ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - తెలంగాణ వార్తలు

TOP NEWS HEADLINES OF THE HOUR
ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు
author img

By

Published : Aug 9, 2021, 5:59 AM IST

Updated : Aug 9, 2021, 9:50 PM IST

21:39 August 09

టాప్​ న్యూస్​ @10PM

టాప్​ న్యూస్​ @10PM 

  • నిరుద్యోగ దీక్ష

కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో రేపు వైఎస్​ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారం- నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలో ఆమె పాల్గొంటున్నారు.

  •  ప్రపంచంలోనే అతిపెద్ద చాముండేశ్వరి విగ్రహం

కర్ణాటకలో ప్రపంచంలోనే అతిపెద్ద చాముండేశ్వరి విగ్రహాన్ని సోమవారం స్థానికులు ప్రతిష్ఠించారు. 60 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని 5 రకాల లోహాలతో తయారు చేశారు.

  • ప్రపంచంలోనే అతిచిన్న పాప

నెలలు నిండకుండానే 25 వారాలకే 212 గ్రాముల బరువుతో పుట్టిన ఆ చిన్నారి 13 నెలల తర్వాత ఆరోగ్యంగా ఇంటికి చేరింది. కేవలం 24 సెంటీమీటర్ల పొడవు, ఒక యాపిల్​ బరువంత ఉన్న ఈ పాప ప్రాణం నిలపడం వైద్యులకు సవాలుగా మారినా.. ఎంతో శ్రమించి పాపను బతికించారు. చిన్నారి ఇంటికి చేరినప్పటికీ, ఇంకా వైద్యం కొనసాగించాల్సి ఉందని తెలిపారు.

  • పన్ను తప్పదా?

టోక్యో ఒలింపిక్స్​లో పతకాలు సాధించిన క్రీడాకారులకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు నజరానాలు ప్రకటించాయి. వీటితో పాటు కొంతమంది ప్రముఖులూ నగదు బహుమానాలను ప్రకటించారు. ఈ విధంగా కోట్ల రూపాయలు క్రీడాకారులు సొంతం చేసుకోగా.. అందులో వారు చెల్లించాల్సిన ట్యాక్స్​ ఎంత? వేటివేటికి మినహాయింపు ఉందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

  • యువనటి మృతి

ప్రముఖ యువనటి శరణ్య శశి (35) మృతిచెందారు. గత కొన్నేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్​తో బాధపడుతున్న ఆమె.. సోమవారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

20:46 August 09

టాప్​ న్యూస్​ @9PM

టాప్​ న్యూస్​ @9PM

  • ఆదేశాలు పట్టించుకోలేదు

జల విద్యుత్‌పై కేఆర్ఎంబీ ఆదేశాలను తెలంగాణ పట్టించుకోలేదని జల్‌ శక్తి శాఖ తెలిపింది. జల విద్యుత్‌ ఉత్పత్తి ఆపాలని కేఆర్ఎంబీ ఆదేశాలు ఇచ్చింది పేర్కొంది. కేఆర్‌ఎంబీ ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేసిందని చెప్పింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.  

  • 'మొక్క'వోని దీక్షతో.. 

 అతిపెద్ద మర్రివనాన్ని సృష్టించి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు రాజస్థాన్​ మహిళలు. మాండా భోప్​వాస్​ గ్రామంలో 500 మొక్కలను వారు నాటారు.

  • లింక్​ చేశారా?

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్​ఓ) చందాదారులకు కీలక సూచనలు జారీ చేసింది. ఆగస్టు 31 వరకు ఆధార్​ యూఏఎన్​ అనుసంధానం పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. లేదంటే.. కంపెనీలు పీఎఫ్​ జమ చేయడం, చందాదారులు పీఎఫ్​ విత్​ డ్రా చేసుకోవడం కుదరదని పేర్కొంది.

  • అదిరిపోయే స్వాగతం 

టోక్యో ఒలింపిక్స్​లో అత్యుత్తమ ప్రదర్శన అనంతరం భారత బృందం (indian olympic contingent) స్వదేశానికి చేరుకుంది. వీరికి దిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది.

  • 'మా' ఎన్నికలపై రంగంలోకి మెగాస్టార్​

'మా' క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ కృష్ణంరాజుకు మెగాస్టార్​ చిరంజీవి లేఖ రాశారు. 'మా' ఎన్నికలు జాప్యం లేకుండా వెంటనే జరగాలని సూచించారు.

19:43 August 09

టాప్​ న్యూస్​ @8PM

టాప్​ న్యూస్​ @8PM 

  • త్వరలోనే పరిష్కారం

అటవీ భూముల సర్వే చేపట్టడంతో పాటు త్వరలోనే పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం శుభాకాంక్షలు చెప్పారు. ప్రకృతిలో భాగమై నివసించే అడవి బిడ్డలు, అత్యంత స్వచ్ఛమైన మనుషులని.. మానవ సమాజంలో ఇంకా తరిగిపోని మమతానురాగాలు, స్వచ్ఛమైన, కల్మషం లేని మానవీయ సంబంధాలకు ఆదివాసీ బిడ్డలు ప్రతీకలని అన్నారు.

  • పనుల పురోగతిపై ఆరా

హైదరాబాద్ పాతబస్తీలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఆ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​కుమార్ తదితరులు పాల్గొన్నారు.

