ETV Bharat / city

ఈటీవీ భారత్- ముఖ్యాంశాలు - ప్రధాన వార్తలు

TOP NEWS@6AM
టాప్​న్యూస్​@6AM
author img

By

Published : Oct 8, 2021, 5:57 AM IST

Updated : Oct 8, 2021, 7:57 PM IST

19:50 October 08

టాప్​ న్యూస్​ @8PM

  • 'స్టాంపులు, రిజిస్ట్రేషన్​శాఖ కార్యాలయాల్లో వసతుల కల్పనకు చర్యలు'

రాష్ట్రంలో స్ట్రాంపులు, రిజిస్ట్రేషన్​ శాఖకు చెందిన కార్యాలయాల్లో కనీస వసతుల కల్పనకు(minimum facilities) చర్యలు తీసుకుంటామని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి (vemula Prashanth reddy) అన్నారు. శాసన మండలిలో సభ్యులు వాణీదేవి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, బానుప్రసాద్​ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

  • సజీవ సమాధికి యత్నించిన పప్పడ్​ బాబా

సజీవ సమాధి అవ్వాలని ప్రయత్నించిన.. ఓ బాబాను మధ్యప్రదేశ్‌ పోలీసులు అడ్డుకున్నారు. మోరెనా జిల్లా తుస్సిపురా గ్రామానికి చెందిన.. 105 ఏళ్ల వయసున్న పప్పడ్‌ బాబా సజీవ సమాధి (Pappad Baba took Samadhi in Moren) అయ్యేందుకు సిద్ధమయ్యారు. 

  • 50 రోజుల్లో 3వేల కిమీ పరుగు

గిన్నిస్​ రికార్డే లక్ష్యంగా హరియాణాకు చెందిన ఓ యువకుడు దాదాపు మూడు వేల కిలోమీటర్లు పరిగెత్తేందుకు సిద్ధపడ్డాడు. ఈ పరుగును కేవలం 50 రోజుల్లో పూర్తి చేయాలనుకుంటున్నాడు.

  • మా ఎన్నికలు ఎలా జరుగుతాయంటే? 

తెలుగు చిత్రసీమ నటీనటుల సంఘం ఎన్నికలు(MAA Elections)అక్టోబరు 10న (maa elections 2021 date) జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల ప్రక్రియ (maa elections process) ఎలా ఉంటుంది? అధ్యక్షుడిని, కార్యవర్గ సభ్యులను ఎలా ఎన్నుకుంటున్నారు? ఎన్నికైన కార్యవర్గ కర్తవ్యం ఏమిటి? అనే విషయాల గురించే ఈ స్టోరీ.

  • దిల్లీ బ్యాటింగ్​

దిల్లీ క్యాపిటల్స్​తో(RCB Vs DC) మ్యాచ్​లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే రెండు జట్లు ఫ్లేఆఫ్స్ అర్హత సాధించాయి.

18:52 October 08

టాప్​ న్యూస్​ @7PM

  • 'కేంద్రం దగ్గరే లేవు.. ఇక తెలంగాణకు ఏమిస్తరు'

తెలంగాణనే.... కేంద్రానికి నిధులు ఇస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో (KCR Speech in Assembly sessions 2021) స్పష్టం చేశారు. కేంద్రం తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణది రెట్టింపు అని తెలిపారు. కేంద్రం దగ్గరే లేదు.. ఇక తెలంగాణకు ఏం ఇస్తారు? అని ప్రశ్నించారు. రాష్ట్రం హక్కు ప్రకారం కేంద్రం నుంచి రావాల్సింది వస్తుందని వివరించారు.

  • 'హుజూరాబాద్​ ఉప ఎన్నిక ఒక చీకటి అధ్యాయం'

దేశ చరిత్రలో హుజూరాబాద్​ ఉప ఎన్నిక ఒక చీకటి అధ్యాయం, ప్రజాస్వామ్యానికి ఒక గొట్టలి పెట్టు అని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్​ అన్నారు. దీనికి కారకులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మఖ్యమంత్రి అని ఆరోపించారు. హుజూరాబాద్​లో ఎలాగైన గెలిచేందుకు అధికార దుర్వినియోగంతో, బాధ్యతను విస్మరించి గత 5 నెలల 8రోజులగా ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. 

  • 'బార్లలోనూ రిజర్వేషన్లు' 

రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ కులస్తులకు 15శాతం రిజర్వేషన్ అమలుపై కార్యాచరణ జరుగుతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas goud on excise reservations) పేర్కొన్నారు. అదేవిధంగా బార్లలోనూ రిజర్వేషన్లు తెచ్చే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. రిజర్వేషన్లు, విధివిధానాల అమలుపై మండలి సభ్యులు గంగాధర్ గౌడ్ అడిగిన ప్రశ్నకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమాధానమిచ్చారు.

