ETV Bharat / city

'నేను కేసీఆర్​ను కలవలేదు... తప్పుడు ప్రచారమన్న కోదండరాం'

సీఎం కేసీఆర్​ను తాను కలిశానని వస్తున్న వార్తలు అవాస్తవమని తెజస అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. పట్టభద్రులెవరూ దుష్ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

tjs leader kodandaram reacted on met with cm kcr news

author img

By

Published : Mar 14, 2021, 12:30 PM IST

'నేను ఎవరినీ కలవలేదు... కలవాల్సిన అవసరమూ లేదు'

ముఖ్యమంత్రి కేసీఆర్​ను ఫామ్​హౌస్​లో కలిసినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను తెజస అధ్యక్షుడు కోదండరాం ఖండించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎవరినీ కలవలేదని... కలవాల్సిన అవసరమూ లేదని ఉద్ఘాటించారు.

శనివారం రాత్రి తాను హన్మకొండలోనే ఉన్నానని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. తన గెలుపును ఓర్వలేని వారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని... పట్టభద్రులెవరూ దుష్ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కోదండరాం తెలిపారు.

ఇదీ చూడండి: మహబూబాబాద్​లో తెరాస-వామపక్ష కార్యకర్తల మధ్య ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.