ETV Bharat / city

Telangana Top News: టాప్​న్యూస్ @9PM - తెలంగాణ టాప్​న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9PM TOPNEWS
9PM TOPNEWS
author img

By

Published : Aug 7, 2022, 8:59 PM IST

  • తెలంగాణ అమ్మాయి నిఖత్​ జరీన్​కు గోల్డ్..

తెలంగాణ అమ్మాయి, ప్రపంచ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్.. కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించింది. 48-50 కేజీల (లైట్‌ ఫ్లై) విభాగంలో నార్తరన్‌ ఐర్లాండ్‌కు చెందిన కార్లే మెక్‌న్యూయ్‌పై అద్భుత విజయం సాధించి పసిడి పతకం నెగ్గింది.

  • నిఖత్ జరీన్​కు కేసీఆర్ అభినందనలు..

కామన్వెల్త్‌ క్రీడల్లో నిఖత్ జరీన్ పసిడి పంచ్​కు ప్రశంసల వర్షం కురుస్తోంది. పతకం గెలవగానే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర కీర్తి మరోసారి విశ్వవాప్తం చేశావని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు..!

మధ్య బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడింది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతవారణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో రానున్న రెండ్రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

  • 'నీతిఆయోగ్ తన రాజకీయ రంగును బయటపెట్టుకుంది..'

నీతిఆయోగ్​పై సీఎం కేసీఆర్​ చేసిన ఆరోపణలకు బదులుగా ఆ సంస్థ విడుదల చేసిన నోట్​పై మంత్రి హరీశ్​రావు తీవ్రంగా స్పందించారు. నీతిఆయోగ్​.. రాజకీయరంగు పులుముకుందని.. అంకెలగారడీ చేస్తూ.. వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.

  • 'నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించడం తెలంగాణకు మంచిది కాదు'

నీతి ఆయోగ్‌పై నిన్న సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. సీఎం కేసీర్​ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన కిషన్​రెడ్డి.. నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించడం తెలంగాణకు మంచిది కాదని వ్యాఖ్యానించారు.

  • ప్రపంచానికే భారత్​ దిక్సూచి.. ముందు వాటిపై దృష్టి పెట్టండి: మోదీ

నీతి ఆయోగ్​ పాలక మండలి సమావేశంలో అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. పంటల్లో వైవిధ్యం కనబరచాలని, నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. 2047 లక్ష్యాల గురించి వివరించారు.

  • 'చేనేతపై మాటలు కాదు శ్రద్ధ ఉంటే వెంటనే జీఎస్టీ ఎత్తేయండి..'

కొన ఊపిరితో ఉన్న చేనేత రంగానికి... జీఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వం మరణశాసనం రాస్తోందని... మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత రంగంపై పన్నులను వెంటనే రద్దు చేయాలని... చేతులు జోడించి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

  • 'ఆకాశ ఎయిర్' సేవలు షురూ..

దేశంలో కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ఆదివారం జెండా ఊపి సర్వీసుల్ని ప్రారంభించారు. తొలి విమానం ముంబయి నుంచి అహ్మదాబాద్​ వెళ్లింది.

  • మక్కా క్లాక్​ టవర్​పై పిడుగు..

సౌదీ అరేబియా మక్కాలోని ప్రఖ్యాత క్లాక్ టవర్​పై పిడుగు పడిన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఓ రోజు సాయంత్రం వర్షం కురుస్తుండగా బుర్జ్​ అల్​ సా గడియార స్తంభంపై భారీ పిడుగు పడి.. నగరమంతా ఒక్కసారిగా మెరిసిపోయిన వీడియోను ట్విట్టర్​లో ఇప్పటికే దాదాపు 15 లక్షల మంది వీక్షించారు.

  • నందమూరి హీరోల జోష్..

జీవితంలో మనం అనుకున్నట్లు అన్నీ జరగవు. కానీ పలు సందర్భాల్లో మాత్రం యాధృచ్ఛికంగా కొన్ని సంఘటనలు జరిగిపోతుంటాయి. అవి జరిగినప్పుడు ఆశ్చర్యపోక తప్పదు. ఇప్పుడు నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్​, కల్యాణ్​రామ్​ విషయంలోనూ అదే జరిగింది. ప్రస్తుతం అది చర్చనీయాంశమైంది. అదేంటంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.