  • 'టీమ్ఇండియాను ఓడిస్తే పీసీబీకి బ్లాంక్ ​చెక్​'

టీ20 ప్రపంచకప్​ వేదికగా భారత్​, పాకిస్థాన్​ జట్లు తలపడనున్న మ్యాచ్​పై పాక్​ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​ రమీజ్​ రాజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్​ వేదికగా టీమ్ఇండియాను పాక్​ జట్టు ఓడిస్తే.. పీసీబీకి బ్లాంక్​చెక్​ వస్తుందని అన్నాడు.

  • సినిమా అప్​డేట్స్​

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో సీటీమార్, హైవే, మహాసముద్రం, ఫ్రెండ్​షిప్, అన్నాత్తే, పంచతంత్రం, రాజ్​తరుణ్-సందీప్ మాధవ్ మూవీ, నిఖిల్ కొత్త సినిమాలకు సంబంధించిన సంగతులు ఉన్నాయి.

17:45 October 08

టాప్​ న్యూస్​ @6PM

  • రామోజీ ఫిల్మ్​సిటీలో రంగుల వినోదాలు ప్రారంభం

ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్​సిటీలో(Ramoji film city) మధురానుభూతులు మళ్లీ మొదలయ్యాయి. కరోనా(Corona virus) విరామం అనంతరం తొలిరోజు మైమరిపించే కార్యక్రమాలతో చిత్రనగరి స్వాగతం పలికింది(Ramoji film city Reopen ). సుందర కట్టడాలు, అద్భుత దృశ్యాల మధ్య నిర్వహించిన స్వాగత వేడుక సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేసింది. కొవిడ్ప్రత్యేక మార్గదర్శకాలను అమలుచేస్తూ.. పర్యాటకుల భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.

  • అఫ్గాన్​లో భారీ పేలుడు

అఫ్గానిస్థాన్​లో (Afghanistan News) మరోసారి పేలుడు సంభవించింది. దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. అనేకమంది గాయపడినట్టు తెలుస్తోంది. షియా ముస్లింలే లక్ష్యంగా కుందుస్​ ప్రావిన్స్​లోని ఓ మసీదులో  శుక్రవారం ప్రార్థనల అనంతరం.. ఈ భారీ పేలుడు జరిగింది.

  • యాదాద్రి పునఃప్రారంభంపై సీఎం క్లారిటీ

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన సుప్రసిద్ధ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ(Yadadri temple news) ఉద్ఘాటన పర్వానికి అడుగులు పడుతున్నాయి. యాదాద్రి పున:ప్రారంభంపై సీఎం క్లారిటీనిచ్చారు. నవంబర్, డిసెంబర్‌లో యాదాద్రి పున‌ఃప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ (cm kcr in assembly sessions 2021) శాసనసభ సమావేశాల్లో తెలిపారు. 

  • తెలుగు అకాడమీ కేసులో ముగ్గురికి 4 రోజుల కస్టడీ

తెలుగు అకాడమీ కేసులో ముగ్గురికి 4 రోజుల కస్టడీ విధిస్తూ నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది.  ఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహీద్దీన్​లను రేపట్నుంచి పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. 

  • 'మా' ఎన్నికల్లో మార్పు

'మా' ఎన్నికలకు అంతా సిద్ధమైన వేళ.. అందులో స్వల్ప మార్పు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ముందే చెప్పినట్లు ఈనెల 10న యథావిధిగా ఎన్నికలు జరగుతాయని, ఫలితాలు మాత్రం తర్వాతి రోజు అంటే 11వ తేదీన వెల్లడించనున్నారు.

16:50 October 08

టాప్​ న్యూస్​ @5PM

  • అసెంబ్లీ నిరవధిక వాయిదా

శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. 7 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో.. 37 గంటల 5 నిమిషాలు సభ పనిచేసింది. 6 అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగిందని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.

  • టాటాల చేతికే ఎయిర్​ ఇండియా

నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్ధ ఎయిర్‌ ఇండియాను.. టాటా సన్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని కేంద్రం అధికారికంగా వెల్లడించింది. ఈ సంస్థను దక్కించుకునేందుకు చాలా సంస్థలు బిడ్లు దాఖలు చేయగా.. టాటా సన్స్‌ దాఖలు చేసిన బిడ్‌ అన్నింటికంటే ఆకర్షణీయంగా ఉందని కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (డీఐపీఎం) కార్యదర్శి తుహిన్‌కాంత పాండే తెలిపారు.

  • 'త్వరలో ఆ పథకం'

ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాకే నిధుల వినియోగం పెరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ సమావేశాల్లో (kcr in assembly sessions) పేర్కొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ తీసుకునే అవకాశం పరిశీలిస్తామని వెల్లడించారు. సొంత భూమిలో ఇల్లు కట్టుకునే పథకం కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు.

  • టీమ్​ఇండియా నయా లుక్​

ఐసీసీ టీ20 ప్రపంచకప్​లో(ICC T20 World Cup 2021) టీమ్ఇండియా కొత్త జెర్సీలపై(Team India New Jersey) భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ) అప్​డేట్​ ఇచ్చింది. అక్టోబరు 13న టీమ్ఇండియా జెర్సీను రివీల్​ చేయనున్నట్లు తెలిపింది.

