ETV Bharat / city

Top news : టాప్​ న్యూస్@ 9PM - టాప్​ న్యూస్@ 9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA
author img

By

Published : Mar 2, 2022, 9:00 PM IST

  • మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర..

minister Srinivas goud : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర జరిగినట్లు సైబరాబాద్​ పోలీసులు వెల్లడించారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఆయన సోదరుడు శ్రీకాంత్‌ హత్యకు సుపారీ గ్యాంగ్​తో కుట్రపన్నినట్లు తెలిపారు. అయితే మంత్రి హత్య కుట్రను భగ్నం చేసి.. నలుగురిని అరెస్ట్​ చేసినట్లు చెప్పారు.

  • తెరాస శ్రేణుల ట్వీట్లు ట్రెండింగ్​..

Twitter Trending: తెరాస శ్రేణుల ట్వీట్లు మరోసారి ట్రెండింగ్​లో నిలిచాయి. రాష్ట్ర ఆర్థిక వృద్ధి రికార్డు స్థాయిలో నమోదైన సందర్భంగా తెరాస శ్రేణులు.. థాంక్యూ కేసీఆర్​తో పాటు ట్రయంప్​ తెలంగాణ హాష్​ ట్యాగ్​లతో భారీ సంఖ్యలో ట్వీట్లు చేయగా ట్విటర్​​లో ట్రెండింగ్​గా నిలిచాయి.

  • కేసీఆర్​ మూలాలు బిహార్​లో ఉన్నాయ్​..

Revanth reddy on KCR: ముఖ్యమంత్రి కేసీఆర్.. బిహార్ ఐఏఎస్‌లను రక్షణ వలయంగా ఏర్పాటు చేసుకుని పరిపాలన చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి విమర్శించారు. పరిపాలనలో వారి తప్పుడు పనులతో రాష్ట్ర ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

  • క్లాస్​రూంలో క్రికెట్​.. ఒకరు మృతి..

Student Died in school: తరగతి గదిలో విద్యార్థులు సరదాగా ఆడిన పేపర్​ బాల్​ క్రికెట్​.. ఒకరిని పొట్టనబెట్టుకుంది. నలుగురు విద్యార్థులు ఆడిన ఈ ఆటలో.. చిన్న విషయంలో వివాదం తలెత్తి ఒకరినొకరు కొట్టుకునే వరకు చేరింది. ఈ దాడిలో ఓ విద్యార్థి ఏకంగా ప్రాణాలే కోల్పోయారు.

  • యుద్ధంపై పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్..

Pawan kalyan tweet: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. శాంతి, యుద్ధంపై తనదైన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు.

  • భారతీయుల తరలింపునకు ఏ అవకాశాన్నీ వదల్లేదు..

Ukraine crisis: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ విడిచిపెట్టడం లేదని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మార్చి 7న యూపీలో చివరి విడత ఎన్నికలు జరగనున్న సోన్​భద్ర జిల్లాలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు.

  • ఇక పూర్వాంచల్ సమరం.. మిత్రపక్షాల సత్తాకు పరీక్ష..

UP assembly Election sixth phase: ఉత్తర్​ప్రదేశ్​లో 292 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు ముగిశాయి... యూపీ సమరం పూర్వాంచల్ వైపు మళ్లింది... భాజపా, ఎస్పీ పార్టీలు తమ మిత్రపక్షాలపై ఆశలు పెట్టుకుంటుండగా... 111 సీట్లకు నెలవైన పూర్వాంచల్​లో ఎవరు పట్టు సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో 57 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది.

  • ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మృతి..

Russia Ukraine war: ఉక్రెయిన్‌లో రష్యా జరుపుతోన్న బాంబు దాడుల్లో కర్ణాటకకు చెందిన విద్యార్థి మృతిచెందిన ఘటన మరవకముందే మరో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. భారత్‌కు చెందిన మరో విద్యార్థి అనారోగ్యంతో ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోయినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

  • ఐపీఎల్​లో 25% ప్రేక్షకులకు అనుమతి..

IPL 2022: ఐపీఎల్​ నిర్వహణపై బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వంతో బీసీసీఐ చర్చించింది. మొదటి దశకు 25 శాతం ప్రేక్షకులను అనుమతిచ్చింది. మరోవైపు ఐపీఎల్ జట్లన్నీ మార్చ 8లోపు ముంబయి చేరుకుంటాయి. 14నుంచి సాధన ప్రారంభిస్తాయి.

  • రాధేశ్యామ్​ రిలీజ్​ ట్రైలర్​ అదుర్స్​..

Radhe shyam release date: పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్​' చిత్రం నుంచి రెండో ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో పెళ్లి ఎందుకు కాలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో బదులిచ్చారు ప్రభాస్​.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.