  • కౌన్సిలర్​ దారుణ హత్య 

ఏపీ నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వైకాపా కౌన్సిలర్‌ సురేశ్‌ హత్యకు గురయ్యారు. రైల్వేగేట్‌ వద్ద కారు పార్కింగ్‌ చేస్తుండగా కౌన్సిలర్‌ను దుండగులు నరికిచంపారు. 

  • భారత్​పై ఉగ్రకుట్ర 

పంజాబ్​ అమృత్​సర్​కు సమీపంలోని ఓ గ్రామంలో టిఫిన్ బాక్సు బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాగులో ఉన్న ఈ టిఫిన్ బాక్సులో 2-3 కిలోల బరువున్న ఆర్​డీఎక్స్​ లభ్యమైందని చెప్పారు. డ్రోన్​ ద్వారా పాకిస్థాన్​ నుంచి ఈ బ్యాగును జారవిడిచారని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • మరో బాహుబలి కాదు!

స్టార్ దర్శకుడు రాజమౌళి- సూపర్​స్టార్ మహేశ్​బాబు కాంబినేషన్​లో చిత్రం కోసం అటు అభిమానులే కాదు.. సగటు సినీ ప్రేక్షకుడు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్​పై మహేశ్​బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేంటో మీరూ చదివేయండి..

18:46 August 09

టాప్​ న్యూస్​ @7PM

టాప్​ న్యూస్​ @7PM 

  • 18న దళిత, గిరిజన రెండో సభ 

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన దళిత, గిరిజన దండోరా సభలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి.. తెరాస పాలనపై నిప్పులు చెరిగారు. ఈనెల 18న ఇబ్రహీంపట్నంలో దళిత, గిరిజన రెండో సభ నిర్వహించనున్నట్లు రేవంత్‌ స్పష్టం చేశారు. 

  • మోదీ 'పంచ సూత్రాలు'

ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో 'సముద్రాల భద్రత- అంతర్జాతీయ సహకారం'పై వర్చువల్​గా జరిగిన చర్చకు అధ్యక్షత వహించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా.. సముద్ర భద్రత కోసం 5 ప్రాథమిక సూత్రాలను ప్రతిపాదించారు. అంతర్జాతీయ వాణిజ్యానికి, భూమండల భవిష్యత్తుకు సముద్రాలు చాలా కీలకమైనవిగా పేర్కొన్నారు.

  • పెగసస్​పై పెదవి విప్పిన కేంద్రం 

పార్లమెంటును కుదిపేస్తున్న పెగసస్​ వ్యవహారంపై కేంద్రం మౌనం వీడింది. ఈ స్పైవేర్ తయారీ సంస్థ, ఎన్​ఎస్​ఓ గ్రూపుతో తాము ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదనని రాజ్యసభలో స్పష్టం చేసింది.

  • విశ్వక్రీడల్లో క్రికెట్​

ఒలింపిక్స్​లో క్రికెట్​ను చేర్చే అవకాశాలున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) (BCCI) స్పందించింది. విశ్వక్రీడల్లో భారత్​ పాల్గొంటుందా? లేదా? అనే విషయంపై బీసీసీఐ కార్యదర్శి (BCCI Secretary) జై షా స్పష్టత ఇచ్చారు.

  • 'నా బయోపిక్​లో ఆ హీరోనే నటించాలి'

ఒకవేళ తన బయోపిక్ తెరకెక్కిస్తే.. అందులో ఎవరు నటించాలని ఆశిస్తున్నాడో చెప్పాడు అథ్లెట్​ నీరజ్​ చోప్డా. ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణం సాధించి యావత్​ దేశ ప్రజల మన్నలను అందుకుంటున్నాడీ 23 ఏళ్ల కుర్రాడు.

17:51 August 09

టాప్​ న్యూస్​ @6PM

  • నీ కుట్రలు తెలుసు..

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్​పై తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ విమర్శలు చేశారు. అధికారిగా ఉన్నప్పుడు పొందిన ఆదరణ చూసి రాజకీయాల్లో ప్రజలు ఓట్లు వేస్తారనుకోవద్దని హితవు పలికారు.

  • సీజేఐ సంతాపం..

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు మృతి పట్ల సీజేఐ ఎన్వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. కేశవరావు కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జస్టిస్ కేశవరావు సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

  • 'జూ'లో కొట్టుకున్నారు..

ఓ జూలో ఇద్దరి మధ్య మొదలైన గొడవ.. చివరికి ఆరుగురు తీవ్రస్థాయిలో కొట్టుకునే వరకు దారితీసింది. మహిళలు ఒకరికొకరు జుట్లు పట్టుకుని నేల మీద ఈడ్చుకుంటూ కాళ్లతో కొట్టుక్కున్నారు. పురుషులు కూడా మహిళలను కాళ్లతో కొడుతూ ఫోన్లకు చిక్కారు. ఈ వీడియో వైరల్​గా మారింది.

  • పీవీ సింధు దావా!

