Kodandaram on Gurrambodu Lands: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో పేదల భూములు ఆక్రమించుకున్న కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని తెజస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. గుర్రంబోడు, తుమ్మల తండా, బోజ్య తండా, కృష్ణా తండా బాధితుల గోడును వినిపించారు. బిహార్, యూపీ గూండాలతో ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకుని.. గిరిజనులపై పాశవికంగా దాడులు చేయిస్తున్నారని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయమని కోరితే ముఖ్యమంత్రి కేసీఆర్... రాజ్యాంగం మార్చాలని అంటున్నారని విమర్శించారు. భూ అక్రమణదారులకు ఎమ్మెల్యే, ప్రభుత్వం అండగా ఉందని కోదండరాం ఆరోపించారు.
కబ్జాదారులకు ప్రభుత్వం అండ..
"పేదల భూములను ఆక్రమించుకునే వారికి ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులే ఉండగా ఉంటున్నారు. గిరిజనులను కొట్టి మళ్లీ వారిపైనే కేసులు పెడుతున్నారు. అసైన్డ్ భూమి క్రయవిక్రయాలు చెల్లవని కోర్టు చెప్పింది. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి. కబ్జాదారులకు అండగా ఉన్న ఎమ్మెల్యే పైనా చర్యలు తీసుకోవాలి. గుర్రంబోడు గిరిజనులకు సర్కార్ న్యాయం చేయాలి. అప్పటి వరకు మా పోరాటం ఆగదు. ఆందోళనలతో అడుగడుగునా ప్రభుత్వానికి అడ్డుపడతాం."
- కోదండరాం, తెజస అధ్యక్షుడు
- ఇదీ చదవండి : గుర్రంబోడు తండా వివాదాస్పద భూముల వెనుక కథేంటంటే?