ETV Bharat / city

Top news: టాప్​టెన్​ న్యూస్​ @ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు @ 3PM

TOP TEN NEWS @ 3PM
ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
author img

By

Published : Jan 4, 2022, 3:02 PM IST

Covid Third wave: దేశంలో థర్డ్‌వేవ్‌ వచ్చేసిందా? త్వరలోనే అది గరిష్ఠానికి చేరుకోనుందా? అవుననే అంటున్నారు నిపుణులు. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న కొవిడ్‌ కేసుల తీరు మూడోదశ ముప్పుకు సంకేతమని పేర్కొన్నారు. అయితే భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఒమిక్రాన్‌ తొలుత వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలో కేసులు రెండు వారాల్లో దిగివచ్చిన సంగతిని గుర్తు చేశారు.

  • దిల్లీలో మళ్లీ లాక్​డౌన్​ తప్పదా?

Delhi weekend curfew: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. ఒమిక్రాన్ ఉద్ధృతితో చాలా రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వైరస్​ను కట్టడి చేసేందుకు వీకెండ్​ కర్ఫ్యూ విధించింది దిల్లీ ప్రభుత్వం. పంజాబ్​​ కూడా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. రోజువారీ కేసులు 20వేలు దాటితే లాక్​డౌన్ తప్పదని ముంబయి మేయర్ స్పష్టం చేశారు.

  • నడ్డా ర్యాలీకి అనుమతి నిరాకరణ

No Permission to JP Nadda rally: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌లో తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌కు నిరసనగా.. కొవ్వొత్తుల ర్యాలీ జరపాలని భాజపా నిర్ణయించింది.

  • ' రాష్ట్రంలో యుద్ధం మొదలైంది'

BJP Mouna Deeksha in Hyderabad : భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అరెస్టుకు నిరసనగా భాజపా నేతలు మౌన దీక్ష చేపట్టారు. హైదరాబాద్​లోని నాంపల్లి భాజపా రాష్ట్ర కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. భాజపా నేతలు లక్ష్మణ్, విజయశాంతి.. తెరాస తీరుపై నిప్పులు చెరిగారు.

  • ఆ మహిళపై దుండగుల కాల్పులు

Woman shot by criminals: కొన్ని రోజుల క్రితం.. ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీకి నల్లజెండా చూపించి ఓ మహిళ నిరసన తెలిపింది. తాజాగా.. ఆ మహిళపై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆమె కాలికి గాయమైంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

  • 'మహిళల వేలం' కేసులో​​ విద్యార్థి అరెస్ట్

Bulli bai controversy: సామాజిక మాధ్యమాలను ఆసరాగా చేసుకుని వికృత చేష్టలకు పాల్పడుతున్న బుల్లీ బాయ్​ యాప్​ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో ఓ 21ఏళ్ల ఇంజినీరింగ్​ విద్యార్థిని అరెస్టు చేశారు.

  • టాప్-100 గ్లోబల్​ సాంగ్స్​లో 'పుష్ప'

Pushpa songs record: అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా మరో రికార్డును సాధించింది. ఈ మూవీలోని అన్ని పాటలు యూట్యూబ్​ విడుదల చేసిన టాప్-100 గ్లోబల్​ సాంగ్స్​ లిస్టులో చోటు దక్కించుకున్నాయి.

  • లెజెండ్స్ లీగ్​లో భారత జట్టిదే

Legends League Cricket: ప్రపంచవ్యాప్తంగా రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లతో లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీని నిర్వహించబోతున్నారు. ఈ టోర్నీ ఈ నెల 20న ప్రారంభంకానుంది. ఇందులో భారత ఆటగాళ్లు 'ఇండియా మహారాజ' టీమ్​లో ఆడనున్నారు. ఈ జట్టుతో పాటు ఆసియా లయన్స్, రెస్టాఫ్ ద వరల్డ్ జట్లు పోటీపడనున్నాయి. తాజాగా ఈ జట్ల తరఫున ఆడబోయే ఆటగాళ్ల వివరాలను ప్రకటించారు.

  • 'జనం భయపడుతుంటే..ఎగ్జిబిషన్ కావాలా?'