  • విడాకులపై స్పందించిన సమంత

హీరోయిన్​ సమంత ఇన్​స్టాలో భావోద్వేగ పోస్ట్ పెట్టింది. తనను ఒంటరిగా వదిలేయండని ఆవేదన వ్యక్తం చేసింది.

15:48 October 08

టాప్​ న్యూస్​ @4PM

  • ముగిసిన నామినేషన్ల పర్వం

హుజూరాబాద్ ఉపఎన్నిక(huzurabad by election 2021)కు నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు కావటంతో ఆర్డీవో కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఫీల్డ్‌ అసిస్టెంట్లు నామినేషన్లు దాఖలు చేసేందుకు రావటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • 'హెటిరో'లో భారీగా నగదు స్వాధీనం

హైదరాబాద్​లోని హెటిరో డ్రగ్స్‌ సంస్థల (Hetero Drugs Companies)పై ఐటీ దాడులు (IT Raids) కొనసాగుతూనే ఉన్నాయి. అమీర్​పేట్​లో హెటిరో సంస్థకు సంబంధించిన పలువురు కార్యాలయ సిబ్బందిపై అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో పెద్దఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

  • 'అప్పుడే నిజమైన సంక్షేమం సాధ్యం'

రాష్ట్ర సంక్షేమంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. అందరికి నాణ్యమైన విద్య, వైద్యం అందించినప్పుడే నిజమైన సంక్షేమం సాధించినట్లు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP leader Bhatti Vikramarka) శాసనసభలో సమావేశాల్లో (assembly sessions 2021 ) పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తి చేసినప్పుడు... నిజమైన సంక్షేమం సాధ్యమని వెల్లడించారు.

  • స్టాక్ మార్కెట్లకు ఆర్​బీఐ బూస్ట్​

స్టాక్ మార్కెట్లు (Stock Market) వారాంతాన్ని లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ (Sensex Today) 381 పాయింట్లు పెరిగి 60 వేల పైకి చేరింది. నిఫ్టీ (Nifty Today) 105 పాయింట్ల లాభంతో 17,900 మార్క్​కు చేరువైంది.

  • ప్రకాశ్​రాజ్​పై కోటా సంచలన వ్యాఖ్యలు

మా ఎన్నికల్లో పాల్గొంటున్న ప్రకాశ్ రాజ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు(kota srinivasa rao last movie). అతడు ఎప్పుడూ షూటింగ్​కు టైమ్​కు వచ్చిన దాఖలు లేవని అన్నారు.

14:54 October 08

టాప్​న్యూస్​ @ 3PM

  • నోబెల్​ శాంతి పురస్కారం

భావవ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడేందుకు చేసిన కృషికి గాను మరియా రెస్సా, దిమిత్రి మురటోవ్​కు ఈ ఏడాది నోబెల్​ శాంతి బహుమతి దక్కింది. విస్తృత చర్చల తర్వాత ఈ ప్రకటన చేసింది నోబెల్​ కమిటీ.

  • ముగిసిన నామినేషన్ల  ప్రక్రియ

హుజూరాబాద్ ఉపఎన్నిక నామినేషన్లకు చివరి రోజు కావటంతో ఆర్డీవో కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఫీల్డ్‌ అసిస్టెంట్లు నామినేషన్లు దాఖలు చేసేందుకు రావటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌ పత్రాన్ని సమర్పించారు. దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌తో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్‌ దాఖలు చేశారు. కొద్దిసేపటి క్రితమే  భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. 

  • రైతులకంటే కంపెనీలకే అధిక లాభం

కేంద్ర సర్కార్ తీసుకువచ్చిన ఫసల్​ బీమా యోజనతో బీమా కంపెనీలకే లబ్ధి చేకూరుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు. బీమా పథకంలో మార్పులు చేస్తే కర్షకులకు మేలు జరుగుతుందని చెప్పారు. పంట బీమా, పంట రుణాలు, పంట నష్టపోయిన రైతులకు పరిహారం, ఫసల్ బీమా యోజన అమలుపై అసెంబ్లీ(Telangana Assembly Sessions 2021)లో పలువురు ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

  • ఛాతిపై 21 నీటి బిందెలతో

నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గామాతకు వినూత్నంగా పూజిస్తున్నారు బిహార్​కు చెందిన ఓ అర్చకుడు. నీటితో నింపిన 21 బిందెలను తన ఛాతిపై ఉంచి.. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ప్రార్థిస్తున్నారు.

  • ఉత్కంఠ రేపిన 'కోల్డ్​కేస్'

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, అదితి బాలన్‌ ప్రధాన పాత్రల్లో తను బాలక్ తెరకెక్కించిన చిత్రం 'కోల్డ్ కేస్'(Cold Case Review). ఈ సినిమా నేడు (అక్టోబర్ 8) 'ఆహా' వేదికగా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎలా ఉందో సమీక్ష ద్వారా చూద్దాం.