మొమెంట్ మార్కెటింగ్... సోషల్​ మీడియా వచ్చాక బాగా ఆదరణ పొందుతున్న మార్కెటింగ్ స్ట్రాటజీ. క్రికెట్​ మ్యాచ్​లో గెలుపు, రాకెట్ ప్రయోగం విజయవంతం, ఎన్నికల ఫలితం.. ఇలా ఆరోజు వార్తల్లో హైలైట్​గా నిలిచిన అంశాన్ని ఇతివృత్తంగా చేసుకుని అప్పటికప్పుడు యాడ్స్​ రూపొందించడమే మొమెంట్ మార్కెటింగ్.
 
  • అప్డేట్​ వచ్చేసింది..

మహేష్​ బాబు-త్రివిక్రమ్(Mahesh Babu-Trivikram movie) దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన అప్డేట్​ను ఇచ్చింది చిత్రబృందం. కథానాయికతో పాటు, సాంకేతిక బృంద వివరాలను వెల్లడించింది.

16:49 August 09

టాప్​ న్యూస్​ @5PM

టాప్​ న్యూస్​ @5PM 

  • దళిత, గిరిజన దండోరా సభ

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహిస్తున్న దళిత, గిరిజన దండోరా సభకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. గుస్సాడి సంప్రదాయ రీతిలో నేతలకు కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. సభకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావడం వల్ల గుడిహత్నూర్‌ నుంచి ఇంద్రవెల్లి మార్గంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

  • పారదర్శకంగా అర్హుల ఎంపిక 

అర్హులందరికీ మూడు రోజుల్లోగా పింఛన్లు(PENSIONS) అందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(ERRABELLI DAYAKAR RAO) ఆదేశించారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అర్హులను గుర్తించాలని సూచించారు.

  • జైడస్​ టీకా రెడీ!

పిల్లల కోసం జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన కరోనా టీకా త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ వారంలో అత్యవసర వినియోగం కోసం నిపుణుల కమిటీ ఆమోదం తెలిపే అవకాశముంది.

  • సినీ హీరో ఔదార్యం 

గర్భిణీ దయనీయ పరిస్థితి చూసి చలించిపోయారు ఆ నటుడు. చికిత్సకు నోచుకోని పేదరికంలో కూరుకుపోయిన మహిళకు.. అంబులెన్సు ఏర్పాటు చేశారు. ఫలితంగా.. నలుగురు పండంటి బిడ్డలకు మహిళ జన్మనిచ్చింది. ఆ హీరోపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

  • నీరజ్​ అంటే భయం!

టోక్యో ఒలింపిక్స్​లో భారత్​కు ఏకైక స్వర్ణం అందించిన నీరజ్​ చోప్డాకు (Neeraj Chopra) సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు అథ్లెట్​ తేజస్విన్​ శంకర్ (Tejaswin Shankar)​. నీరజ్​ అంటే తనకు భయమని కూడా చెప్పాడు.

15:40 August 09

టాప్​ న్యూస్​ @4PM

టాప్​ న్యూస్​ @4PM 

  • రెండు రాష్ట్రాలు సహకరించాలి.. 

ఉమ్మడి సమావేశం వివరాలను కృష్ణా, గోదావరి బోర్డులు వెల్లడించాయి. తెలంగాణ సభ్యులు సమావేశానికి గెర్హాజరు కాగా... ఏపీ సూచించిన విషయాలను బోర్డులు ప్రకటించాయి. ఏపీ అవసరమైన సమాచారం త్వరలోనే ఇస్తామని ఈ సమావేశంలో తెలిపిందని కృష్ణా, గోదావరి బోర్డులు ప్రకటించాయి.  దీనితో పాటు అభ్యంతరాలు లేని ప్రాజెక్టుల వివరాలు ఏపీ నెలలో ఇస్తామని తెలిపిందని పేర్కొన్నాయి. గెజిట్ అమలుకు రెండు రాష్ట్రాలు సహకరించాలని కృష్ణా, గోదావరి బోర్డులు కోరాయి.  

  • ఏపీ సర్కార్​పై ఎన్జీటీ ఫైర్​

పర్యావరణ చట్టాన్ని ఏపీలో తీవ్రంగా ఉల్లంఘించడం సిగ్గుచేటని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ ఆదర్శకుమార్ నేతృత్వంలోని ఎన్జీటీ ప్రధాన ధర్మాసనం.. పర్యావరణ అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలవరం కాఫర్ డ్యాం వల్ల ముంపు జరుగుతుంటే ఏం చర్యలు తీసుకున్నారని అధికారుల్ని నిలదీసింది.

  • ఓబీసీ బిల్లుకు ప్రతిపక్షాల మద్దతు

రాష్ట్రాల స్థాయిలో వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెడుతూ కేంద్రం లోక్​సభలో ప్రవేశపెట్టిన 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు విపక్షాలు ఏకగ్రీవంగా ప్రకటించాయి. ఈ బిల్లు వచ్చినప్పుడు ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా చర్చలో పాల్గొంటామని వెల్లడించాయి.

  • స్టాక్​ మార్కెట్లకు లాభాలు 

స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex today) 125 పాయింట్ల లాభంతో 54,400 ఎగువన స్థిరపడింది. నిఫ్టీ (Nifty today) 20 పాయింట్ల లాభంతో 16,250 మార్క్​ దాటింది.

