ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 7AM - తెలంగాణ సమాచారం

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news in Telangana today
top news in Telangana today
author img

By

Published : Jun 2, 2022, 6:59 AM IST

  • ఎనిమిది వసంతాల తెలంగాణ

ఎనిమిదేళ్ల ప్రాయాన్ని పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్రం.. అవతరణ ఉత్సవాలకు ముస్తాబైంది. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో ఈ మారు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అమరులకు అంజలి ఘటించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు నిర్వహించనున్నారు. సాయంత్రం కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరపనున్నారు.

  • తెలంగాణ ప్రజలకు గవర్నర్, సీఎం శుభాకాంక్షలు

Telangana Formation Day: గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఉత్సాహంతో, గర్వంతో చేసుకునే వేడుకగా అభివర్ణించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి నివాళులర్పించారు.

  • 'పాతికేళ్ల ప్రగతి ఎనిమిదేళ్లలోనే..'

నూతన తెలంగాణ రాష్ట్ర ప్రస్థానం అద్వితీయంగా, ఆదర్శంగా బంగారు లక్ష్యం దిశగా సాగుతోందని.. ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో ఫలవంతులమయ్యామని పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు

  • రాష్ట్రంలో నూతన జ్యుడీషియల్ జిల్లాల వ్యవస్థ నేడే ప్రారంభం

రాష్ట్రంలో నూతన జ్యుడీషియల్ జిల్లాల వ్యవస్థ నేడు ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు పాత పది జిల్లాల పరిధిలోనే రాష్ట్ర న్యాయవ్యవస్థ పనిచేస్తోంది. కొత్తగా ఏర్పడిన 33 రెవెన్యూ జిల్లాలకు అనుగుణంగా కోర్టులను విభజించారు. హైదరాబాద్ కాకుండా 32 కొత్త జ్యుడీషియల్ జిల్లాలను నేడు సాయంత్రం 5 గంటలకు హైకోర్టు ఆవరణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్​గా ప్రారంభించనున్నారు.

  • '20 ఏళ్లలో ప్రధాని​'.. కేటీఆర్​ ఆసక్తికర కామెంట్​

రాబోయే ఇరవయ్యేళ్లలో మంత్రి కేటీఆర్‌ భారతదేశానికి ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఇటీవల అమెరికాలోని ప్రముఖ వెంచర్‌ క్యాపిటలిస్టు, మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్​ స్పందించారు.

  • గంటను కొట్టే గుడి కాదండీ!

దేవభూమి ఉత్తరాఖండ్​లో ఓ వింతైన దేవాలయం ఉంది. ఇక్కడ భక్తులు తమ కోరికలను స్టాంప్​ పేపర్​పై రాసి కడతారు. ​ఆ కోరికలు తీరితే గంటను కట్టడం ఇక్కడి సంప్రదాయం. ఆ గుడి విశేషాలు ఏంటో మీరు చూడండి!

  • భార్య ముక్కు కొరికిన భర్త

husband bite his wife nose: ఓ భర్త తన భార్య పై దాడి చేసి.. ఏకంగా ఆమె ముక్కును కొరికాడు. భార్యతో గొడవపడి ఆగ్రహంతో ఈ చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ బహ్రైచ్​లో జరిగింది.

  • ఆసుపత్రిలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి!

అమెరికాలోని ఓక్లహోమాలో తుపాకుల మోత మోగింది. ఆసుపత్రి క్యాంపస్​లోని మెడికల్​ బిల్డింగ్​లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు కూడా చనిపోయాడు.

  • సర్కారు వారి పాటకు కొత్త సాంగ్

SARKARU VAARI PAATA MURARI VAA: సర్కారు వారి పాట సినిమాలో మరో సాంగ్​ను జోడించినట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు, మేజర్ సినిమాలోని జనగణమన వీడియో సాంగ్ రిలీజ్ టైమ్​ను మేకర్స్ వెల్లడించారు.

  • ధోనీ వల్ల రిటైరవ్వాలనుకున్నా..కానీ

Dhoni Sehwag: 2008లో మహేంద్ర సింగ్​ ధోనీ తనను జట్టు నుంచి తప్పించినప్పుడు వన్డేల నుంచి రిటైరవ్వాలని భావించినట్లు తెలిపాడు టీమ్​ఇండియా మాజీ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్. అయితే ఆ నిర్ణయం తీసుకోకుండా సచిన్​ తనను ఆపినట్లు వివరించాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.