14:08 October 08

టాప్​న్యూస్​ @ 2 PM

  • హుజూరాబాద్ ఉపఎన్నికకు నామినేషన్లు వేసిన తెరాస, కాంగ్రెస్ అభ్యర్థులు

హుజూరాబాద్ ఉపఎన్నిక నామినేషన్లకు చివరి రోజు కావటంతో ఆర్డీవో కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది.  తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌ పత్రాన్ని సమర్పించారు. పీసీసీ ఉపాధ్యక్షులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌తో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్‌ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల గడువు ముగియనుంది. నిన్నటి వరకు హుజూరాబాద్‌ ఉపఎన్నికకు 24 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

  • 'లఖింపుర్​' కేసులో యూపీ ప్రభుత్వంపై సుప్రీం అసహనం

లఖింపుర్​ ఖేరి హింసాత్మక ఘటనపై సుమోటోగా విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. ఈ కేసు దర్యాప్తులో ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సంతృప్తికరంగా లేవని అసహనం వ్యక్తం చేసింది.

  • అంగారకుడిపై పుష్కలంగా నీరు

అంగారకుడిపై నీటి ఆనవాళ్ల(Water on Mars) గుర్తింపులో కీలక మైలురాయిని చేరుకున్నారు శాస్త్రవేత్తలు. నాసా రోవర్ పర్సెవెరెన్స్(NASA Perseverance Mars Rover)​ పంపిన చిత్రాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఒకప్పడు అరుణ గ్రహంపై నది ప్రవాహించినట్లు భావిస్తున్నారు.

  • 'భారత్​లో కరోనా కేసులు వారిలోనే అధికం'

భారత్​లో 19 ఏళ్లలోపు వయసు వారు, మహిళలు కొవిడ్​ బారిన అధికంగా పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ)(Who India Covid News) తెలిపింది. కరోనా డెల్టా వేరియంట్(delta variant in india)​ కారణంగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్​ బాధితులుగా మారుతున్న సందర్భాలు తరుచూ వెలుగు చూస్తున్నట్లు చెప్పింది. ఇప్పటివరకు డెల్టా వేరియంట్​ 192 దేశాల్లో వ్యాపించిందని పేర్కొంది.

  • ధోనీ వల్లే ఇదంతా..

పంజాబ్ కింగ్స్​తో మ్యాచ్ అనంతరం తన ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చాహర్(deepak chahar girlfriend). తాజాగా ఈ విషయంపై చాహర్ తండ్రి లోకేంద్ర సింగ్ స్పందించారు. ధోనీ వల్లే ఇలా జరిగిందంటూ వెల్లడించారు.

12:59 October 08

టాప్​న్యూస్​ @ 1 PM

  • విచారణకు కేంద్ర మంత్రి కుమారుడు డుమ్మా

లఖింపుర్​ ఖేరి హింసాత్మక ఘటన(Lakhimpur Kheri violence) కేసులో విచారణకు హాజరుకావలన్న పోలీసుల ఆదేశాలను కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రా కుమారుడు ఆశిష్​ మిశ్రా విస్మరించారని అధికారులు తెలిపారు. ఉదయం 11.30 గంటలు దాటినా.. పోలీసుల ముందు హాజరుకాలేదని చెప్పారు. మరోవైపు.. మిశ్రా నేపాల్​ పరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

  • బీసీ కులగణనపై అసెంబ్లీ తీర్మానం

బీసీ కులగణనపై తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వచ్చే జనాభా లెక్కల్లో బీసీ కులగణన చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. 2021 జనాభా గణన చేయబోతున్నారని.. రాష్ట్రంలో 50 శాతానికిపైగా ఉన్న బీసీలకు ప్రయోజనం చేకూరాలంటే కులగణన చేపట్టాలని సీఎం కోరారు.

  • 'pklove' హ్యాష్​ ట్యాగ్​తో నటి ట్వీట్

నటి పూనమ్​ కౌర్​(Poonam Kaur tweet) ట్విట్టర్​లో కొన్ని ఫొటోలు ట్వీట్ చేశారు. ఆ పోస్ట్​కు 'పీకే లవ్' అని హ్యాష్ ​ట్యాగ్ జోడించారు. ఈ ట్వీట్​ ప్రస్తుతం నెట్టింట హాట్​టాపిక్​గా మారింది.

  • చాహర్ ప్రపోజల్​పై అతడి తండ్రి క్లారిటీ

  • ఈఎంఐలు భారంగా మారాయా?

అవసరాలు పెరగడం.. సులభంగా అప్పు లభిస్తుండటం వల్ల ఎంతోమంది రకరకాల అప్పులను తీసుకుంటున్నారు. అనుకోకుండా.. ఆదాయం తగ్గడం లేదా ఇతర అవసరాలు వచ్చినప్పుడు.. ఆ రుణాల ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇలాంటి ఇబ్బందులు రాకుండా.. రుణాల నిర్వహణ విషయంలో ఓ ప్రణాళిక అవసరం. మరి ఆ ప్రణాళిక ఎలా ఉండాలి? అనే విషయంపై నిపుణులు చెబుతున్న సూచనలు మీ కోసం.