వెన్నుదన్నుగా ప్రభుత్వం 

నీరజ్​ చోప్డా.. ప్రస్తుతం దేశంలో మార్మోగిపోతున్న పేరు. ఒలింపిక్స్​ అథ్లెటిక్స్‌లో తొలి పతకం కోసం 120 ఏళ్లుగా నిరీక్షించిన భారత్​ కలను నెరవేర్చాడు చోప్డా. అయితే నీరజ్​.. ఈ ఘనత సాధించేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసుకుందామా..?

14:35 August 09

టాప్​ న్యూస్​ @3PM

టాప్​ న్యూస్​ @3PM 

  • ఉత్తమ విమానాశ్రయం

మధ్య ఆసియాలో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా శంషాబాద్​ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. ఈ అవార్డును వరుసగా మూడో ఏడాది కూడా దక్కించుకున్నట్లు జీఎంఆర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. 2021 స్కైట్రాక్స్ వరల్ట్ ఎయిర్ పోర్టు అవార్డుల కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకుంది.  

  • ఎట్టకేలకు మృతదేహం లభ్యం

హైదరాబాద్‌ నగరంలోని సాహెబ్‌నగర్‌లో గల్లంతైన పారిశుద్ధ్య కార్మికుడు అంతయ్య మృతదేహం లభ్యమైంది. డ్రైనేజీ పూడిక తీసేందుకు గత మంగళవారం రాత్రి శివ, అంతయ్య మ్యాన్‌హోల్‌లోకి దిగి గల్లంతైన విషయం తెలిసిందే. ఘటన జరిగిన ప్రాంతానికి 200 మీటర్ల దూరంలో 800ఎంఎం సివర్‌ ట్రంక్ పైపు లైన్‌లో అంతయ్య మృతదేహాన్ని గుర్తించారు. డ్రైనేజీలో పడిన ఇద్దరిలో శివ మృతదేహం ఇప్పటికే లభ్యమైంది.

  • అభివృద్ధి బాటలో జమ్ముకశ్మీర్

జమ్ముకశ్మీర్​లోని ఆ పట్టణాల్లో కొంతకాలం కిందటి వరకు తుపాకులు రాజ్యమేలాయి. ముష్కర దాడులు, ఎన్‌కౌంటర్‌ వార్తల్లో వాటి పేర్లు మార్మోగేవి. అయితే కొత్త పారిశ్రామిక విధానంతో పరిస్థితులు మారుతున్నాయి. పెట్టుబడులతో పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు. వాణిజ్యం, ప్రాజెక్టులు, టర్నోవర్‌లు అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

  • అమెజాన్, ఫ్లిప్​కార్ట్​కు షాక్

ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్​కార్ట్​లకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పోటీ చట్టాల ఉల్లంఘనపై సీసీఐ దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

  • పాటల రచయితపై ఫిర్యాదు

ప్రముఖ సినీ పాటల రచయిత అనంత్‌ శ్రీరామ్‌పై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు నమోదైంది. ఇటీవల 'వరుడు కావలెను' సినిమా కోసం ఆయన 'దిగు దిగు దిగు నాగ' పాట రాశారు. అయితే ఈ పాట హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.

13:54 August 09

టాప్​ న్యూస్ @2pm

  • దళిత బంధు నిధులు విడుదల

హుజూరాబాద్‌ నియోజకవర్గానికి దళిత బంధు నిధులు విడుదలయ్యాయి.  రూ.500 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల విడుదలతో నియోజకవర్గంలోని ఎస్సీలు సంబురాలు చేసుకుంటున్నారు. తమ ప్రగతి కోసం ఇలాంటి అద్భుత పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. 

  • రైతుల ఖాతాల్లోకి రూ.19,500 కోట్లు

రైతులకు ప్రతి ఏటా అందించే పెట్టుబడి సాయం ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి 9వ విడత నిధులను విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు.

  • టికెట్​ ధరలపై కేంద్రం క్లారిటీ

విదేశీ విమాన ధరలు ఆగస్టులో గణనీయంగా పెరిగాయని వస్తున్న వార్తలపై స్పష్టత ఇచ్చింది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. దిల్లీ- లండన్​ మధ్య నడిచే విమానాల్లో టికెట్​ ధరలు రూ.1.03 - 1.47 లక్షలుగా ఉన్నట్లు స్పష్టం చేసింది.

  • ప్రేయసితో మాజీ ఆల్​రౌండర్​ వివాహం

న్యూజిలాండ్​ మాజీ ఆల్​రౌండర్​ కోరె అండర్సన్​ ఓ ఇంటివాడయ్యాడు. ఎన్నో ఏళ్లుగా తాను ప్రేమిస్తున్న మేరీ మార్గరెట్(Corey Anderson wife)​తో అండర్సన్​ వివాహం జరిగింది. పెళ్లి వేడుకలకు సంబంధించిన వివరాలు, విశేషాలను ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేశాడు 30ఏళ్ల మాజీ ఆల్​రౌండర్​.

  • ఈ వారం విడుదలయ్యే సినిమాలివే!

జులై చివరి వారంలో థియేటర్లలో సినిమా సందడి మొదలైన తర్వాత ఒక్కో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అదే ఉత్సాహంతో ఈ వారం కూడా మరికొన్ని సినిమాలు ప్రజలను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే భారీ బాలీవుడ్‌ చిత్రాలన్నీ ఓటీటీల వేదికగా వస్తుండటం గమనార్హం. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అటు థియేటర్‌లలో, ఇటు ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలేంటో చూసేద్దాం!

