Tension at Srisailam: శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. టీ దుకాణం వద్ద.. కన్నడ భక్తులు, స్థానికులకు మధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. టీ దుకాణానికి కన్నడ యువకులు నిప్పు పెట్టడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాడిలో కన్నడ భక్తుడు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని.. 108 అంబులెన్స్‌లో సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడిని జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ పండితారాధ్య స్వామి పరామర్శించారు.
కోపోద్రిక్తులైన కన్నడ యువకులు పురవీధుల్లో సంచరిస్తూ తాత్కాలిక దుకాణాలుు, వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో వ్యాపారస్తులు, స్థానికులు బిక్కుబిక్కుమంటూ అర్ధరాత్రి కాలం గడిపారు. దాడులు ఉద్ధృత స్థాయికి చేరడంతో డీఎస్పీ శృతి హుటాహుటిన శ్రీశైలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఇదీ చదవండి: కస్టమర్‌పై హోటల్ సిబ్బంది విచక్షణారహితంగా దాడి.. వీడియో వైరల్..