11:52 October 08

టాప్​న్యూస్​ @ 12 PM

  • కేంద్రం పైసా ఇవ్వలేదు

హైదరాబాద్​లో వరదల కారణంగా చాలా నష్టం జరిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు. సుమారు రూ.8 వేల కోట్ల నష్టం జరిగినట్లు కేంద్రానికి నివేదిక పంపామని.. కానీ కేంద్రం పైసా ఇవ్వలేదని చెప్పారు. కేంద్రం పెట్టిన విధాలేవీ సరిగాలేవని(kcr about central government) పేర్కొన్నారు. అసెంబ్లీ కేసీఆర్ సుధీర్ఘంగా మాట్లాడారు.

  • ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్​ దంపతులపై సీబీఐ విచారణ

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

  • 'భారత భూభాగంలోకి విదేశీ శక్తులను అనుమతించబోం'

గడచిన ఏడాదిగా దేశం అనేక సవాళ్లను ఎదుర్కుంటోందని భారత వాయుసేన అధిపతి (New IAF chief of India) ఎయిర్​చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి అన్నారు. భారత వైమానిక దినోత్సవాన్ని(Air Force Day) పురస్కరించుకుని ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

  • తాత మృతదేహం వెతకడానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి

కర్ణాటకలో విషాద ఘటన జరిగింది. ఓ వ్యక్తి మృతదేహాన్ని వెతకడానికి వెళ్లి.. మరో ముగ్గురు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఒకరి మృతదేహం లభ్యమవగా.. మిగిలినవారి కోసం పోలీసులు సహా స్థానికులు గాలిస్తున్నారు.

  • హత్య కేసులో డేరా బాబాను దోషిగా తేల్చిన కోర్టు

ఓ హత్య కేసులో డేరా బాబాతో పాటు మరో నలుగురిని దోషులుగా తేల్చింది హరియాణాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు. అక్టోబర్​ 12న శిక్ష ఖరారు చేయనున్నట్లు వెల్లడించింది.

10:55 October 08

టాప్​న్యూస్​ @ 11 AM

  • ఆర్​బీఐ కీలక వడ్డీ రేట్లు యథాతథం

నిపుణుల అంచనాలను నిజం చేస్తూ.. మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్​బీఐ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 వద్ద కొనసాగనున్నట్లు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ శుక్రవారం ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నట్లు సంకేతాలు వచ్చినప్పటికీ.. ఆర్​బీఐ సర్దుబాటు వైఖరిని కొనసాగించడం గమనార్హం. కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడం వరుసగా ఇది 8వ సారి.

  • ఆ అహంకారంతోనే.. 

ముస్లింల ఓట్లు తెరాసకు తప్ప ఎవరికీ పడవనే అహంకారంతోనే వారిని ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana Chief Minister KCR) పట్టించుకోవడం లేదని భాజపా నేత ఈటల రాజేందర్(Bjp Candidate Etela Rajender) విమర్శించారు. ఎస్సీలకు దళితబంధు(Dalit Bandhu)లాగే.. ముస్లింలకు మైనార్టీబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

  • గెజిట్‌ అమలుపై కేంద్రం కసరత్తు

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్ అమలుకు.. కేంద్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ విషయంలో పురోగతిని సమీక్షించిన... కేంద్ర జలవనరుల విభాగం అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ ఎలా ముందుకెళ్లాలనే అంశంపై బోర్డు ఛైర్మన్లు, సభ్యులతో సమాలోచనలు జరిపారు. మరోవైపు గెజిట్‌ అమలుపై చర్చించేందుకు రెండు బోర్డులు ఈనెల 12న ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశాయి.

  • శంకర్ మహదేవన్​ పాటకు సీఎం డ్యాన్స్​

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ డాన్స్‌తో అలరించారు. ఛాంద్‌ఖురైలోని మాతా కౌసల్య దేవి దేవాలయం ప్రారంభోత్సవానికి సీఎం బఘేల్‌ వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో ప్రఖ్యాత గాయకుడు శంకర్ మహదేవన్​ పాడిన పాటకు ముఖ్యమంత్రి నృత్యంతో ఆకట్టుకున్నారు. పార్టీ నేతలు కూడా బఘేల్‌తో కలిసి స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

  • పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర (Silver price today) స్థిరంగా ఉంది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

09:53 October 08

టాప్​న్యూస్​ @ 10 AM

  • రంగంలోకి ఈడీ

తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణంలో సీసీఎస్​ పోలీసులు (Telugu Academy Case) కేసు దర్యాప్తు వేగవంతంగా చేశారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. మరికొందరిని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా... తాజాగా తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో ఈడీ రంగలోకి దిగింది. రూ.కోట్ల డిపాజిట్ల మళ్లింపు కేసులో దర్యాప్తు చేయనుంది. మనీలాండరింగ్​ చట్టం కింద ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. 