12:54 August 09

టాప్​ న్యూస్ @1pm

  • ప్రతివారం సమీక్షించండి

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధన్‌బాద్‌ జడ్జి హత్య కేసుపై ఝార్ఖండ్‌ హైకోర్టుకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. కేసు విచారణను ప్రతివారం సమీక్షించాలని ఆదేశించింది.

  • పోలీసోళ్లు ఊకె ఫొటో కొడ్తున్నరని..

మద్యం మత్తులో... తన ద్విచక్రవాహనంపై పోలీసులు తరచూ చలాన్లు విధిస్తున్నారని వాహనాన్ని తుగులబెట్టుకున్నాడో యువకుడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్​లో జరిగింది.

  • సాయంత్రం సన్మానం

టోక్యో ఒలింపిక్స్​లో పతకాలు సాధించిన అథ్లెట్లకు దిల్లీలోని ఓ హోటల్​లో సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హోటల్​ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ విశ్వక్రీడల్లో నీరజ్​ చోప్డా(స్వర్ణం), మీరాబాయి చాను, రవి దహియకు రజతం, పీవీ సింధు, లవ్లీనా, భజరంగ్​ పునియా, హాకీ పురుషుల జట్టుకు కాంస్య పతకాలు వచ్చాయి.

  • కరోనా లక్షణాలు ఇవే..!

టీకా తీసుకున్నా, తీసుకోకపోయినా కరోనా సోకుతోంది. కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ రెండు సందర్భాల్లో లక్షణాలు వేరువేరుగా ఉంటున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

  • కేంద్రానికి సుప్రీం నోటీసులు

కరోనా టీకా క్లినికల్ ట్రయల్స్ డేటాను ప్రజలకు బహిరంగంగా అందుబాటులో ఉంచాలంటూ దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు పరిశీలించింది. దీనిపై స్పందించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది.

11:46 August 09

టాప్​ న్యూస్ @12pm

  • ఉభయ సభలు వాయిదా

పెగసస్​పై ఆందోళన కొనసాగడం వల్ల లోక్​సభ మళ్లీ వాయిదా పడింది. విపక్ష సభ్యుల నినాదాలతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సభను 12గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్​. ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. 

  • బోర్డుల భేటీ ప్రారంభం..

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశం (Krishna and Godavari river boards meeting )ప్రారంభమైంది. జలసౌధలో కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ (KRMB, GRMB ) ఛైర్మన్ల నేతృత్వంలో భేటీ జరుగుతుంది. సమావేశంలో బోర్డుల సభ్య కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. రెండు బోర్డుల సమావేశానికి తెలంగాణ సభ్యులు  గైర్హాజరయ్యారు. 

  • శ్రావణం స్పెషల్: ఈ వెరైటీలు ట్రై చేయండి!

శ్రావణమాసం అంటేనే నోములూ, వ్రతాల నెల. ఈ సమయంలో చేసుకునే పూజలతోపాటూ అమ్మవారికి నివేదించే పదార్థాలకూ ఎంతో ప్రాధాన్యం ఇస్తాం. ఎప్పుడూ చేసుకునే పాయసం, పులిహోర, పరమాన్నంతోపాటూ ఈసారి కాస్త వెరైటీగా వీటిని వండి నివేదించండి.

  • స్ఫూర్తి రగిలించారు..!

టోక్యో ఒలింపిక్స్​లో కొంతమంది భారత అథ్లెట్లు మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ పతకాన్ని సాధించలేకపోయారు. దురదృష్టవశాత్తు ఓటమిపాలై తృటిలో మెడల్స్​ను కోల్పోయారు. కానీ వారి పోరాటంతో స్ఫూర్తిని రగిలించారు. వారెవరో తెలుసుకుందాం..

  • ఈషా.. నిన్ను చూస్తే ఎక్కుతోంది నషా!

తెలంగాణలోని వరంగల్​లో పుట్టి.. హైదరాబాద్​లో పెరిగింది హీరోయిన్​ ఈషా రెబ్బా. పోస్ట్​ గ్రాడ్యూయేషన్​ తర్వాత సినిమాలపై ఆసక్తితో చిత్రసీమవైపు అడుగులు వేసిందీ తెలుగమ్మాయి. అనేక సినిమాలకు ఆడిషన్స్​ ఇచ్చిన తర్వాత 'లైఫ్​ ఈజ్​ బ్యూటీఫుల్​' చిత్రంలో నటించింది. 'అంతకుముందు ఆ తర్వాత' సినిమాతో హీరోయిన్​గా నటించింది.

10:49 August 09

టాప్​ న్యూస్ @11am

  • 'హేమపై చర్యలు తీసుకుంటాం'

'మా' ఎన్నికలపై హేమ చేసిన ఆరోపణలు అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీశాయని 'మా' అధ్యక్షుడు నరేష్​ అన్నారు. ఎన్నికలు జరగకుండా తాను ప్రయత్నిస్తున్నాననే హేమ వ్యాఖ్యలను తప్పుపట్టారు. హేమపై క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేస్తామని నరేష్ చెప్పారు.

