జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం(JANASENA PARTY MEETING) ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆ రాష్ట్ర కార్యాలయంలో(JANASENA PARTY OFFICE) ఇవాళ జరగనుంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్(PAWAN KALYAN) ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై సమావేశంలో చర్చ జరగనుంది. పాడైపోయిన రహదారులతో జనం ఇబ్బందులు, ట్రూఅప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులు, పెట్రో ధరలు, ఇసుక సమస్యపై ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు.
అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న శ్రమదానం కార్యక్రమానికి సంబంధించి పార్టీ నేతలకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమాలోచనలు జరపనున్నారు. వైకాపా ప్రభుత్వ విధానాలపై రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ చేసిన విమర్శలు... అందుకు ప్రతిగా వైకాపా నేతల దూషణలు కొనసాగుతున్న తరుణంలో నేటి జనసేన సమావేశంపై ఆసక్తి నెలకొంది.
ఇదీ చూడండి: కుమార్తెనే గర్భవతిని చేసిన తండ్రి.. అబార్షన్‌కు ఒప్పుకోలేదని...