  • వెంకట్​ ఆస్తులెంత? అతనిపై ఉన్న కేసులెన్నో తెలుసా?

హుజూరాబాద్​ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్​(Huzurabad congress candidate Venkat) ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మరో కాంగ్రెస్ నేత దామోదర్ రాజనర్సింహ పాల్గొననున్నారు. తనపై మొత్తం 24 కేసులున్నట్లు బల్మూరి వెంకట్(Huzurabad congress candidate Venkat)​ అఫిడవిట్​లో వెల్లడించారు.

  • గగన యోధులకు కోవింద్, మోదీ సలాం

శత్రువులను గగనతలంలోనే మట్టుబెట్టి, వెన్నులో వణుకు పుట్టించే సత్తా మన భారత వైమానిక దళానిది. పోరాటాల్లోనే కాదు, ప్రకృతి విపత్తు సమయాల్లోనూ భారత వాయిసేన అందించే సేవలు ఎంతో విశిష్టమైనవి. అంతటి ఘన చరిత్ర గల భారత వైమానిక దళ 89వ వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా.. రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ వాయుసేన యోధులకు శుభాకాంక్షలు తెలిపారు.

  • 205 రోజుల కనిష్ఠానికి కరోనా యాక్టివ్ కేసులు

భారత్​లో కరోనా కేసులు(Coronavirus update) క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. తాజాగా 21,257 మంది​ (Covid cases in India) వైరస్​ బారిన పడ్డారు. మరో 271 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 24,963 మంది కరోనాను జయించారు.

  • 'విష్ణు క్షమాపణ చెప్పాలి'

అక్టోబర్ 10న జరగబోయే 'మా' ఎన్నికల(maa eletions 2021) కోసం అటు ప్రకాశ్ రాజ్(prakash raj panel), ఇటు విష్ణు (machu vishnu panel) ప్యానెల్ ప్రచారాల పర్వం కొనసాగిస్తున్నాయి. ఈక్రమంలోనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా విష్ణు మాట్లాడిన మాటలపై స్పందించారు నాగబాబు. విష్ణు ప్యానెల్ సభ్యులు చీకటి యుగంలో బతుకుతున్నారంటూ వ్యాఖ్యానించారు.

08:53 October 08

టాప్​న్యూస్​ @ 9 AM

  • నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగింపు!

శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు(Telangana Assembly Sessions 2021) నేటితో ముగియనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నేటి సభలో.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇవాళ అన్ని బిల్లులకు ఆమోదం లభించనుంది. ముఖ్యమైన అంశాలపై చర్చలు పూర్తవనున్నాయి.

  • సరిహద్దులో భారత్​, చైనా సైనికుల మధ్య ఘర్షణ!

వాస్తవాధీన రేఖ విషయంలో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలకు తెరపడటం లేదు. గత వారం.. అరుణాచల్ సెక్టార్​లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ తలెత్తిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

  • సుప్రీంలో వారానికి మూడు రోజులు భౌతిక విచారణ

సుప్రీంకోర్టులో ఈ నెల 20 నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇకమీదట ప్రతి మంగళ, బుధ, గురువారాల్లో భౌతిక విచారణలు మాత్రమే చేపట్టనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సోమ, శుక్రవారాల్లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేయనుంది.

  • ఆ దేశాన్ని వెంటాడుతోన్న కొవిడ్‌ మరణాలు!

వివిధ దేశాల్లో కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ రష్యాలో మాత్రం మహమ్మారి మరణాలు విపరీతంగా పెరిగాయి. బుధవారం ఒక్కరోజే 929 కొవిడ్‌ మరణాలు నమోదు కాగా.. వరుసగా రెండోరోజు 924 మంది మృత్యువాతపడినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

  • పట్టుదలతో పతకం

రెజ్లింగ్​ ప్రపంచ ఛాంపియన్​షిప్​ పోటీలో(wrestling world championship 2021) రజతం గెలిచి చరిత్ర సృష్టించింది అన్షు మాలిక్(Anshu Malik News). అయితే.. ఈ పోటీల కోసం భారత రెజ్లర్లను ఎంపిక చేసే క్రమంలోనే ఆమె చేతికి గాయమైంది. ఈ నేపథ్యంలో ఆమెను పోటీలోంచి తప్పుకోవాలని వైద్యులు సూచించారు. కానీ, ఆమె పోరాట పటిమను వీడకుండా ముందడుగు వేసింది.

07:55 October 08

టాప్​న్యూస్​ @ 8 AM

  • 'అమ్మాయిని వేధిస్తావా? ఇక నీ పని అయిపోయింది!'

ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ అమ్మాయిలను బెదిరించి వారి భయాన్ని సొమ్ముచేసుకునే సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు ట్రెండ్(New Trend in Cyber Crimes) మార్చారు. అబ్బాయిల ఫొటోలను అమ్మాయిలతో సన్నిహితంగా ఉన్నట్లు మార్ఫింగ్ చేసి.. ఆడవాళ్లను వేధిస్తారా అంటూ నయా పంథాలో యువకులను బెదిరిస్తున్నారు. సెటిల్​మెంట్ చేసుకోకపోతే అరెస్ట్ చేస్తామంటూ భయపెడుతున్నారు. అమాయక యువత తామేం తప్పు చేయలేదని తెలిసినా.. బెదిరిస్తోంది పోలీసులేమోనని.. కేసు, కోర్టు ఉంటాయని భయపడి వారి మాయలో పడి అడిగినంత డబ్బు అప్పజెప్పుతున్నారు.

  • ఈటల రాజేందర్​పై 19 కేసులు

తెలంగాణ ఉద్యమ సమయం నుంచి అసెంబ్లీలో నిరసనల వరకు తనపై 19 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు మాజీ మంత్రి, హుజూరాబాద్‌ (Huzurabad by poll 2021 ) భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. రాజేందర్‌ తరపున ఆయన సోదరుడు భద్రయ్య ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు.

  • మూడు భాషల్లో అదరగొడుతున్న బుడతడు

పిట్ట కొంచెం కూత ఘనం అన్న చందంగా.. ఓ బుడతడు వయసులో చిన్నోడే.. కానీ మూడు భాషల్లో అలవోకగా మాట్లాడగలడు. ఆ చిన్నారిని కలిసిన.. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోదియా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు. 'ఈ బుడతడే తన కొత్త ఫ్రెండ్‌' అంటూ ఆయన ట్వీట్ చేశారు.

  • మనుకు నాలుగో పసిడి

జూనియర్ షూటింగ్ ప్రపంచ ఛాంపియన్​షిప్​లో(ISSF junior world championship 2021) మను బాకర్(Manu Bhaker News) మరో పసిడి సొంతం చేసుకుంది. ఫైనల్లో భారత జట్టు 16-4తో అమెరికాపై గెలిచింది.

  • నాకు చాలా సిగ్గు

యువ హీరో వైష్ణవ్ తేజ్(vaishnav tej kondapolam), రకుల్​ప్రీత్ ప్రధానపాత్రల్లో క్రిష్ తెరకెక్కించిన చిత్రం 'కొండపొలం'. నేడు (అక్టోబర్ 8) థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విలేకర్లతో ముచ్చటించిన వైష్ణవ్(vaishnav tej interview) పలు విషయాలు వెల్లడించారు.

06:56 October 08

టాప్​న్యూస్​@7AM

  • గుప్పెడంత గుండెకు కొండంత భరోసా

గుండెపోటు బాధితులకు తక్షణమే చికిత్సను అందించి ప్రాణాలు నిలపడానికి గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర చికిత్స అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలోని 24 కేంద్రాల్లో స్టెమీ ప్రాజెక్ట్(STEMI Project in Telangana)​ పేరుతో 'గోల్డెన్ అవర్' చికిత్సను జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని సీహెచ్‌సీల్లో అందుబాటులోకి తెచ్చింది.

  • 'ముద్దపప్పు బతుకమ్మ' విశేషాలు..

తెలంగాణలో అత్యంత వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. పెత్రమాస మొదలుకొని దుర్గాష్టమి వరకు తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తారు. పసుపు, కుంకుమలతో ఆ గౌరమ్మను కొలుస్తారు. తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ వేడుకల్లో ఒక్కో రోజుది ఒక్కో ప్రత్యేకత. రోజుకో రకమైన పూలతో.. రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు. మూడో రోజు బతుకమ్మ(Bathukamma day 3, 2021) పేరు.. నైవేద్యం ఏంటో తెలుసా?

  • మయన్మార్​లో భూకంపం

మయన్మార్​లో భూకంపం(Myanmar Earthquake News) సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత నమోదైంది.

  • కాజల్​ నుంచి గుడ్​న్యూస్

తెలుగు స్టార్ హీరోయిన్​ కాజల్(kajal aggarwal marriage news).. త్వరలో గుడ్​న్యూస్ చెప్పనుంది. అయితే ఆ విషయం ఏంటి? దేని కోసం? అనేది తెలియాల్సి ఉంది.

  • పన్ను స్వర్గాల్లో నోట్ల గుట్టలు..

ప్రజల కళ్లుగప్పి వేల కోట్ల డాలర్ల నిధులను విదేశాల్లోని బ్యాంకు ఖాతాలకు అక్రమంగా తరలించిన ప్రబుద్ధుల్లో దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు, సంఘ ప్రముఖులు, మత నాయకులు కూడా ఉండటం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. అపర కుబేరులు, నాయకులు స్వదేశంలో అధిక పన్నుల బారి నుంచి తప్పించుకుని అవినీతి సొమ్మును దాచుకోవడానికి పనామా, దుబాయ్‌, మొనాకో, స్విట్జర్లాండ్‌, కేమన్‌ ఐలాండ్స్‌ వంటివి అవకాశమిస్తున్నాయి. 