  • ఉల్లంఘనులపై  కొరడా

ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై రవాణాశాఖ కొరడా ఝళిపిస్తోంది. తొలి తప్పు కింద జరిమానాతో విడిచి పెట్టినా సరే. మళ్లీ మళ్లీ అదే తప్పు చేసిన వాహనదారుల లైసెన్సులను ట్రాఫిక్‌ పోలీసుల సిఫార్సుల మేరకు రద్దు చేస్తోంది. అయినా చాలామంది వాహనదారుల్లో మార్పు కన్పించడం లేదు. ఈ తరహా కేసులు ఏటా పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా తాగి వాహనాలు నడిపిన చాలా మంది లైసెన్సులను ఇప్పటికే రద్దు చేసింది.

  • కొవిడ్ విలయం

ప్రపంచంపై కొవిడ్ తీవ్రస్థాయిలో పంజా విసురుతోంది. కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతోంది. డెల్టా వేరియంట్​తో అమెరికా విలవిల్లాడుతోంది. ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి. ఇరాన్, చైనాలోనూ కరోనాతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

  • దేశానికి రావాలి మరెన్నో పతకాలు

2020 టోక్యో ఒలింపిక్స్​ భారతీయులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. హాకీకి పూర్వవైభవం వచ్చే విధంగా అడుగులు పడింది ఇక్కడే! అటు పురుషుల హాకీ జట్టు, ఇటు మహిళల హాకీ జట్టు దుమ్మురేపి భారత్​కు గర్వకారణంగా నిలిచారు. ఇక నీరజ్​ చోప్డా పసిడి సాధించి భారత కీర్తిని మరోస్థాయికి చేర్చాడు. కానీ దాదాపు 140కోట్ల జనాభా ఉన్న దేశం 7 పతకాలే సాధించింది. భవిష్యత్తులో భారత్​ అద్భుత ప్రదర్శన చేయాలి.

  • ప్రముఖ  సీనియర్​ నటుడు కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్​ నటుడు అనుపమ్​ శ్యామ్​(63) అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

10:16 August 09

టాప్​ న్యూస్ @10am

  • హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.కేశవరావు కన్నుమూత

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు(60) కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 3.47 గంటలకు తుదిశ్వాస విడిచారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

  • 'క్విట్ ఇండియా'తో వలసవాదంపై పోరు బలోపేతం'

క్విట్ ఇండియా ఉద్యమం వలసవాదంపై పోరాటాన్ని మరింత బలోపేతం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గాంధీజీ ప్రేరణతో ప్రారంభమైన ఈ ఉద్యమం.. దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపిందని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

  • అంబులెన్స్‌ నడవక.. సిగ్నల్స్​ లేక

ఓ వైపు గర్భిణీ పురిటినొప్పులతో వేదన. మరోవైపు అంబులెన్స్ ఆగిపోయింది. ఫోన్​ చేద్దామంటే సిగ్నల్ లేవు. ఇక చేసేదేమి కోసం సిగ్నల్స్​ కోసం.. పాట్లు పడ్డారు. వాహనంపైకి ఎక్కి వైద్యులకు సమాచారం అందించడంతో మరో వాహనం వచ్చింది. ఈ ఘటన ఆసిఫాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

  • ఇది నిజంగా సిగ్గుచేటు: విరాట్ కోహ్లీ

ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టు(India vs England test) ఐదో రోజు రద్దవ్వడంపై విరాట్​ కహ్లీ(Virat Kohli news) అసహనం వ్యక్తం చేశాడు. విజయం కోసం రంగంలోకి దిగామని.. కానీ మ్యాచ్​ జరగకపోవడం సిగ్గుచేటని అభిప్రాయడ్డాడు.

  • ప్రముఖ సీనియర్​ నటుడు కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్​ నటుడు అనుపమ్​ శ్యామ్​(63) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

08:55 August 09

టాప్​ న్యూస్ @9am

  • శుభకార్యాల మాసం.. 'శ్రావణం'

సిరుల తల్లిని భక్తిశ్రద్ధలతో కొలిచే శ్రావణాన్ని శుభకార్యాల మాసమని అంటారు. సర్వదేవతలకూ అత్యంత ప్రీతికరమైన నెలగా పరిగణించే శ్రావణంలో చేసే ప్రతి పూజకూ ఎంతో ఫలితం ఉంటుంది. వేంకటేశ్వరస్వామికి పవిత్రోత్సవం పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించే ఈ శ్రావణ మాసం అంటే మహావిష్ణువుకు కూడా చాలా ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి.

  • ఆటపాటల ద్వారానే విద్యాబోధన

ఇంటి దగ్గరే ఉండి ఆడుతూ పాడుతూ చదువుకునే చిన్నారుల కోసం గూగుల్... రీడ్ ఎలాంగ్ యాప్​ను తయారుచేసింది. ఇది ఒకటి, రెండు తరగతుల పిల్లల కోసమ మాత్రమేనని... ఆటపాటల ద్వారానే ఇందులో విద్యాబోధన ఉంటుందని వివరించింది.

  • 8మంది మృతి

రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8మంది మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. గుజరాత్​లోని అమ్రేలి జిల్లాలో జరిగింది ఈ ఘటన.

  • మరణ వార్త దాచి.. ఒలింపిక్స్‌కు పంపారు

దేశానికి ఒలింపిక్ పతకం అందించాలనే లక్ష్యంతో టోక్యో వెళ్లిన చెల్లికి.. అక్క మరణ వార్త అడ్డు కాకూడదని అనుకున్నారు కుటుంబ సభ్యులు. అందుకే ఆ విషయాన్ని దాచి ఉంచారు. అథ్లెట్ ధనలక్ష్మికి ఎదురైన హృదయ విదారక ఘటన ఇది.

