ETV Bharat / city

Top news:టాప్ న్యూస్ @ 9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top news in telangana
Top news in telangana
author img

By

Published : Feb 26, 2022, 9:02 PM IST

  • ముంబయి చేరిన ఎయిరిండియా విమానం

ఉక్రెయిన్​లో చిక్కుకున్న 219 మందిని రొమేనియాలోని బుచారెస్ట్​ నుంచి తీసుకొస్తున్న ఎయిరిండియా విమానం.. ముంబయికి చేరింది. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో సాయంత్రం 7.50 గంటలకు ల్యాండైనట్లు అధికారులు తెలిపారు.

  • ప్రధానితో మాట్లాడిన ఉక్రెయిన్​ అధ్యక్షుడు.

Zelenskyy speaks with Modi: రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతున్న క్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడినట్లు ట్వీట్​ చేశారు ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో.. భారత్​ నుంచి రాజకీయ మద్దతు కోరినట్లు చెప్పారు. మరోవైపు.. రష్యా ప్రణాళికలను దెబ్బకొట్టామని, కీవ్​ తమ అధీనంలో ఉందని ఓ వీడియో ద్వారా వెల్లడించారు.

  • పోలింగ్​కు సర్వం సిద్ధం

UP polls 2022: ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 12 జిల్లాల పరిధిలోని 61 స్థానాలకు ఆదివారం ఓటింగ్‌ జరగనుంది. మొత్తం 692 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

  • 'ఆ రంగంలోకి భారీగా ప్రైవేట్ సంస్థలు రావాలి'

PM Modi: దేశంలోని విద్యార్థులు వైద్య విద్య కోసం చిన్న దేశాలకు వెళ్తున్నారని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు సంస్థలు ఈ రంగంలో భారీగా ప్రవేశించాలని, అందుకు అనువైన విధానాలను రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించాలని చెప్పారు.

  • ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

TSRTC Special Buses: మహాశివరాత్రి సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. రేపటి నుంచి మార్చి 4వ తారీఖు వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

  • కూలిన శిక్షణ విమానం... మహిళా పైలట్ మృతి

నల్గొండ జిల్లాలో శిక్షణ విమానం కూలి పైలట్​ దుర్మరణం చెందారు. తమిళనాడుకు చెందిన గజరాజ్ కుమార్తె మహిమ.. నాగార్జునసాగర్ సమీపంలోని విజయపురి సౌత్ ఏవియేషన్ అకాడమీలో పైలట్​గా శిక్షణ పొందుతున్నారు.

  • సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ బౌలింగ్​..!

CJI NV Ramana: సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ.. బార్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలోని క్రికెట్​ టోర్నీని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బార్​ అధ్యక్షుడికి బౌలింగ్​ వేశారు. మేధో సంపత్తి హక్కులకు సంబంధించిన వివాదాల పరిష్కారంపై నిర్వహించిన సెమినార్​లో కూడా జస్టిస్​ రమణ పాల్గొన్నారు.

  • కంగనా రనౌత్​కు హైదరాబాద్ కోర్టు షాక్..

Stay Order on Lock Upp show: బాలీవుడ్​ నటి కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'లాక్ అప్' షో.. రేపు ఓటీటీలో విడుదల కానుంది. విడుదలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా.. షో నిర్వాహకులకు హైదరాబాద్​ సిటీ సివిల్​ కోర్టు షాకిచ్చింది. లాక్​ అప్​ షోపై స్టే విధిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సనోబర్ బైగ్ వేసిన పిటిషన్​ను విచారించిన కోర్టు.. ఈ నిర్ణయం తీసుకుంది.

  • కలెక్షన్లలో 'భీమ్లా నాయక్' హవా

Bheemla nayak first day collections: థియేటర్లలో 'భీమ్లా నాయక్' అదరగొడుతోంది. కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది! ఇంతకీ తొలిరోజు ఎంత వసూలు చేసిందంటే?

  • టీమ్​ఇండియా లక్ష్యం 184

IND VS SL: ధర్మశాలలో జరుగుతున్న రెండో టీ20లో భారత్​కు 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది శ్రీలంక. నిస్సాంక, షనక అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.