ETV Bharat / city

Top news: టాప్​ న్యూస్​ @ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top news in Telangana
టాప్​ న్యూస్​ @ 5PM
author img

By

Published : Jan 15, 2022, 4:56 PM IST

  • మస్క్‌కు కేటీఆర్‌ ట్వీట్‌

KTR Tweet to Elon Musk: భారత్‌ మార్కెట్‌లోకి టెస్లా విద్యుత్‌ కార్లు తెచ్చేందుకు సవాళ్లున్నాయన్న కంపెనీ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్‌ స్పందించారు. సవాళ్లను పరిష్కరించేందుకు టెస్లాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. రాష్ట్రంలో తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని కోరారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా బదులిచ్చారు.

  • పోలీసు శాఖలో వైరస్​ వ్యాప్తి..

Corona cases in police Department: పోలీస్ శాఖలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హోంగార్డు నుంచి ఐపీఎస్​ల వరకు క్రమంగా వైరస్ బారిన పడుతున్నారు. గత రెండు దశలతో పోలిస్తే.. ఈసారి కొవిడ్ ప్రభావం పోలీసుల పైన ఎక్కువగానే ఉంది.

  • 'టీచర్లను విడుదల చేయండి'

Bandi sanjay on GO 317: జీవో 317ను సవరించాలంటూ ప్రగతిభవన్​ వద్ద ఆందోళన చేపట్టిన టీచర్లను వెంటనే విడుదల చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. లేకుంటే భాజపా తరఫున ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

  • భాగ్యనగరంలో పతంగుల పండుగ

Kite Festival in Hyderabad: భాగ్యనగరంలో పతంగుల పండుగను చిన్నాపెద్ద కలిసి సందడిగా చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో చిన్నారులు తల్లిదండ్రులతో కలిసి ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేస్తున్నారు. వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

  • సోనూ​ సోదరికి టికెట్​

Punjab Election 2022: పంజాబ్​ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్​ విడుదల చేసింది. ఇందులో ప్రముఖ నటుడు సోనూసూద్​ సోదరి మాళవికా సూద్​కు చోటు దక్కింది.

  • 'అమెరికా వెళ్లినా.. బైడెన్​లా చేయరట!'

Kerala CM US visit: అమెరికా వెళ్లినా.. ముఖ్యమంత్రి బాధ్యతలను తానే నిర్వర్తిస్తానని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. వేరే వ్యక్తికి పాలనాపగ్గాలు అప్పగించేది లేదని స్పష్టం చేశారు.

  • సినిమా ఛాన్స్ పేరుతో లైంగిక దాడి!

Film maker sexual assault: సినిమాలో ఛాన్స్ ఇస్తానని ఆశ చూపి.. ఓ బాలికను లైంగికంగా వేధించాడు ఓ ఫిల్మ్ మేకర్. నిందితుడిని ముంబయి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మరోవైపు, ఒడిశాలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది.

  • డ్రైవర్​కు ఫిట్స్​.. కాపాడిన మహిళ ​!

Woman Drives Bus: పర్యటకులతో ప్రయాణిస్తున్న ఆ మినీ బస్సు హఠాత్తుగా నడిరోడ్డుపై ఆగిపోయింది. డ్రైవర్​ సొమ్మసిల్లి పడిపోయాడు. పిల్లలు ఏడవడం ప్రారంభించారు. అప్పుడే ఓ మహిళ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

  • సచిన్​కు షాక్- రూ. 410 కోట్ల ఆస్తుల జప్తు!

SRA fraud case: మనీలాండరింగ్​ కేసులో ఓంకార్ గ్రూప్, యాక్టర్ సచిన్​ జోషికి(వైకింగ్​​ గ్రూప్​) చెందిన రూ.410 కోట్ల ఆస్తులను ఈడీ(ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​) జప్తు చేసింది.

  • సీఎస్కే సారథిగా జడ్డు..!

Ravindra Jadeja CSK: ఈ సారి ఐపీఎల్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ సారథిగా రవీంద్ర జడేజా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ఇప్పటికే పలువురు మాజీలు కూడా ధోనీ తర్వాత సీఎస్కే కెప్టెన్​ అయ్యే అర్హత జడేజాకే ఉందని అభిప్రాయపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.