ETV Bharat / city

Telangana Top news 9PM టాప్​ న్యూస్ - టాప్​ న్యూస్ 9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9PM TOPNEWS
9PM TOPNEWS
author img

By

Published : Aug 23, 2022, 8:58 PM IST

  • రాజాసింగ్‌కు బెయిల్‌ మంజూరు

వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్‌ మంజూరైంది. మంగళ్‌హాట్‌లో ఖాదీర్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు రాజాసింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి బొల్లారం పీఎస్‌కు తరలించారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా బెయిల్ మంజూరైంది.

  • రాజాసింగ్‌ను సస్పెండ్ చేసిన భాజపా అధిష్ఠానం

ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పలు స్టేషన్లకు వరుస ఫిర్యాదులు అందిన విషయం తెలిసిందే. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పార్టీ క్రమశిక్షణ సంఘం భావించింది.

  • బండి సంజయ్‌ పాదయాత్రను నిలిపేయాలని నోటీసులు జారీ

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని పోలీసులు నోటీసులు జారీచేశారు. పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్‌లకు వర్దన్నపేట ఏసీపీ ఈ తాఖీదులు ఇచ్చారు.

  • ఎమ్మెల్సీ కవితకు మంత్రులు, ఎమ్మెల్యేల సంఘీభావం

ఎమ్మెల్సీ కవిత ఇంటిపై భాజపా కార్యకర్తలు దాడి చేయటాన్ని తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. కవిత నివాసానికి వెళ్లి ఆమెకు తమ సంఘీభావం తెలిపారు. భాజపా కార్యకర్తలు ఇలా భౌతికంగా దాడి చేయటం దారుణమన్నారు. తాము కూడా దాడులు చేస్తే భాజపా నేతలు మిగులుతారా అని ప్రశ్నించారు.

  • పాక్​ భూభాగంలోకి బ్రహ్మోస్ క్షిపణి, ముగ్గురు అధికారులపై వేటు

పాకిస్థాన్​ భూభాగంలోకి పొరపాటున బ్రహ్మోస్ క్షిపణి దూసుకెళ్లిన ఘటనలో వాయుసేనకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులపై వేటు పడింది. వారిని విధుల నుంచి తొలగిస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • రాందేవ్ బాబాపై సుప్రీంకోర్టు అసహనం

ఆధునిక వైద్యాన్ని విమర్శిస్తూ యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. యోగాకు ఆయన ప్రాచుర్యం కల్పించారని.. కానీ ఇతర వ్యవస్థలను విమర్శించడం సరికాదని జస్టిస్ ఎన్​వీ రమణ అన్నారు. ఆయన అనుసరిస్తున్న విధానాలు అన్నింటినీ నయం చేస్తాయన్న గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు.

  • యువతిపై ఆరేళ్లుగా దొంగ స్వామీజీ అత్యాచారం, నగ్న వీడియోలు తీసి

గత ఐదారేళ్లుగా యువతిపై రేప్​కు పాల్పడ్డాడు ఓ దొంగ స్వామీజీ. దీనికి నిందితుడి భార్య కూడా వత్తాసు పలికింది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి రావడం వల్ల నిందితులు కటకటాల వెనక్కి వెళ్లారు. బెంగుళూరులోని అవహలహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.

  • వన్డే ర్యాంకింగ్స్​లో అదరగొట్టిన టీమ్​ఇండియా, పాక్​​ స్థానం ఎంతంటే

జింబాబ్వేతో జరిగిన సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌ వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరుకుంది. అలాగే పాకిస్థాన్​ కూడా తాజా ర్యాంకింగ్స్​ మెరుగైన పాయింట్లను సాధించింది.

  • షూటింగ్స్​కు గ్రీన్​సిగ్నల్

సినిమా షూటింగ్స్​కు ప్రాధాన్య క్రమంలో అనుమతించనున్నట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించింది. ఈ నెల 25 నుంచి షూటింగ్స్ ప్రారంభించనున్నట్లు తెలిపింది.

  • అలా చేయడం నచ్చదు, అందుకే ఈవెంట్ క్యాన్సిల్ అయితే ఆనందిస్తా

ఎన్నో వివాదాలు, భారీ అంచనాల మధ్య విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్​ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.