  • వెబ్​సిరీస్​తో వర్మ..

సినిమా అప్​డేట్స్​ వచ్చేశాయి. 'రక్త చరిత్ర'తో ఫ్యాక్షన్​కు అనుబంధంగా 'కడప్ప' పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ తీయబోతున్నట్లు ప్రకటిస్తూ వీడియోను పంచుకున్నారు దర్శకుడు రామ్ గోపాల్​ వర్మ. అలాగే అన్నాచెల్లెళ్ల నేపథ్యంలో 'బ్రో' అనే సినిమా తెరకెక్కుతోంది.

07:55 August 09

టాప్​ న్యూస్ @8am

  • ఫేస్​బుక్​ ఐడీ షేర్​ చేసి

ముందుగా వాట్సాప్​కు​ నుంచి ఓ అందమైన అమ్మాయి నుంచి సందేశం వస్తుంది. వెంటనే మేసేజ్​లతో ముగ్గులోకి దింపుతుంది. ఆ తర్వాత పర్సనల్ వివరాలు అడుగుతుంది. చెప్పామంటే అంతే ఇక... నగ్నంగా వీడియో కాల్​ చేసి మనల్ని కూడా బట్టలు విప్పమని చెబుతుంది. అంతే టెమ్ట్​ అయి ముందడుగు వేస్తే.. ఏం జరుగుతుందో చూడండి.

  • నేడే యాజమాన్య బోర్డుల భేటీ..

గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ ఖరారు అంశాలే ఎజెండాగా కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఇవాళ సమావేశం కానున్నాయి. రెండు బోర్దుల ఉమ్మడి భేటీలో బోర్డు ప్రతినిధులతో పాటు ఏపీ సభ్యులు పాల్గొననున్నారు. కేసుల విచారణ నేపథ్యంలో ఇవాళ్టి భేటీకి హాజరు కావడం కుదరదన్న తెలంగాణ సభ్యులు గైర్హాజరయ్యే అవకాశం ఉంది.

  • ఆఫీస్​కు రావాలంటే ముఖం చాటేస్తున్నారు

కరోనా మూడో దశ భయంతో.. ఉద్యోగులు ఇంటి వద్ద ఉండి పనిచేసేందుకే ఆసక్తి చూపిస్తున్నట్లు సంస్థలు చెబుతున్నాయి. ఇంటి నుంచే పని చేద్దామంటూ ఉద్యోగులు వినతుల మెయిల్స్ పంపిస్తున్నారని వెల్లడించాయి.

  • 'లోపాలున్న ఈవీఎంలు ఎన్ని?'

ఈవీఎం, వీవీపాట్‌లో పొందుపరిచిన ఫర్మ్‌వేర్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమీక్షిస్తున్న సమయంలో ఎన్ని యంత్రాల్లో లోపాలు తలెత్తాయో..? వాటి వివరాలు ఇవ్వాలని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖల పరిధిలోని ఎస్‌టీక్యూసీని ఓ వ్యక్తి కోరగా.. అందుకు నిరాకరించింది. ఈ విషయమై సీఐసీని ఆశ్రయించగా.. ఆ వివరాలను దరఖాస్తుదారుకు ఇవ్వాలని ఆదేశించింది.

  • మక్కువ పెంచుకున్నా

సంగీతకారిణి పాత్రపై మక్కువ పెంచుకున్నానని చెబుతోంది శ్రుతిహాసన్​. మనసుల్ని ప్రతిబింబించే పాత్రల్ని చేసేప్పుడు నటించినట్లు అనిపించదని చెప్పుకొచ్చింది.

07:04 August 09

టాప్​ న్యూస్ @7am

  • వచ్చే నెలలో రాష్ట్రానికి రాహుల్‌

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సెప్టెంబర్‌ మొదటివారంలో తెలంగాణకు వస్తారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ సోమవారం నుంచి సెప్టెంబర్‌ 17 వరకు నిర్వహించనున్న కార్యక్రమాల్లో ఒకరోజు రాహుల్‌ పాల్గొంటారని అన్నారు

  • తిరగబడ్డ భరతగడ్డ..

మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపునకు ఉత్తేజితులైన ప్రజలు ఆగస్టు 9 నుంచి క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. అయిదేళ్లు తిరిగేసరికల్లా దేశానికి స్వాతంత్య్రం సాధించారు. భారత్‌ ఛోడో అంటూ బ్రిటిష్‌ పాలకులపై గాంధీజీ చేసిన గర్జన ప్రజల్లో పూర్ణ స్వరాజ్యం సాధించాలన్న ఆకాంక్షను బలంగా నాటి స్వాతంత్య్ర ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పింది.

