైంది. గోదావరి అందాలను చూపించేందుకు మీ ముందుకు వస్తానంటున్నాడు హీరో కార్తికేయ.. ఈ అప్​కమింగ్​ మూవీ అప్డేట్స్​ ఓ సారి చూసేద్దామా.

Last Updated : Sep 22, 2022, 11:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.