05:06 October 08

టాప్​న్యూస్​@6AM

 కొత్త కోర్సులకు అనుమతివ్వండి

రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో కొత్త కోర్సులకు అనుమతివ్వాలని జేఎన్టీయూ హైదరాబాద్​ను హైకోర్టు ఆదేశించింది. సంప్రదాయ కోర్సుల్లో సీట్లు తగ్గించి కొత్త వాటికి అనుమతి ఇవ్వాలని కోరుతూ 11 ఇంజినీరింగ్ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. 

 కేంద్రంపై పోరాటం

భాజపా, కాంగ్రెస్(BJP, CONGRESS).. పార్టీలు మాత్రమే వేరని.. కానీ ఆ రెండింటి వైఖరి ఒకటేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రాలపై నియంత పోకడ చూపడం ఆ రెండు పార్టీలు ఒకే విధానాన్ని అవలంభిస్తాయని చెప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం అవసరమైతే కేంద్రంతో పోరాడుతామని(Cm Kcr Fire on Central Government) హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్(Cm Kcr Speech in assembly) సుధీర్ఘంగా మాట్లాడారు.

 'కోట్లు కొల్లగొట్టారు'

తెలుగు అకాడమీ డిపాజిట్లను కొల్లగొట్టిన ముఠా సభ్యులు ఆ నగదును సొంతానికి వాడుకున్న తీరు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఒక్కసారిగా పెద్దమొత్తంలో సొమ్ము చేతికి రావడంతో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. కావాలంటే స్థలాలు ఇచ్చేస్తాం.. కేసులేకుండా చూడాలని నిందితులు పోలీసులను వేడుకున్నట్లు తెలిపారు.

నేేడే రామోజీ ఫిల్మ్​ సిటీ   రీఓపెన్​

ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ.. పర్యటకులకు స్వాగతం పలుకుతోంది. శుక్రవారం సందర్శకుల కోసం పునఃప్రారంభం కాబోతోంది. పర్యటక స్వర్గధామం ఫిల్మ్‌సిటీలో వినోదాలను ఆస్వాదిస్తూ విహారానుభూతిని సొంతం చేసుకోవడానికి సకుటుంబ సమేతంగా విచ్చేసి ఆనందించే అవకాశం కల్పిస్తున్నారు. ఒక్కసారి వీక్షించి.. మీ హాలిడేను చిరస్మరణీయంగా మలచుకోండి.

మత్తుకు యువత చిత్తు

‘మత్తు’ కోసం యువతలో కొత్తదారులు తొక్కుతోంది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడినవారు నొప్పి నివారణ మాత్రలు మత్తుకోసం వాడుతున్నట్లు బయటపడింది. ‘ట్రెమడాల్‌’ సమ్మిళిత ఔషధాన్ని ఇలా వాడుతున్నట్లు తేలింది. చాలా మందుల షాపుల్లో వీటిని వైద్యుల సిఫార్సు లేకుండానే అమ్ముతున్నట్లు వెల్లడైంది. నల్గొండలో ఇది వెలుగులోకి రావడంతో.. రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ అప్రమత్తమైంది.

డిగ్రీ వైపు చూస్తనే లేరు

రానురాను రాష్ట్రంలో సంప్రదాయ డిగ్రీ కోర్సుల (Traditional Degree Courses) పట్ల విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. బీఏ, బీకాం, బీఎస్సీ వంటి డిగ్రీ కోర్సుల్లో (Degree Admissions) సీట్లు మిగిలిపోతూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా సుమారు 2 లక్షలకు పైగా సీట్లు మిగిలిపోయాయి.\

ఘనంగా అటుకుల బతుకమ్మ ఉత్సవాలు

రెండో రోజు బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. అటుకుల బతుకమ్మగా పిలిచే వేడుకల్లో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రకరకాల పూలతో పేర్చిన బతుకమ్మలు ఆకట్టుకున్నాయి.

 అగ్రస్థానంలో అంబానీ!

గురువారం ఫోర్బ్స్‌ విడుదల చేసిన భారత కుబేరుల జాబితాలో (Forbes Richest List) రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్​ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. అదానీ గ్రూప్స్​ ఛైర్మన్​ గౌతమ్​ అదానీ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

భారత్​ ప్రయాణికులపై ఆంక్షల సడలింపు

భారత్ నుంచి వెళ్లే ప్రయాణికులపై ఆంక్షలను సడలిస్తున్నట్లు బ్రిటన్​ (Britain Covid Rules) ప్రకటించింది. ఇక నుంచి కొవిషీల్డ్​ రెండు డోసులు తీసుకున్న వారికి క్వారంటైన్​ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది.

 కోల్​కతా భారీ విజయం.. ప్లేఆఫ్స్​ బెర్తు ఖరారు!

​కోల్​కతా నైట్​రైడర్స్​ ఆల్​రౌండ్​ ప్రదర్శనతో ఆకట్టుకుంది. గురువారం జరిగిన రెండో మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​ 85 పరుగులకే కుప్పకూలగా.. 86 రన్స్​ తేడాతో మోర్గాన్​ సేన భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

Last Updated : Oct 8, 2021, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.