నుమాయిష్‌ నిలిపివేయడం సమంజసం కాదన్న ఎగ్జిబిషన్ సొసైటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. థియేటర్లు, మాల్స్‌కు లేని ఆంక్షలు.. ఎగ్జిబిషన్‌కు ఎలా విధిస్తారని సొసైటీ తెలిపింది. బయటకు రావడానికే జనం భయపడుతుంటే..ఎగ్జిబిషన్ కావాలా అని రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

  • పాఠశాలకు వెళ్తుండగా..!

వనపర్తి జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. పాఠశాలకు వెళ్తుండగా బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

  • ' మూడోదశకు సంకేతాలు'

Covid Third wave: దేశంలో థర్డ్‌వేవ్‌ వచ్చేసిందా? త్వరలోనే అది గరిష్ఠానికి చేరుకోనుందా? అవుననే అంటున్నారు నిపుణులు. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న కొవిడ్‌ కేసుల తీరు మూడోదశ ముప్పుకు సంకేతమని పేర్కొన్నారు. అయితే భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఒమిక్రాన్‌ తొలుత వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలో కేసులు రెండు వారాల్లో దిగివచ్చిన సంగతిని గుర్తు చేశారు.

  • దిల్లీలో మళ్లీ లాక్​డౌన్​ తప్పదా?

Delhi weekend curfew: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. ఒమిక్రాన్ ఉద్ధృతితో చాలా రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వైరస్​ను కట్టడి చేసేందుకు వీకెండ్​ కర్ఫ్యూ విధించింది దిల్లీ ప్రభుత్వం. పంజాబ్​​ కూడా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. రోజువారీ కేసులు 20వేలు దాటితే లాక్​డౌన్ తప్పదని ముంబయి మేయర్ స్పష్టం చేశారు.

  • నడ్డా ర్యాలీకి అనుమతి నిరాకరణ

No Permission to JP Nadda rally: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌లో తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌కు నిరసనగా.. కొవ్వొత్తుల ర్యాలీ జరపాలని భాజపా నిర్ణయించింది.

  • ' రాష్ట్రంలో యుద్ధం మొదలైంది'

BJP Mouna Deeksha in Hyderabad : భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అరెస్టుకు నిరసనగా భాజపా నేతలు మౌన దీక్ష చేపట్టారు. హైదరాబాద్​లోని నాంపల్లి భాజపా రాష్ట్ర కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. భాజపా నేతలు లక్ష్మణ్, విజయశాంతి.. తెరాస తీరుపై నిప్పులు చెరిగారు.

  • ఆ మహిళపై దుండగుల కాల్పులు

Woman shot by criminals: కొన్ని రోజుల క్రితం.. ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీకి నల్లజెండా చూపించి ఓ మహిళ నిరసన తెలిపింది. తాజాగా.. ఆ మహిళపై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆమె కాలికి గాయమైంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

  • 'మహిళల వేలం' కేసులో​​ విద్యార్థి అరెస్ట్

Bulli bai controversy: సామాజిక మాధ్యమాలను ఆసరాగా చేసుకుని వికృత చేష్టలకు పాల్పడుతున్న బుల్లీ బాయ్​ యాప్​ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో ఓ 21ఏళ్ల ఇంజినీరింగ్​ విద్యార్థిని అరెస్టు చేశారు.

  • టాప్-100 గ్లోబల్​ సాంగ్స్​లో 'పుష్ప'

Pushpa songs record: అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా మరో రికార్డును సాధించింది. ఈ మూవీలోని అన్ని పాటలు యూట్యూబ్​ విడుదల చేసిన టాప్-100 గ్లోబల్​ సాంగ్స్​ లిస్టులో చోటు దక్కించుకున్నాయి.

  • లెజెండ్స్ లీగ్​లో భారత జట్టిదే

Legends League Cricket: ప్రపంచవ్యాప్తంగా రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లతో లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీని నిర్వహించబోతున్నారు. ఈ టోర్నీ ఈ నెల 20న ప్రారంభంకానుంది. ఇందులో భారత ఆటగాళ్లు 'ఇండియా మహారాజ' టీమ్​లో ఆడనున్నారు. ఈ జట్టుతో పాటు ఆసియా లయన్స్, రెస్టాఫ్ ద వరల్డ్ జట్లు పోటీపడనున్నాయి. తాజాగా ఈ జట్ల తరఫున ఆడబోయే ఆటగాళ్ల వివరాలను ప్రకటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.