  • మీ బతుకులు బజారున పడతాయి

డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో వాహనాన్ని ఆపిన పోలీసులతో ఇద్దరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించారు. మమ్మల్నే ఆపుతారా.. మీరెంత మీ చదువులెంత? ఒక్క ఫోన్​తో మీ బతుకులు బజారున పడతాయంటూ బెదిరించారు. మరింత రెచ్చిపోయి సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సీఐ ఆ ఇద్దరి వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. సాక్షాత్తు సీఐ ఫిర్యాదు చేసినా.. ఎవరూ స్పందించలేదు. అసలు కేసు నమోదు చేసుకున్నారా లేదా అనే విషయం కూడా తెలియదు. ఇంత జరిగినా నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

  • నలుగురికి ఆదర్శం

అతని ఆత్మ విశ్వాసం ముందు వైకల్యం చిన్నబోయింది. అతని పట్టుదలకు ప్రకృతి మూగబోయింది. కాళ్లు, చేతులు లేకపోయినా వ్యవసాయం చేస్తున్నాడు. తన భార్య బిడ్డలతో కలిసి వరినారు తీస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు సంగారెడ్డి జిల్లాకు చెందిన దివ్యాంగుడు వెంకటేశ్.

  • ఆరడుగుల అందగాడు.. అమ్మాయిల రాకుమారుడు

టాలీవుడ్​ హీరో మహేష్​ ​బాబు.. నేడు(సోమవారం) 46వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా మహేష్​ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాటకు సంబంధించి కీలక ప్రకటన వెలువడనుంది. సోమవారం ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ముహూర్తం ఖరారు చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్​ స్పష్టం చేసింది. తన గ్లామర్​, నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ కథానాయకుడిపై స్పెషల్ స్టోరీ మీకోసం.

05:29 August 09

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

 భేటీకి హాజరుకాలేం.!

 బోర్డు సమావేశానికి రాష్ట్ర సభ్యులు హాజరై అభిప్రాయాలు చెప్పేందుకు వీలుగా మరో తేదీని ఖరారు చేయాలని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రెండు బోర్డులకు మరోసారి విడివిడిగా లేఖలు రాసింది.

బహుజన రాజ్యం రాబోతోంది

తెలంగాణలో బహుజన రాజ్యం రాబోతోందని నల్గొండలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్ప సభలో విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. రిజర్వేషన్లు మా హక్కు అని భిక్ష కాదన్నారు. వెయ్యి గురుకులాలు పెట్టి.. విద్యావ్యవస్థ మారిపోయిందన్నారు.

కాంగ్రెస్ దండోరా సభ

ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ ద్వారా కాంగ్రెస్ క్షేత్రస్థాయి పోరాటాలకు శ్రీకారం చుట్టనుంది. క్విట్ ఇండియా దినోత్సవం, అంతర్జాతీయ గిరిజన దినోత్సవం రోజున పోరాటాలకు పురుడు పోసిన ఇంద్రవెల్లి గడ్డ నుంచి ప్రారంభిస్తోంది. 

ఈ కామర్స్​కు రాయితీలు

ఈ కామర్స్ సంస్థలు సత్వర రవాణా వినియోగ వస్తువుల రంగానికి సేవా పరిశ్రమల హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గృహోపకరణాల రంగమూ కూడా ఇదే జాబితాలో చేర్చనున్నట్లు వెల్లడించింది. దీని కోసం విధివిధానాలు ప్రభుత్వం ఖరారు చేసింది. 

 వారికి కూడా వేతనాలు పెంచాం

ప్రభుత్వ ఉద్యోగులతో పాటే ఔట్‌ సోర్సింగ్, ఒప్పంద, సొసైటీలలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచిన ఘనత ముఖ్యమంత్రిదేనని ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో మంత్రి పాల్గొన్నారు. 

స్వస్థ భారత్‌ కోసం..!

భారత్​లో ఘనవ్యర్థాల నిర్వహణలో తీవ్ర అలసత్వం కనబడుతోంది. విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక వ్యర్థాల సేకరణ, శుద్ధిపై ప్రభుత్వ లెక్కలకు సర్వే లెక్కలకు పొంతన కుదరకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 

సెకన్లలోనే  ధ్రువపత్రం.. ఎలాగంటే?

కరోనా టీకా ధ్రువపత్రం పొందటం ఇప్పుడు మరింత సులభం కానుంది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే వాట్సాప్‌ ద్వారా కొవిడ్‌ వ్యాక్సిన్‌ ధ్రువపత్రం పొందవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా తెలిపారు.

' మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది'

టోక్యో ఒలింపిక్స్​లో పతకాలు సాధించి దేశాన్ని గర్వించేలా చేశారని భారత అథ్లెట్లను కొనియాడారు ప్రధాని నరేంద్ర మోదీ. విజయవంతంగా క్రీడలను నిర్వహించిన జపాన్​ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

'ఠాణాల్లో మానవహక్కుల ఉల్లంఘన విచారకరం'

జైళ్లలో ఇప్పటికీ హింస కొనసాగుతుండటం ఆందోళనకరమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. పోలీసులు సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జాతీయ న్యాయ సేవ కేంద్రం(నల్సా) మొబైల్ యాప్ ప్రారంభించిన కార్యక్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

డబ్ల్యూటీసీ-2లో చెరిసగం

డబ్ల్యూటీసీ-2​ పాయింట్ల పట్టికలో భారత్​, ఇంగ్లాండ్​ ఖాతా తెరిచాయి. తొలి టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. దీంతో ఇరు జట్లకు చెరో నాలుగు పాయింట్లు లభించాయి.

Last Updated : Aug 9, 2021, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.